ఫస్ట్ హాఫ్ లో కామెడీ , అక్కడక్కడా భయపెట్టే కొన్ని థ్రిల్స్ , లారెన్స్, తాప్సీ, నిత్యా మీనన్ ల పెర్ఫార్మన్స్ ఫస్ట్ హాఫ్ లో కామెడీ , అక్కడక్కడా భయపెట్టే కొన్ని థ్రిల్స్ , లారెన్స్, తాప్సీ, నిత్యా మీనన్ ల పెర్ఫార్మన్స్ కథ , ఊహాజనితమైన కథనం , సెకండాఫ్ లో సినిమా వేగం అమాంతం పడిపోవడం , నాశిరకమైన 'గ్రాఫిక్స్' , ఎడిటింగ్ , కర్ణబేరి పగిలేలా ఆద్యంతం లౌడ్ గా ఉండడం , వీక్ ఫ్లాష్ బ్యాక్

రాఘవ(రాఘవ లారెన్స్) గ్రీన్ టీవి లో కెమెరా మెన్ గా పని చేస్తుంటాడు, టాప్ ప్లేస్ లో ఛానల్ రెండవ స్థానానికి పడిపోతుంది. తిరిగి ఈ ఛానల్ ని ఎలాగయినా మొదటి స్థానానికి తీసుకురావాలని మీటింగ్ ఏర్పాటు చేస్తుంది ఆ ఛానల్ ఓనర్ సుహాసిని. అవతలి ఛానల్ దేవుడి మీద కార్యక్రమం చేసి మొదటి స్థానానికి వచ్చింది అని మనం కూడా అలాంటిదే ఒక కార్యక్రమం చేస్తే ఛానల్ తిరిగి మొదటి స్థానానికి వస్తుంది అని సలహా  ఇస్తారు కాదు దేవుడి గురించి కార్యక్రమం చేసారు కాబట్టి మనం దయ్యం గురించి ప్రోగ్రాం చేద్దాం అని సలహా ఇస్తుంది నందిని(తాప్సీ), లేనిది ఉన్నట్టు చూపించి భయాన్ని సృష్టించి మన ఛానల్ టిఆర్పీ పెంచాలని ఆలోచన, అందుకోసం ఒక భీమిలి బీచ్ లో పాతబడిన ఇంటిలో షూటింగ్ చెయ్యాలని నిర్ణయించుకుంటారు.  స్వతహాగా భయస్తుడు అయిన రాఘవని ఈ ప్రోగ్రాంకి కెమెరామెన్ గా నియమించుకుంటారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో నందినికి అనుకోకుండా ఒక తాళి దొరుకుతుంది. అప్పటి నుండి వారు పలు సమస్యలను ఎదుర్కుంటారు. ఆ తాళి ఎవరిది? గంగ ఎవరు? గంగ పిలిచిన శివ ఎవరు.? లాంటి ప్రశ్నలకు తెర మీదనే సమాధానం దొరుకుతుంది ... 

రాఘవ లారెన్స్ ఎప్పటి లానే పిరికివాడి పాత్రలో ఆకట్టుకోడమే కాకుండా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు, కానీ రెండవ అర్ధ భాగంలో మాత్రం అవసరానికి మించిన పాత్రలను తను ఒకడే చేసేసి ప్రేక్షకుల దగ్గర మార్క్స్ కొట్టేయ్యాలని అనుకున్నారు. కానీ అవసరం లేనప్పుడు ఎన్ని పాత్రలను చేసినా వ్యర్థం. నిత్యమీనన్  వైకల్యంతో ఉన్న అమ్మాయి పాత్రలో తన నటన చాలా బాగుంది. ఎప్పటిలానే తన శైలిలో ప్రేక్షకుడిని కట్టిపడేసింది. తాప్సీ తన అందంతో ఆకట్టుకుంది.. చిత్రం మొదట్లో తను భయపడుతూ ప్రేక్షకులను భయపెట్టింది. నటనలో చిత్రంలోకి పోయే కొద్ది ఆమెలో కృత్రిమ తత్వం కనిపిస్తుంది. తనకి ఇంత పెద్ద పాత్ర చేయడం కష్టతరమైనా ఎక్కడా తగ్గకుండా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసింది. కోవై సరళ, రేణుకల చేత చేయించిన కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. పూజ రామచంద్రన్, మనోబాల, శ్రీమాన్ పలువురు వారి పాత్రకు తగ్గ ప్రదర్శన కనబరిచారు.. 

దర్శకుడిగా లారెన్స్ పరవాలేదనిపించాడు, ఇప్పటికే వచ్చిన ముని మరియు కాంచన ల కథ ఈ చిత్ర కథ ఒక్కటే అయినా కథనంలో వేగంతో ఆ విషయాన్నీ గమనించే అవకాశం ఇవ్వలేదు. కానీ ఈ సినిమాలో ఆ మేజిక్ కి క్రియేట్ చేయలేకపోయాడు. దానికి ప్రధాన కారణం ఈ ప్రాంచైజీలో మూడవ పార్ట్ కి చాలా పేలవమైన కథని ఎంచుకోవడం, అంతకన్నా దారుణమైన కథనాన్ని రాసుకోవడం. మొదటి అర్ధ  భాగం నవ్వులతో నడిచిపోయినా కీలకమయిన రెండవ అర్ధ భాగంలో ఇంకా కీలకమయిన ఫ్లాష్ బ్యాక్ లో కథనం కాస్త పట్టు తప్పినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా కథనంలో పట్టులేకపోవడం వలన ఫస్ట్ హాఫ్ లో కామెడీ తో లాగేసినా సెకండాఫ్ లో అసలైన కథ చెప్పాలి, కానీ కథ  స్ట్రాంగ్ గా లేకపోవడం వలన పిచ్చ బోరింగ్ గా అనిపించడమే కాకుండా బాగా రొటీన్ గా అనిపిస్తుంది. ఇది సీక్వెల్ కావున అదే ఫ్లేవర్ కనిపించినా కథ - కథనంలో కొత్తదనం ఉండాలి. కానీ అదే ఇక్కడ మిస్ అయ్యింది. ఫస్ట్ రెండు పార్ట్స్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని చాలా స్ట్రాంగ్ గా రాసుకున్న రాఘవ లారెన్స్ ఈ సినిమాలో ఎందుకంత సింపుల్ గా రాసుకున్నాడు అన్నది ఆయనకే తెలియాలి. అలాగే తెలుగులో చాలా చోట్ల అరవ వాసన, అరవ పైత్యం ఎక్కువ కనపడుతుంది. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే సెకండాఫ్ లో తాప్సీ పాత్రకి దెయ్యం పట్టించి అని చెప్పడానికి ఒక సీన్ సరిపోద్ది దానికోసం కథని 15- 20 నిమిషాలు సాగదీయాల్సిన ఆవాసమ లేదు, సరే అది పోనీ ఆ తర్వాత చెప్పే అసలు కథ అన్నా బాగుండాలి కదా, సరే అదీ పోనీ ఆ కథ రెగ్యులర్ గా ఉండకూడదు కదా.? ఇలాంటి పాయింట్స్ మిస్ అయితే సినిమా ఎలా ఎక్కుతుంది ప్రేక్షకులకి.. మీరే చెప్పండి.. ఇకపోతే చిత్ర నిడివి ఎక్కువగా ఉండటం కూడా ఈ సినిమాకి పెద్ద సమస్య. సినిమాలో దాదాపు 20నిమిషాల పైనే కత్తిరించేసినా సినిమాలో అస్సలు తేడా ఉండదు, అలాగే ఏదైనా మిస్ అయ్యాం అన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఈ లెంగ్త్ సినిమా ఫస్ట్ హాఫ్ పై పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, ఎప్పుడైతే సెకండాఫ్ లో ఒక్కసారిగా ఫేస్ పడిపోయి మరీ ఊహాజనితంగా, పరమ రొటీన్ గా తయారవుతుందో అప్పుడు ఆడియన్స్ కి సినిమాని  సాగాదీసేసాడు, ఇక సాగదీసింది చాలు కట్ చేసి అసలు కథలోకి వచ్చేయండి అనే ఫీలింగ్ వస్తుంది. ఎడిటింగ్ అంత గొప్పగా లేకపోవడం ఈ సినిమాకి మరో మైనస్. సెకండాఫ్ లో ఆడియన్స్ పరిస్థితిని గెస్ చేసి కూసింత రన్ టైంని తగ్గించాల్సింది. రాజవేల్, కిషోర్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో సీన్స్ వరకూ ఆయనవంతు న్యాయం చేసాడు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా నాశిరకంగా ఉన్నాయి. బహుశా నాశిరకం అనే పదం కూడా అవ్వచ్చు. అంత దారుణంగా ఉన్నాయి. సినిమాకి చాలా కీలకం అయిన  క్లైమాక్స్ లో వచ్చే సిజి వర్క్ ఆడియన్స్ కి అస్సలు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. ఇకపోతే హర్రర్ కామెడీ సినిమాలకు హైలైట్ గా నిలవాల్సింది మ్యూజిక్. ఈ సినిమాలో కూడా మ్యూజిక్  బాగానే ఉంది. కానీ కర్నబెరి పగిలిపోయేంత లౌడ్ గా తమన్ నేపధ్య సంగీతం ఇచ్చాడు. ఎంత ఇష్టం ఉన్నా ఒక మోతాదుకు మించి తినలేం, అలాగే అవసరానికి మించి డమ్మాల్, డిమ్మీల్ అంటూ వచ్చే మ్యూజిక్ మాత్రం ఆడియన్స్ కి తలనొప్పి తెప్పిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే. 

'ముని', 'కాంచన' లాంటి  సీక్వెల్స్ తర్వాత  కొనసాగింపుగా రాఘవ లారెన్స్ చేసిన పాంచైజీ 'గంగ'. గత రెండు పార్ట్స్ కి మేజర్ పాయింట్ స్ట్రాంగ్ కథ ఈ సినిమా పెద్దగా ఎక్కకపోవడానికి కారణంలో కథలో డెప్త్ లేకపోవడం. మొదటి రెండు పార్ట్స్ లో కామెడీ సీన్స్ ఉన్నాయి, కొని హర్రర్ సీన్స్ ఉన్నాయి.. లేటెస్ట్ గంగలో కూడా ఇవన్నీ ఉన్నాయి అంత వరకూ ఓకే.. కానీ  రెండు పార్ట్స్ కి హెల్ప్ అయ్యింది చాలా స్ట్రాంగ్ మరియు కొత్తగా ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కానీ ఈ సినిమాలో మిస్ అయ్యిందే అదే.. నిత్యా మీనన్ పై వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతగా అనిపించదు. అలాగే లారెన్స్ సీక్వెల్ సీక్వెల్ కి దెయ్యాల సంఖ్యని పెంచుకుంటూ వస్తున్నాడు, మొదట ఒకటి, ఆ తర్వాత 3 ఇప్పుడేమో 6. ఎమన్నా అంటే అన్నాను అంటారు, కథలో కంటెంట్ లేకుండా 6 మంది దెయ్యాలను పెడితే ఆడియన్స్ బయపడతారా ఏంది.? ఈ లాజిక్ ని లారెన్స్ మిస్ అవ్వడం వలన దెయ్యాల సంఖ్య పెరిగింది తప్ప కథ మాత్రం గంగలో కలిసిపోయింది. దాంతో మొదటి రెండు సినిమాల ఇంపాక్ట్ ని గంగ సినిమా సినిమా క్రాస్ చేయలేకపోయింది. ఓవరాల్ గా గత రెండు పార్ట్స్ హిట్ అవ్వడం వలన ఈ సినిమాపై క్రేజ్ ఉండడం మరియు మాస్ ఆడియన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు చాలానే ఉండడం ఈ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద కాసులను బాగానే రాలుస్తుంది. అంతే తప్ప గత రెండు పార్ట్స్ లా ఇందులో బాగా ఉందని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మీరు లౌడ్ నెస్ ని తట్టుకొని, తలనొప్పి వచ్చినా సినిమాని భరించగలను అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళచ్చు...   

Raghava Lawrence,Tapasee Pannu,Bellamkonda Suresh,Thaman S.పంచ్ లైన్ : గంగ - ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: