సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ , తమన్ మ్యూజిక్ , కళ్యాణ్ రామ్ పెర్ఫార్మన్స్ సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ , తమన్ మ్యూజిక్ , కళ్యాణ్ రామ్ పెర్ఫార్మన్స్ పరమ రొటీన్ అండ్ పాత చింతకాయ పచ్చడి కథ , ఊహాజనిత కథనం , డైరెక్షన్ , స్లో నేరేషన్ , విలనిజంని వరస్ట్ గా చూపించడం , ఎడిటింగ్ , లెక్కలేనన్ని లాజిక్స్ వదిలేయడం , జీరో ఎంటర్టైన్మెంట్

ఈ సినిమా కథ చాలా రెగ్యులర్.. ఇప్పటికి మనం ఎన్నో సినిమాల్లో ఇదే కథని తిప్పి తిప్పి చూసి ఉంటాం.. ఇక అసలు కథలోకి వెళితే.. గౌతమ్ కన్స్ట్రక్షన్స్ అధినేత గౌతమ్(కళ్యాణ్ రామ్)ది చిన్న ఫ్యామిలీ.. అమ్మ, నాన్న, తమ్ముడు. వీరితో హ్యాపీ గా గడిపేసే గౌతమ్.. ఏదన్నా తనకు నచ్చింది అంటే దానికోసం ఎంత దూరం అన్నా వెళ్ళే స్వభావం కలవాడు. అలాంటి వాడు ఓ సందర్భంలో పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న విలన్ పప్పీ(విక్రంజీత్) పెళ్ళిచేసుకోబోయే అమ్మాయిని లేపుకొచ్చి తన ఫ్రెండ్ తో పెళ్లి చేసేస్తాడు. అది నచ్చని పప్పీ గౌతమ్ తో నీ లైఫ్ లో రాబోయే అమ్మాయి నాదే అని చాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కొద్ది రోజులకి గౌతమ్ - నందు(సోనాల్ చౌహాన్)లు ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. అది తెలుసుకున్న పప్పీ నందని తీసుకొచ్చి తనతో పెళ్లి ఫిక్స్ చేసుకుంటాడు. ఆ టైములో గౌతమ్ ముందు రెండు టాస్క్ లు ఉంటాయి. అదే ఒకటి పప్పీతో నందు పెళ్లిని ఆపి తన ప్రేమని గెలిపించుకోవాలి. రెండవది తన లైఫ్ లో జరిగిన ఓ సంఘటన వలన ఇంటర్నేషనల్ డాన్ అయిన దాదా(ముఖేష్ రుషి)ని చంపడం.. ఈ రెండు పనులు ఒకే టైంలో ఎలా చేసాడు.? అసలు ఎందుకు గౌతమ్ దాదాని టార్గెట్ చేసాడు అన్న అంశాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..   

నటీనటుల విషయానికి వస్తే సినిమా మొత్తం మీకు ఎక్కువగా కళ్యాణ్ రామ్ మాత్రమే కనిపిస్తాడు. చెప్పాలి అంటే సినిమా మొత్తాన్ని తానొక్కడే తన భుజాల మీద వేసుకొని నడిపించాడని చెప్పాలి. నటనత పరంగా కళ్యాణ్ రామ్ గౌతమ్ పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. రెండు మూడు యాక్షన్ ఎపిసోడ్స్ లో తను చేసిన స్టంట్స్ చాలా బాగున్నాయి. అలాగే కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. ఇక హీరోయిన్ అనే సోనాల్ చౌహాన్ సినిమాకి కేవలం గ్లామర్ అట్రాక్షన్ మాత్రమే.. సినిమా మొదట్లో ఈ పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది అనిపించినా సెకండాఫ్ లో ఒక్క పాటలో తప్ప మరెక్కడా కనిపించదు. బబ్లీ బాబ్లీ పాత్రలో ఉన్నంతలో బాగానే చేసిన సోనాల్ చౌహాన్ అందాల ఆరబోతలో మాత్రం దూకుడు చూపించింది. అది మాస్ ఆడియన్స్ కి ట్రీట్ అని చెప్పాలి. విక్రంజీత్ పాత్ర నటన ఏదీ పెద్దగా బాలేదు. ముఖేష్ రుషి ఓకే అనిపించాడు. రావు రమేష్, రోహిణిలు డీసెంట్ రోల్స్ లో అలా కనిపించి ఇలా వెళ్ళిపోయారు. 30 ఇయర్స్ పృధ్వీ డైలాగ్స్ కొన్ని బాగానే పేలాయి. ఇకపోతే కామెడీ కింగ్ బ్రహ్మానందంని వాడుకున్న విధానం చాలా దారుణం. చాలా సీన్స్ లో ఉన్నా ఒక్క సీన్ లో కూడా నవ్వించలేకపోయాడు. ఇక సీనియర్ యాక్టర్స్ అయిన పోసాని కృష్ణమురళి, ఆశిష్ విద్యార్ధి, షఫీ, ఎంఎస్ నారాయణ, అలీ, సాయాజీ షిండేలను చాలా చెత్తగా వాడుకున్నారు. 

గతంలో అభిమన్యు, కత్తి లాంటి డిజాస్టర్స్ ఇచ్చిన తర్వాత కూడా కళ్యాణ్ రామ్ డైరెక్టర్ మల్లికార్జున్ ని నమ్మి అవకాశం ఇచ్చాడు. కానీ దానిని సద్వినియోగపరచుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు మల్లికార్జున్. డైరెక్టర్ మల్లి ప్రతి విషయంలోనూ తప్పులే చేసుకుంటూ వచ్చాడు. ఎలా అనేది ఒక్కొక్కటి చెబుతా.. ముందుగా ఈ సినిమా కోసం ఎంచుకున్న స్టొరీ లైన్, దాని చుట్టూ అల్లుకున్న కథ నాకు తెలిసి నా లంగోటి టైమ్స్ నుంచి చూస్తున్నాం. ఎప్పుడో పుష్కరానికి ఇలాంటి ఓ సినిమా మనం చూడడంలేదు.. ప్రతి నెల రిలీజ్ అయ్యే సినిమాల్లో ఇలాంటి కథలున్న సినిమాలు ఒకటి రెండన్నా రిలీజ్ అవుతున్నాయి. వాటిని చూసి మనం తల పట్టుకుంటూనే ఉన్నాం. అదే పరమ బోరింగ్, రొటీన్, చెత్త కథ ఇది. చెప్పాలంటే మల్లి డైరెక్ట్ చేసిన ఇది వరకటి సినిమాల కథలు బాగుంటాయి. కథని ఇలా తగలబెట్టాక కథనం మాత్రం ఎలా బాగుంటుంది చెప్పండి. అదీ అలానే తగలబడింది. కథనంలో మీకు తెలియని విషయం ఏదీ డైరెక్టర్ దాచకపోయినా., ఉన్న ఒకే ఒక్క ట్విస్ట్ ని చివరి వరకూ దాచుకోవడం దానిని రివీల్ చెయ్యగానే సినిమాని ధనాధన్ అని ముగించేయడమే కాస్త పనికొచ్చే పాయింట్. కథనంలో బలవంతంగా బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, 30 ఇయర్స్ పృధ్వీ, అలీ లను వాడుకున్నా ఆ కామెడీ మన నెత్తి మీద బుదిబండలా అనిపిస్తుందే తప్ప, మనకు నవ్వు తెప్పించేలా ఉండదు. దాంతో సినిమా చూసే ఆడియన్స్ కి చిరాక్ అనేది పీక్స్ ని టచ్ చేస్తుంది. ఇక కథ, కథనంలు ఎలాగో కొండెక్కాసాయి, నేరేషన్ అన్నా స్పీడుందా అంటే అదీ లేదు... సినిమా రన్ టైం రెండు గంటలే అయినా ఏదో రెండు యుగాలుగా మనం సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ ని కలిగించింది. ఇక డైరెక్టర్ గా ఎవ్వరి దగ్గర నుంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకోలేదు.. ఎందుకు అంటే కళ్యాణ్ రామ్ కాస్త సీనియర్ యాక్టర్.. తనకి సీన్ కొంత చెప్తే ఎలా చెయ్యాలో తెలుసు కాబట్టి చేసుకుంటూ వెళ్ళాడు. మిగతా ఎవ్వరి దగ్గర నుంచీ ఆయన రాబట్టుకోవాలని అనుకోలేదు.. దానికి తోడు సినిమాలో లాజిక్స్ విచ్చలవిడిగా వదిలేసాడు. డైరెక్టర్ కి ఒకటే ఒక లాజిక్ అడుగుతా.. చెస్ కాంపిటీషన్ కి వెళ్ళిన పెళ్ళాం, కొడుకు కొన్ని నెలలైనా ఇంటికి తిరిగి రాకపోతే వాళ్ళకి ఏమైంది అని తండ్రి పట్టించుకోడా, పెద్ద కొడుకుని అడగడా.. ఎప్పుడో చెప్తే గానీ గుర్తురానంత పని బిజీలో ఉంటాడా ఏంది..? కూసింత చెప్పి పెట్టండి.. షేర్ అనే సినిమా కూడా ఫ్లాప్ అయ్యి హ్యాట్రిక్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకోవాడానికి కర్త, కర్మ, క్రియ అన్నీ మల్లికార్జున్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 


ఇక మిగతా డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తన టాలెంట్ వల్ల ఇచ్చింది లో బడ్జెట్ అయినా విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉండేలా చూసుకున్నాడు. ఆ తర్వాత చెప్పాల్సింది తమన్ మ్యూజిక్.. పాటలు డీసెంట్ అనిపించుకున్నా., బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఇచ్చాడు. చాలా సీన్స్ లో తమన్ మ్యూజిక్ సినిమాకి బలాన్ని ఇచ్చింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అస్సలు బాలేదు. ఎడిటింగ్ లో స్పీడ్ అనేదే కనిపించలేదు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయనే చెప్పాలి. ఎందుకంటే సినిమాలో బెస్ట్ అనిపించేది వీరు కంపోజ్ చేసిన మూడు యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే.. డైమండ్ రత్నబాబు డైలాగ్స్ జస్ట్ యావరేజ్. సత్య శ్రీనివాస్ ఆర్ట్ వర్క్ బాగుంది.  ఇక ఫైనల్ గా నిర్మాత కొమర వెంకటేష్ నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి.


కళ్యాణ్ రామ్ ఈ ఏడాది పటాస్ లాంటి సూపర్ హిట్ అందుకున్నాడు.. దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఓ హిట్ అందుకున్న ఆనందాన్ని కళ్యాణ్ రామ్ కి 10 నెలలు కూడా మిగల్చలేదు డైరెక్టర్ మల్లికార్జున్. ఈ రోజు రిలీజ్ అయిన షేర్ సినిమా కళ్యాణ్ రామ్ కి మరో డిజాస్టర్ ని ఇచ్చింది. పాత చితంకాయపచ్చడి లాంటి కథని ఎంచుకొని దానిని అంతకన్నా పాతగా తీసి ఆడియన్స్ ని చిరాకు పెట్టించే సినిమా షేర్. అభిమన్యు, కత్తి సినిమాల తర్వాత కళ్యాణ్ రామ్ - మల్లికార్జున్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ అట్టర్ ఫ్లాప్ సినిమా 'షేర్'. సింపుల్ గా ఈ సినిమాని స్కిప్ చేయండి. 

Kalyan Ram,Sonal Chauhan,Mallikarjun,Komara Venkatesh,S. Thamanషేర్ - ఇది కనీసం పిల్లి కూడా కాదు...

మరింత సమాచారం తెలుసుకోండి: