సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్ , కొన్ని సాంగ్స్ , సినిమాటోగ్రఫీ , యాక్షన్ ఎపిసోడ్స్ , కొన్ని కామెడీ ఎపిసోడ్స్ సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్ , కొన్ని సాంగ్స్ , సినిమాటోగ్రఫీ , యాక్షన్ ఎపిసోడ్స్ , కొన్ని కామెడీ ఎపిసోడ్స్ సింపుల్ స్టొరీ లైన్ , స్క్రీన్ ప్లే , స్లో నేరేషన్ , సపోర్టింగ్ ఆర్టిస్ట్ లకు పాత్రలు లేకపోవడం , ఫోర్స్ గా పెట్టిన కొన్ని సాంగ్స్ , లీడ్ లవ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ లేకపోవడం
విష్ణు (రాహుల్ రవీంద్రన్) - టైగర్(సందీప్ కిషన్)లు అనాధలు. ఒకే అనాధాశ్రమంలో పెరిగిన వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. టైగర్ ప్రేమని విష్ణు భారంగా భావిస్తుంటే, టైగర్ మాత్రం విష్ణునే తనకు అన్నీ అనుకుంటాడు. ఓ కుటుంబం విష్ణుని దత్తత తీసుకోవడం వలన విష్ణు దూరంగా వెళ్ళిపోతాడు. కానీ వీరి స్నేహబంధం మాత్రం అలానే ఉంటుంది. గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ లో యాంత్రిక ఫెస్టివల్ కోసం కాశీ నుంచి గంగ(సీరత్ కపూర్) హైదరాబాద్ వస్తుంది. అక్కడ గంగని చూసిన విష్ణు ప్రేమలో పడతాడు. గంగకి హైదరాబాద్ లోనే జాబు రావడం, వీరు తరచూ కలవడం వలన ఇద్దరి మధ్యా ప్రేమ మొదలవుతుంది. కానీ వీరి ప్రేమ గంగ ఫ్యామిలీకి తెలియడంతో ఇద్దరినీ కాశీ తీసుకెళ్ళిపోతారు. అక్కడ వారి కట్టుబాట్ల ప్రకారం ప్రేమించిన వారిని చంపేయాలి అనుకుంటారు. అక్కడి నుంచి తప్పించుకోవడంలో విష్ణుని చంపేయాలనుకుంటారు. అక్కడి నుంచి తప్పించుకోబోయిన విష్ణు యాక్సిడెంట్ కి గురయ్యి హాస్పిటల్ లో చేరతాడు. ఇలా చావు బతుకుల మధ్య ఉన్న విష్ణు పరిస్థితి గురించి టైగర్ కి ఎలా తెలిసింది.? టైగర్ వచ్చి కాశీలో ఎలా ఫైట్ చేసి తన ఫ్రెండ్ విష్ణుని కాపాడాడు.? అలాగే విష్ణు - గంగలను కలిపాడా.? లేదా అన్నది మిగిలిన కథ. 



టైగర్ సినిమాలో నటీనటుల నటన ఏదీ పెద్దగా చెప్పుకునే స్థాయిలో లేవు. రాహుల్ రవీంద్రన్ తనకు ఇచ్చిన సాఫ్ట్ రోల్ లో బాగా చేసాడు. బేసిక్ గా తను ఇలాంటి పాత్రలు చేయడంలో మంచి పేరుంది. మరోసారి ఎమోషనల్ గా మంచి పాత్ర చేసి మెప్పించాడు. సందీప్ కిషన్ ఈ సినిమాలో తన టాలెంట్ ని చూపడానికి తక్కువ సమయం దొరికింది. ఎప్పటిలానే అక్కడక్కడా కొన్ని సీన్స్ లో ఓవర్ అనిపిస్తుంది. కానీ ఎక్కువ సీన్స్ లో బాగా చేసాడు. ఇకపోతే మా లుక్ మరియు ఇంట్రడక్షన్ సీన్స్ లో చాలా పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఆ సీన్స్ లో ప్రెజంటేషన్ కూడా చాలా బాగుంది. రన్ రాజా రన్ ఫేం సీరత్ కపూర్ ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేదు. రాహుల్ - సీరత్ లవ్ ట్రాక్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. కాశీ విశ్వనాధ్, తనికెళ్ళ భరణి, ప్రవీణ్ లు చేసిన చిన్న చిన్న పాత్రలు వృధా అయ్యాయి. కమెడియన్స్ తాగుబోతు రమేష్, చిత్రం శీను, సత్య, రఘు మరియు ఫిష్ వెంకట్ లు ఉన్నంతలో బాగా చేసారు. సత్య - సందీప్ కిషన్, తాగుబోతు రమేష్ - సందీప్ కిషన్ ట్రాక్స్ కామెడీగా ఉన్నాయి. బాలీవుడ్ యాక్టర్ బాబీ పర్వేజ్ చిన్న పాత్రలో ఓకే అనిపించాడు. 

టైగర్ సినిమా స్టొరీ లైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ ఈ సినిమా మొత్తం దర్శకత్వ ప్రతిభతోనే చాలా వరకూ నెట్టుకొచ్చాడు. సినిమాని మొదలు పెట్టడం, మెయిన్ లీడ్ రోల్స్ ని పరిచయం చేసిన విధానం బెస్ట్ అని చెప్పాలి. అలాగే మొదట్లో కొన్ని ఫన్నీ మోమెంట్స్ ని బాగా డీల్ చేసాడు. అలాగే సినిమాకి కీలకమైన కులాంతర ప్రేమ వివాహాలకి వ్యతిరేఖంగా ఉండే కాశీ ఎపిసోడ్ ని బాగా చూపించాడు. మామూలుగా కమర్షియల్ సినిమా అంటే  స్క్రీన్ ప్లే పరంగా అక్కడక్కడా కొన్ని ఎలిమెంట్స్ లో ఓవర్ డోస్ ఉంటుంది. అవే ఎక్కువగా ఫైట్స్, అవసరం లేని కామెడీ. కానీ ఇలాంటివి చాల తక్కువగా ఉండేలా చూసుకోవడం సినిమాకి హెల్ప్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ మొదలైన కొద్ది సేపటి తర్వాత సినిమా చాలా స్లో అయిపోతుంది. మళ్ళీ ఇంటర్వల్ దగ్గర పికప్ అవుతుంది. ఈ బోర్ ఫీల్ వలన ఫస్ట్ హాఫ్ లెంగ్త్ ఎక్కువ అనే ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాని స్క్రిప్ట్ పరంగా మన పాత సినిమాలతో డెవలప్ చేసుకుంటూ వస్తే.. ఆర్య 2 సినిమాతో మొదలై అక్కడి నుంచి పెళ్లి సందడి/దగ్గరగా దూరంగా లోని ఓ పాయింట్ తో టర్న్ తీసుకొని అటు నుంచి ప్రాణం సినిమా, అక్కడి నుంచి ముకుంద సినిమా పాయింట్ తో ముగుస్తుంది. డైరెక్టర్ విఐ ఆనంద్ మొదటి సినిమా కోసం పెద్దగా ప్లాన్స్ ఏమీ వేసుకోకుండా సింపుల్ కథని తీసుకొని స్క్రీన్ ప్లే - డైరెక్షన్ తో మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఇతను ఎఆర్ మురుగదాస్ అసిస్టెంట్, అందుకే తన టేకింగ్ లో చాలా వరకూ మురుగదాస్ ఫ్రేమింగ్ కనపడుతుంది. అక్కడక్కడా కామెడీని బాగానే పండించాడు. సెకండాఫ్ లో మనం ఊహించిందే జరుగుతున్నా షార్ట్ టైం కావడం వలన అలా అలా గడిచిపోతుంది. సెకండాఫ్ లో డైరెక్టర్ చేసిన మిస్టేక్.. మొదటి నుంచి ఎక్కువ హైప్ ఇచ్చుకుంటూ వచ్చిన కులాంతర ప్రేమ వివాహాల గురించి చాలా సింపుల్ గా ముగించేయడం అంత ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఎన్నో ఏళ్ళగా కొనసాగుతున్న ఆ కల్చర్ ని వాళ్ళు కొద్ది సేపట్లో ఎలా రియలైజ్ అయ్యారు అనేది నమ్మశక్యంగా లేదు.

చోటా కె నాయుడు అందించిన విజువల్స్ హాయ్ పిచ్ గ్రాండ్ గా ఉన్నాయి. అటు కాశీ, ఇటు గోదావరిని చాలా బాగా చూపించాడు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కానీ ఈ మ్యూజిక్ కి తమన్ ఓ తమిళ హిట్ మూవీ నుంచి యాజిటీజ్ గా కాపీ కొట్టడం విశేషం. ఎడిటర్ చోట కె ప్రసాద్ ఎడిటర్ గా సూపర్బ్ వర్క్ చేసాడు. ఇప్పటికే చాలా వరకూ షార్ట్ చేసి అందించాడు. కానీ ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది. యాక్షన్ ఎపిసోడ్స్ ని బాగా కంపోజ్ చేసాడు. అలాగే కొన్ని డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఉదాహరణకి కొన్ని - ఇప్పటి దాకా కులం కోసం చంపి చూసావు, ఇప్పుడు మనిషిలా బ్రతికి చూడు: ఎంతమంది ఉన్నా నాకేంటి రా.. నా ఫ్రెండ్ కి నేను ఒక్కడినే ఉన్నా.. ఎన్వీ ప్రసాద్ - ఠాగోర్ మధు నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.


టైగర్ సినిమాలో చెప్పడానికి చాలా చిన్న పాయింట్ అయినా చూపించడానికి చాలా విషయాలే ఉన్నాయి. కానీ  వాటిని పర్ఫెక్ట్ గా ఆన్ స్క్రీన్ ప్రాజెక్ట్ చేయలేకపోయారు. కొన్ని సీన్స్ లో ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేయడం - కొన్ని చోట్ల మాత్రం చాలా లో పిచ్ లో సీన్స్ ఉండడం వలన ఈ సినిమా బిలో యావరేజ్ గా మిగిలింది. లైన్ అందరికీ తెలిసిందే అయినా డైరెక్టర్ విఐ ఆనంద్ దానిని ఇంకాస్త జాగ్రత్తగా డెవలప్ చేసి ఉండాల్సింది. అలాగే స్క్రీన్ ప్లే - నెరేషన్ విషయంలో కూడా కేర్ తీసుకొని ఉంటే మంచి సినిమా అయ్యుండేది. ఓవరాల్ గా టైగర్ సినిమా రౌద్రంగా గర్జించలేకపోయింది. ఈ సినిమాలో కొన్ని నెస్ట్ ఎపిసోడ్స్ ఉన్నాయి, అలాగే బోర్ కొట్టించే కొన్ని ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. సో కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు.. కావున మా రివ్యూ చదివి సినిమాకి వెళ్ళాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేస్కొండి.. 

Sundeep Kishan,Seerat Kapoor,Rahul Ravindran,V.I.Anand,Tagore Madhu,N.V. Prasad,Thaman S.పంచ్ లైన్ : టైగర్ - గర్జించలేకపోయిన 'టైగర్'

మరింత సమాచారం తెలుసుకోండి: