సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ , సురేష్ సినిమాటోగ్రఫీ , బాగున్నాయనిపించే కొందరి పెర్ఫార్మన్స్సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ , సురేష్ సినిమాటోగ్రఫీ , బాగున్నాయనిపించే కొందరి పెర్ఫార్మన్స్కిక్ లేని కథనం , రకరకాలుగా అనిపించే స్లో నేరేషన్ , బోరింగ్ బోరింగ్ సెకండాఫ్ , నో ఎంటర్టైన్మెంట్ , నో ఎమోషనల్ టచ్ , ఎడిటింగ్

మన హీరో కిరణ్(సంతోష్ శోభన్)కి ఎవ్వరూ ఉండరు. సో ఓంటరిగా ఉంటూ ఓ కాల్ సెంటర్ లో జాబ్ చేస్తూ మిగతా టైంని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నరేష్(అభిషేక్)తో గడుపుతూ ఉంటాడు. కిరణ్ కి అమెరికా అన్నా, అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళన్నా లేదా అక్కడ సెటిల్ అయ్యి పోజు కొట్టేవాల్లన్నా చెడ్డ చిరాకు. ఓ రోజు అభిషేక్ ఫ్రెండ్ అయిన కీర్తి(అవిక గోర్)తో ప్రేమలో పడతాడు. ఇక హీరో పడ్డాక హీరోయిన్ కూడా పడాలిగా.. కొద్ది రోజులకి పడుతుంది. అప్పుడే మన హీరో కిరణ్ కి ఓ విషయం తెలుస్తుంది. అదే కీర్తికి అమెరికా వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలన్నదే లక్ష్యం. అస్సలు అమెరికా అంటే పడని కిరణ్ కి, అమెరికా వెళ్లాలనుకునే కీర్తికి మధ్య వచ్చిన సమస్యలేమిటి? ఫైనల్ గా వీరిద్దరి ప్రేమ ఏమైంది? కిరణ్ కి అమెరికా అంటే ఎందుకు ఇష్టం లేదు? కీర్తికి అమెరికాకి వెళ్ళడమే లక్ష్యంగా పెట్టుకోవడానికి గల కారణం ఏమిటి? అనేది తెలియాలంటే మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

గోల్కొండ హై స్కూల్ సినిమాలో క్రికెట్ టీంలో ఒకడుగా కనిపించిన సంతోష్ శోభన్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ ఇది. సంతోష్ కి హీరోగా మొదటి సినిమా అయినప్పటికీ కెమెరా ఫియర్ అనేది లేకుండా, ఎక్కడా తడబడకుండా చాలా బాగా చేసాడు. ఆ విషయంలో సంతోష్ ని మెచ్చుకోవాలి. ఇకపోతే సంతోష్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ చాలా బాగుంది. కానీ ఎక్కువ భాగం నాని, అవసరాల శ్రీనివస్ స్టైల్ ని కొన్ని చోట్ల రవితేజ స్టైల్ ని మక్కికి మక్కి దించినట్లు మాత్రం ఆడియన్స్ కి అనిపించక మానదు. సో ఆ విషయంలో మారాయి ఎమోషనల్ సీన్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాలి. ఇక హీరోయిన్ అవిక గోర్ నటన పరంగా డీసెంట్ అనిపించుకున్నా, లుక్స్ పరంగా మాత్రం రకరకాలుగా కనిపించి కొన్ని చోట్ల వామ్మో అనుకునేలా కొన్ని చోట్ల ఓకే అనుకునేలా కనిపించింది. కమెడియన్స్ గా చేసిన అభిషేక్, మూర్తి కావాలి కామెడీ కాస్త నవ్విస్తుంది. రావి బాబు - సత్య కృష్ణన్ లు పరవాలేధనిపించారు. రాహుల్ శర్మ కాస్ట్ ఫీలింగ్ బలుపు పాత్రలో ఓకే అనిపించాడు. 

సాయి సుకుమార్ అనే కొత్త రైటర్ చెప్పిన స్తోర్లీ లైన్ నచ్చడంతో ఈ తను నేను అనే పూర్తి కథ సిద్దమైంది. సాయి సుకుమార్ - రామ్ మోహన్ కలిసి పూర్తి కథని సిద్దం చేసారు. వారి దగ్గర ఉన్న పాయింట్ అమెరికా వెళ్ళడం కోసం బ్రతికే అమ్మాయి, అమెరికా అంటే శివాలెత్తిపోయే కుర్రాడు. వీరిద్దరికీ ముడిపెడితే ఎలా ఉంటుంది. ఈ పాయింట్ బాగానే ఉంది కానీ వీరు రియలైజ్ కాని పాయింట్ ఏమిటంటే ఎంత కొత్తగా చెప్పడానికి ట్రై చేసినా సినిమా రొటీన్ పద్దతిలోనే ముగించాలి, ఆ ఆ లెక్కన స్టార్టప్ బాగున్నా సెకండాఫ్ దొబ్బుద్ది. ఇక్కడా అదే జరిగింది. అనుకున్న లైన్ ప్రకారం పాత్రలను బాగా పరిచయం చేసాడు. వారి మధ్య ప్రేమని పుట్టించాడు. కానీ వారిద్దరి మధ్య రావాల్సిన సమస్య, ఆ సమస్యకి పరిష్కారం రెండూ చాలా చాలా కామన్ అయిపోవడం వలన సినిమా సెకండాఫ్ ఇది కూడా సర్వమంగళ మంగలమే అని కలిసిపోయింది. కథలో వీరు చేసిన మరో తప్పు.. సెకండాఫ్ లో రెండు మూడు స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్స్ కి ఛాన్స్ ఉంది కానీ ఆ ఎమోషనల్ సీన్స్ ని ఆడియన్స్ హృదయాల్కి టచ్ అయ్యేలా చెప్పకుండా కామెడీ టచ్ ఇవ్వాలని ట్రై చేసి బొక్క బోర్లా పడ్డాడని చెప్పాలి. ఎమోషన్ అనేది ఒక పైన అది అలానే ఆడియన్స్ ఫీలవ్వాలి, అలా చెయ్యలేకపోతే గమ్మునుండాలి అంతే కాని దానికి ఫన్ మిక్స్ చేయకూడదు. అలా చేయడం వలెనే ఈ మూవీ సెకండాఫ్ నిరాశకి గురిచేస్తుంది. ఇక కథనంలో ఉన్న ఒకే ఒక్క ట్విస్ట్ ని సినిమా ప్రారంభంలోనే గెస్ చెసెస్తారు. బోరింగ్ కథనానికి తోడు సోలో నేరేషన్ సినిమాని ఆడియన్స్ కి కనెక్ట్ చేయకుండా చేసేసాయి. డైరెక్టర్ గా రామ్ మోహన్ పాత్రల పరిచయాలను బాగా చెప్పడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు, మిగతా కంటెంట్ చెప్పడంలో, ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. 


మిగతా డిపార్ట్ మెంట్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ ఎంఆర్ వర్క్ నడ సురేష్ సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. ఎస్ రవీందర్ చిన్న సినిమా కోసం వేసిన రెండు హౌస్ సెట్స్ కథకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాలేదు. రామ్ మోహన్ - సురేష్ బాబు ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి.     


'తను నేను' అనే స్టొరీ లైన్ ఒక 20-30 నిమిషాల షార్ట్ ఫిల్మ్ గా తీస్తే పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యే  కాన్సెప్ట్ కానీ దానిని 2 గంటలకు మించి సినిమా తీయాలనుకోవడం వలన ఆ కథకి సినిమాటిక్ సీన్స్ సాంగ్స్ యాడ్ చేయాల్సి వచ్చింది. అందుకే సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. కథ - కథనం - డైరెక్షన్ ఈ మూడు విభాగాల్లో సినిమా ఫెయిల్ అయితే అది ఆడియన్స్ ని మెప్పించడం చాలా కష్టం. ఈ ఇచ్నేమా కూడా ఆ డిపార్ట్ మెంట్స్ లో ఫెయిల్ అయ్యిందిగా, అందుకే ఆడియన్స్ కి ఎక్కదు. సినిమా పరంగా బెస్ట్ అంటే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, హీరో పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. కానీ ఈ మూడింటి కోసం సినిమాలు ఆడవు కాబట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఆడే దాఖలాలు చాలా అంటే చాలా తక్కువ. 

Avika Gor, Santosh Sobhan, Ravi Babu,Satya Krishnan,Ram Mohan P, Sunny MRతను నేను - "తను-నేను : బోరింగ్- స్లో"

మరింత సమాచారం తెలుసుకోండి: