Yamaho Yama Full English Review

సాయిరామ్ శంకర్, పార్వతి మెల్టన్ జంటగా నటించిన సినిమా యమహో యమ. ఈ సినిమాలో యముడిగా శ్రీహరి నటించడం విశేషం.  తెలుగులో యమలోకం, యముడి నేపథ్యంలో వచ్చిన అనేక చిత్రాలు విజయవంతం అయ్యాయి. దీంతో ఈ యమహో యమ చిత్రంపై కొంత మంది దృష్టి పడింది. మరి ఈ యమహో యమ సినిమా ఏలా ఉందో చూద్దాం..!   చిత్రకథ :   యమలోకాధిపతి యముడు (శ్రీహారి). ధర్మాన్ని రక్షించడంలో అతనిది కూడా కీలక పాత్ర. అందరకీ సమన్యాయం పాటించడం అతని బాధ్యత. అయితే అతనికి భక్తులు ఉండరు. కానీ, భూలోకం లో బాలు (సాయిరామ్ శంకర్) చిన్నతనం నుంచి యముడి భక్తుడు. బాధ్యత లేకుండా తిరిగే బాలు జీవితాన్ని చక్కదిద్దటానికి యముడు భూలోకానికి దిగివస్తాడు. స్వప్న (పార్వతి మెల్టన్)తో ప్రేమలో పడేటట్లు చేస్తాడు. ఏ కారణం చేత బాలు చిన్నతనం నుంచి యమడ్ని ఎందుకు ఆరాధిస్తుంటాడు ?, స్వప్న-బాలు ఏవిధంగా ఒకటయ్యారు అనేది చిత్రకథ. నటీనటుల ప్రతిభ :     యముడి గా శ్రీహరి నటన బానే ఉంది. అయితే యముడి పాత్ర పోషణకు మరింత శ్రద్ద తీసుకోవల్సింది. హీరోగా సాయిరామ్ ఫర్వాలేదనిపిస్తాడు. డాన్సులు, పైట్లు బాగా చేశాడు. హీరోయిన్ గా నటించిన పార్వతి మెల్టన్ మరీ సన్నగా ఉంది. సంజన కనిపించేది కొద్ది సేపే అయినా తన అందాల ప్రదర్శనతో ఆకట్టకుంటుంది. శివారెడ్డి నవ్వించడానికి విఫల ప్రయత్నం చేశాడు. చిత్రగుప్తుడిగా నటించి ఎంఎస్ నారాయణ పెద్దగా ఆకట్టుకోడు. తాగబోతు రమేష్ నవ్విస్తాడు. రమాప్రభ తదితరులు తమ తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ, సంగీతం ఫర్వాలేదనిపిస్తాయి. సినిమా ప్రారంభంలో యముడు ఓ మాంత్రికుడ్ని చంపే గ్రాఫిక్ సీన్ బావుంది. అయితే ఆ సన్నివేశం సినిమాకు ఎందుకూ ఉపయోగపడదు. పాటలు ఓకే. ఓ రీమిక్ సాంగ్ బావుంటుంది. నిర్మాణ విలువలు దారుణంగా ఉన్నాయి. యముడి నేపథ్యంలో సినిమా తీయడానికి ఈ స్థాయి నిర్మాణ విలువలు సరిపోవు. దర్శకత్వం చాలా పేలవంగా ఉంది. సినిమా మొదట భాగం ఓ నాటకాన్ని తలపిస్తుంది. సాయి రామ్ శంకర్ ఎంట్రన్స్ సీన్ చాలా ఫన్నీగా ఉంది. పులి (గ్రాఫిక్స్) నుంచి చిన్నారి పాపను రక్షించే ఉద్దేశ్యం మంచిదే అయినా, పులి ముందు పాట పాడటం, పులి డాన్స్ చేయడం చాలా వెటకారంగా ఉంది. ఏ వర్గాన్ని ఆకట్టుకోవడానికి ఈ సన్నివేశాలు తీసారో చిత్ర యూనిట్ కే తెలియాలి. అలాగే యముడు అమెరికా రావడం, అక్కడి వీధుల్లో, బీచ్ ల్లో తిరిగే సన్నివేశాలు మరీ నాసిరకంగా ఉన్నాయి. చిత్రగుప్తుడిపై చిత్రీకరించిన హస్య సన్నివేశాలను పాత సినిమాల నుంచి కాపీ కొట్టారు. ఈ సినిమాలో మన్మధుడు పాత్రను చూపించిన విధానం దారుణం. సకల జీవుల మధ్య అనురాగం కలగడానికి కారణంగా హిందువులు భావించే మన్మధుడ్ని అవిధంగా చూపించడం అవమానకరం. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు, కొన్ని పాటలు ఓ స్టేజ్ మీద తీసినట్లు ఉంటాయి. కానీ, హీరో రాయలసీమ లోని సన్నివేశాలు, ముగింపు సన్నివేశాలు బాగుంటాయి. చివరగా :   ‘యముడు’ కూడా సాయి రామ్ శంకర్ కు హిట్టు ఇవ్వలేక పోయాడు.  

Yamaho Yama : Cast & Crew

Yamaho Yama Review, Rating | Yamaho Yama Review | Yamaho Yama Rating | Yamaho Yama Telugu Movie Cast & Crew, Music, Performances | Srihari | Sairam Sankar te Yamaho Yama Movie Tweet Review, Rating;Yamaho Yama Rating;Yamaho Yama Review, Rating;Telugu;Review;Rating;Sairam Shankar;parvati melton;Srihari;Telugu Latest Movies; true APHerald APHerald http://www.apherald.com/ImageStore/images/Movies/Movies_Reviews/Yamaho-Yama-Movie-Review-Rating-APHerald-300x300.jpg http://www.youtube.com/embed/m8tt5lGnOB0

More Articles on Yamaho Yama || Yamaho Yama Wallpapers || Yamaho Yama Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: