ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ , పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ , లోకేషన్స్ , దల్కేర్ సల్మాన్ , నిత్యా మీనన్ కెమిస్ట్రీఎఆర్ రెహమాన్ మ్యూజిక్ , పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ , లోకేషన్స్ , దల్కేర్ సల్మాన్ , నిత్యా మీనన్ కెమిస్ట్రీ స్టోరీ లైన్ , ఊహాజనితమైన కథనం , రొటీన్ క్లైమాక్స్ , సెకండాఫ్ ని సాగదీయడం , ఎడిటింగ్

యవ్వనంలో ఉన్న ఆది(దల్కేర్ సల్మాన్), తార(నిత్యా మీనన్)లు ముంబైలో నివసిస్తూ కార్పోరేట్ కంపెనీలో పనిచేస్తూ ఎవరి లైఫ్ ని వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీరిద్దరికీ సంబధం లేకపోయినా వీరిద్దరిలో ఉన్న కామన్ పాయింట్ పెళ్లి అన్న రిలేషన్ అంటే ఇష్టం ఉండదు, నమ్మకం కూడా ఉండదు. అలాంటి వీరిద్దరూ ఒక పెళ్ళిలో కలిసి ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత తక్కువ కాలంలోనే ఈ ఫ్రెండ్స్ కాస్తా లిన్వింగ్ రిలేషన్ లోకి షిఫ్ట్ అవుతారు. అలా కొద్ది రోజులు లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ గా ఓ రోజు తమ కెరీర్ పరంగా ఎవరి వారు అబ్రాడ్ వెళ్లి తమ జీవనాన్ని కొనసాగించాలి అనుకుంటారు. అప్పుడే కొన్ని అవాంతరాలు వస్తాయి. ఆ టైంలో వీరిద్దరూ ఎప్పటి వారి మైండ్ సెట్ లానే విడిపోయి వారి వారి పని మీద వెళ్లిపోయారా.? లేక తమ కెరీర్ ని వదులుకొని కలిసిపోయారా.? ఇంతకీ వీరికి ఎవరి నుంచి అవాంతరాలు వచ్చాయి.? వీరిని పెళ్లి వైపు నడిపించాలన్న ఆలోచన ఎవరిది.? అన్న విషయాలు మీరు వెండితెరపైనే చూడాలి.

ఈ సినిమా హీరో దల్కేర్ సల్మాన్ ప్రస్తుత మళయాల ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేస్తున్న హీరో, సౌత్ లోని అన్ని భాషల్లోనూ యంగ్ హీరోలకి హిట్స్ ఇస్తున్న హీరోయిన్ నిత్యా మీనన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ ఫిలిమ్స్ (ఉస్తాద్ హోటల్, 100 డేస్ అఫ్ లవ్, బెంగుళూరు డేస్) ఇప్పటికే మలయాళంలో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ అదే మేజిక్ ని తెలుగులో కూడా రిపీట్ చేసారు. దల్కేర్ సల్మాన్ – నిత్యా మీనన్ ల కెమిస్ట్రీనే ఈ సినిమాకి ప్రధాన బలం. ఈ రెండు పాత్రల్లో వీరిద్దరినీ తప్ప మరెవరినీ ఊహించుకోలేం. ఉదాహరణకి ఫస్ట్ హాఫ్ లో అస్సలు కథ ముందుకు వెళ్లకపోయినా వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన ప్రతి ఒక్కరూ కథ గురించి మర్చిపోతారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ తమ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని అంతలా మేజిక్ చేస్తారు. పెర్ఫార్మన్స్ పరంగా ఇద్దరూ ది బెస్ట్ అనిపించుకున్నారు. అలాగే యంగ్ హీరో నాని దల్కేర్ సల్మాన్ కి అందించిన వాయిస్ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. సినిమాకి కీలకమైన పాత్రల్లో ప్రకాష్ రాజ్ - లీలా శామ్సన్ లు కనిపించారు. ప్రకాష్ రాజ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేసాడు. అతనికి జోడీగా చేసిన లీలా శామ్సన్ కూడా పెర్ఫార్మన్స్ తో మెప్పిస్తుంది. కావున నటీనటుల పరంగా ఎవరినీ తక్కువ చేయక్కర్లేదు. ప్రతి ఒక్కరూ సూపర్బ్ గా చేసారు. 

డైరెక్టర్ గా చాలా రోజుల నుంచి వరుసగా విఫలమవుతూ వస్తున్న టాప్ డైరెక్టర్ మణిరత్నం. ఇన్ని సార్లు ఫెయిల్ అయినా ఈ సారి మాత్రం ఫెయిల్ అవ్వలేదనే చెప్పాలి. అలా అని మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ సినిమా తీసాడని చెప్పడం లేదు. ఇప్పటి వరకూ ఆయన తీసిన సినిమాల్లో ఓకే బంగారం అనేది వెరీ డీసెంట్ అండ్ ఫుల్ క్లాస్ మూవీ. ఇదే కాన్సెప్ట్ తో తెలుగులో కూడా ఓ సినిమా వచ్చింది. అదే 'అంతకముందు ఆ తరువాత'. కాన్సెప్ట్ పరంగా మనకు చాలా పోలికలు కనిపిస్తాయి. మణిరత్నం ఎంచుకున్న స్టొరీ లైన్ ఇప్పటి యుబతని ప్రతిబింబించేలా ఉన్నా కథా విస్తరణ చివరికి వచ్చే సరికి బాగా రొటీన్ అయిపోయింది. అంత రొటీన్ గా చెప్పడానికి ఇంత అడ్వాన్స్ కాన్సెప్ట్ ని ఎంచుకోవడం దేనికి చెప్పండి. ఈ కథ ముగింపుని మనం చాలా రోజుల నుంచే చూస్తున్నాం, ఇప్పుడు కొత్తగా మణిరత్నం చెప్పింది అంటూ ఏమీ లేదు. కథ చెప్పకుండా ఫస్ట్ హాఫ్ లో మేజిక్ చేయగలిగినా సెకండాఫ్ లో మాత్రం ఆ మేజిక్ ని రిపీట్ చేయలేకపోవడమే కాకుండా, బాగా సాగదీస్తున్నారు ఏందీ అనే ఫీలింగ్ ని డెవలప్ చేసారు. సెకండాఫ్ లో సుమారు 20నిమిషాలు ఆడియన్స్ కి భీభత్సమైన బోరింగ్ గా ఉంటుంది. సరే రొటీన్ గా చెప్పారుపో.. అని ఊరుకుండం అంటే దాన్ని కన్విన్సింగ్ గా చెప్పకపోవడం మరో మేజర్ మైనస్ పాయింట్. ఆ లాజిక్ ఎందుకు ఇస్ అయ్యారో నాకు అర్థం కాలేదు. విషయం ఏమిటంటే ముందు నుంచి పెళ్లి అంటే మంచి ఒపినియన్ లేని ఓ ఇద్దరు పెళ్లి వైపు అడుగేయాలి అంటే వారికి ఓ బలమైన కారణం చూపించాలి. కానీ ప్రకాష్ రాజ్ - లీలా ల ద్వారా చూపిన కారణం అంత కన్విన్సింగ్ గా లేదు. అంటే ఫస్ట్ లో వారిన చూపిన దానికి, వారు మారడానికి చూపిన కారణం చాలా సిల్లీగా ఉంటుంది. మణిరత్నం లాంటి వారైన రొటీన్ ముగిమ్పుకే మొగ్గు చూపాలని మరోసారి నిరూపించాడు. చివరిగా మణిరత్నం రాసుకున్న లైన్ లో కొత్తదనం ఉన్నా కథ విస్తరణ మాత్రం రొటీన్ గా ఉంది. కథనంలో కాస్త మేజిక్ కనిపిస్తుంది. కథనంలో రాసిన మేజిక్ ని డైరెక్షన్ లో ఆవిష్కరించగలిగాడు. అందుకే ఈ సినిమా డీసెంట్ గా నిలిచింది.


ఇక ఈ సినిమాకి ప్రాణం పోసిన వారు మరో ఇద్దరు ఉన్నారు వాళ్ళే సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరాం మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్. పిసి శ్రీరాం ప్రతి ఫ్రేం ఎంతో రొమాంటిక్ గా చూపిచ్న్హదానికి ట్రై చేసాడు. నటీనటుల్లో చూపిస్తున్న రొమాన్స్ ని ఆయన తన లైటింగ్, విజువల్స్ లో చూపించాడు. ఇక ఎఆర్ రెహమాన్ ఆ ఫీలింగ్ కి ప్రాణం పోసి మనముందుకు తీసుకు వచ్చాడు. రెహమాన్ కంపోజ్ చేసిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అక్కడక్కడా ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ని కలిగించినా, ఓవరాల్ గా ఓకే అనిపిస్తుంది. మద్రాస్ టాకీస్ - దిల్ రాజు నిర్మాణ విలువలు మాత్రం హై రేంజ్ లో 

 సౌత్ అండ్ ఇండియన్ సినిమా ప్రపంచంలో మణిరత్నం అనే పేరుకి ఓ గుర్తింపు ఉంది. కానీ అంత గుర్తిపు ఉన్నా ఈయనకి గత కొన్నేళ్లుగా పరాజయాలే పలకరిస్తున్నాయి. ఆ పరాజయాలను చూసి కృంగిపోని మణిరత్నంకి చాలా రోజుల తర్వాత లభించిన హిట్ 'ఓకే బంగారం'. మామూలుగా తెలుగు ప్రేక్షకులు రొమాంటిక్ లవ్ స్టోరీస్ ని బాగా ఆస్వాదిస్తారు. అదే మణిరత్నం లవ్ స్టొరీ అంటే మరీ ఎక్కువ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునేంత లేకపోయినా చూడదగ్గ విధంగా ఈ సినిమా ఉంది. నేటి సమాజంలో ఉన్న యువతలోని భావాలను తీసుకొని వారిని ఎక్కువగా అట్రాక్ట్ చేయాలనే కాన్సెప్ట్ తో చేసిన ఈ క్రేజీ లవ్ స్టొరీ యువతకి బాగా నచ్చుతుంది. అదే బేస్ చేసుకొని కథని రాసుకున్న మణిరత్నం రొటీన్ ఎండింగ్ కి వెళ్ళడం ఆయన చేసిన పెద్ద మైనస్. సెకండాఫ్ ని ఇంకాస్త ఎంగేజింగ్ గా, కన్విన్సింగ్ గా చెప్పగలిగి ఉంటే సూపర్బ్ మూవీ అయ్యేది. దల్కేర్ సల్మాన్, నిత్యా మీనన్ ల మాజికల్ కెమిస్ట్రీ, ఎఆర్ఆర్ మ్యూజిక్, పిసి శ్రీరాం విజువల్స్ మిమ్మల్ని ప్రేమలో పడేస్తాయి. ఒకవేళ ప్రేమలో ఉన్నవారికైతే ఓ తియ్యని అనుభూతిని కలిగిస్తుంది. మల్టీ ప్లెక్స్, ఎ సెంటర్స్, అర్భన్ ఆడియన్స్ కి బాగా నచ్చే ఈ సినిమా బి,సి సెంటర్ ఆడియన్స్ కి పెద్దగా నచ్చదు. ఓవరాల్ గా 'ఓకే బంగారం' చూడదగిన సినిమానే కాకుండా ఈ వారం కాసులను కూడా కురిపిస్తుంది. 

Dulquer Salmaan,Nithya Menon,Mani Ratnam,Dil Raju,A R Rahman.పంచ్ లైన్ : ఓకే బంగారం – ఈ వారం బాక్స్ ఆఫీస్ బంగారం ఇదే.!

మరింత సమాచారం తెలుసుకోండి: