బాలకృష్ణ సూపర్ స్టైలిష్ ప్రెజంటేషన్ , బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్ , సోనాల్ చోహాన్ అందాలు , శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీబాలకృష్ణ సూపర్ స్టైలిష్ ప్రెజంటేషన్ , బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్ , సోనాల్ చోహాన్ అందాలు , శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీఅదే పాత ఫార్మాట్ కథ , అందరికీ తెలిసిన, ఊహించదగిన కథనం , పరమ రొటీన్ క్లైమాక్స్ , ఎడిటింగ్ , డైరెక్షన్ , నో విలనిజం , జీరో ఎంటర్టైన్మెంట్ , బోరింగ్ నేరేషన్

ధర్మ (బాలకృష్ణ) హైదరాబాద్ లోని ధర్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన ఓ సూపర్ మార్కెట్ లో ఉద్యోగం చేస్తుంటాడు.  ఓ సాధారణ ఉద్యోగి.  తనకు తన పని తప్ప మరే పనిగురించి తెలియదు.  గొడవలంటే అసలు పడదు.  తన పనేదో తనదే తప్పించి.. మరో పని గురించి ఆలోచించడు.  ఇలా శాంతంగా బుద్దునిలా ఉండే ధర్మ.. కాత్యాయని ( అంజలీ) ఇంట్లోనే ఉంటాడు.  వీరిద్దరికీ పెళ్లి జరుగుతుంది.  అయితే, కాత్యాయని... ఉద్యోగబాధ్యతల రిత్యా వేరే ప్రాంతంలో ఉండాల్సి వస్తుంది.  దీంతో ఆ ఇంటికి సంబంధించిన అంశాలు అన్నింటిని ధర్మానే చూసుకుంటుంటాడు.  ఇలాంటి సమయంలో ధర్మా జీవితంలోకి ఇందు (సోనాల్ చౌహాన్) ప్రవేశిస్తుంది.  ఇక ఇందు బ్రదర్ వలన చిక్కుల్లో పడుతుంది.  విక్కీ గ్యాంగ్ నుంచి ఇందుకు సమస్య ఉత్పన్నమౌతుంది.  ఇందు అన్నయ్య కోసం ఇందునుని వేధింపులకుగురి చేస్తున్న సమయంలో సీన్ లోకి ధర్మ వస్తాడు.  తన రౌద్రప్రతాపాన్ని చూపిస్తాడు. ఇక ధర్మాని టీవీలో చూసిన ధర్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి రాజశేఖర్ ( సుమన్) ఢిల్లీ నుంచి పరుగుపరుగున హైదరాబాద్ వస్తాడు. ధర్మాను డిక్టేటర్ గా పరిచయం చేస్తాడు. డిక్టేటర్ ధర్మా గా ఎందుకు మారాడు..?రాజశేఖర్ కు ధర్మాకు సంబంధం ఏమిటి..? ఇందు ఎవరు..? అసలు డిక్టేటర్ ఏం చేసేవాడు..? అన్న విషయాలను తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే. 



నటీనటులలో ముందుగా ఓ మాట చెప్తా.. నందమూరి బాలకృష్ణ మంచి నటుడు, చాలా టాలెంట్ తో పాటు మాస్ లో భీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో.. కానీ ఆయనని సరిగా చూపించి దర్శకులు మాత్రం చాలా తక్కువ..ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఆయనని ఈ సినిమాలో అస్సలు ఉపయోగించుకోలేకపోయాడు డైరెక్టర్ శ్రీవాస్. బాలయ్య చూడటానికి మస్త్ స్టైలిష్ గా ఉన్నాడు. అదొక్కటే బాలయ్య పరంగా బెస్ట్. ఇక తన యాక్షన్ అండ్ డైలాగ్ డెలివరీ సింహా అండ్ లెజెండ్ సినిమాల్లో ఎలా ఉందొ అలానే ఫాలో అయిపోయాడు. బాధ అనిపించిన విషయం ఇదే ఒక స్టార్ హీరో సినిమాని కనీసం కొత్తగా ప్రెజంట్ చేయడానికి ట్రై చేయకపోతే ఎలా??? ఫైనల్ గా ఒక్కటే బాలయ్య ఎప్పటిలానే చేసాడు. బాగానే చేసాడు.. అంజలి అల్లరి పిల్లగా, మెచ్యూర్ వైఫ్ గా బాగానే చేసింది. సోనాల్ చౌహాన్ అందాల ఆరబోత కోసమే సినిమాలో వస్తుంది. ఆ పనిని పర్ఫెక్ట్ గా చేసి వెళ్ళిపోయింది. విలన్స్ గా చేసిన రతి అగ్నిహోత్రి, నవాబ్ షా, కన్బీర్ సింగ్ లకి సరైన పాత్రలు లేవు.. వీళ్లవసలు విలన్ పాత్రలేనా అనేలా పాత్రలు ఉన్నాయి. ఇకపోతే  అక్ష, నాజర్, సుమన్, సాయాజీ షిండే లాంటి వాళ్ళు పరవాలేదని పిస్తే,  కమెడియన్స్ అయిన వెన్నెల కిషోర్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ, ప్రభాస్ శ్రీను, పోసాని క్రిష్ణమురళీ, శకలక శంకర్ లు నవ్వించలేక చతికిల పడ్డారు.

'కోన వెంకట్ - గోపి మోహన్, శ్రీవాస్ లు కలిసి బాలయ్యని ఒప్పించేసారు.. అదలా ఉంచితే.. కోన వెంకట్ - గోపి మోహన్ లకి ఈ మధ్య హిట్ లేవు, అన్నీ డిజాస్టర్లే.. అస్సలు కథ - కథనాలని మార్చడం లేదని తెగ కామెంట్స్ వస్తున్నాయి. ఈ కామెంట్స్ వలన వీరిద్దరూ బాలయ్య లాంటి హీరోకన్నా కొత్తగా ఏమన్నా కథ రాసుంటారేమో అనుకోవడం మన పొరబాటు. అత్యంత బాధాకర విషయం.. బాలయ్య లాంటి సూపర్ స్టార్ హీరోని పెట్టుకొని కూడా కథ విషయంలో కేర్ తీసుకోకపోవడం, కనీసం ఒక పర్ఫెక్ట్ స్టొరీ లైన్ ని కూడా అనుకోలేదు. కేవలం డిక్టేటర్ అనే ఒకే ఒక్క అపాత్రని కాస్త పవర్ఫుల్ గా రాసుకొని దానికి కూడా కేవలం సెకండాఫ్ లో పెట్టేసి సినిమా అంతా నడిపించేయాలి అనుకోవడం చాలా ఫూలిష్ గా అనిపిస్తుంది.

ఈ సినిమాకి స్టొరీ లైన్ అనేదే లేదు.. ఇక సినిమా ఫార్మాట్ వచ్చి బాలయ్య సూపర్ హిట్ సినిమాలైన సమరసింహా రెడ్డి, నరసింహనాయుడుల ఫార్మాట్ లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ని ఇంగ్లీష్ లోని 'ది ఈక్వలైజర్' అనే సినిమా నుంచి లిఫ్ట్ చేసారు. ఈ ఫార్మాట్ కి కోన గోపి లు బాగా ఫేమస్ అయిన సెకండాఫ్ ఇంట్లో కామెడీ ఫారామ్ట్ ని ఫస్ట్ హాఫ్ లో పెట్టడానికి ట్రై చేసారు.. కానీ ఫస్ట్ హాఫ్ లో ఒక్క కామెడీ కూడా పేలలేదు. దాంతో ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ ఫీలింగ్ వస్తుంది. ఇక సెకండాఫ్ లో హీరోకి స్ట్రాంగ్ అపోనెంట్ లేకుండా హీరోయిజం ఎలివేట్ చెయ్యాలని ట్రై చేసి దెబ్బై పోయారు. కథ ఇంత పాతది కనీసం కథనం అన్నా కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది. అది కూడా చేయకపోవడం సినిమాకి మరింత మైనస్.. కథనం ఊహాజనితంగా ఉంటుంది, ఒక్కటంటే ఒక్క ట్విస్ట్ కూడా లేదు. అలాగే నేరేషన్ చాలా ఫ్లాట్ గా ఉంది. బోరింగ్ గా బాప్ అనేలా నేరేషన్ ఉంది. ఇక శ్రీవాస్ ఈ విషయాలను డైరెక్షన్ లో కరెక్ట్ చేసుకోలేకపోయాడు. తను కూడా కేవలం డిక్టేటర్ పాత్రను మాత్రమే ప్రెజంట్ చేయడాన్ని మాత్రమే పట్టించుకొని మిగతా దాన్ని గాలికి వదిలేసాడు. అందుకే సినిమా కూడా గాలి ఎటు వీస్తే అటు వెళుతూ ఉంటుంది. ఒక్క ఎమోషన్ ని కూడా పర్ఫెక్ట్ గా చూపించలేదు. ఓవరాల్ గా మెయిన్ డిపార్ట్ మెంట్స్ అయిన కథ, కథనం, డైరెక్షన్ అనేది ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. 


శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ సూపర్బ్.. సినిమాని గ్రంగ్ చూపించడంలో, బాలయ్యని స్టైలిష్ గా చూపడంలో ఆయన టాలెంట్ కనపడుతుంది. ఇక తమన్ పాటలు యావరేజ్ అయినా విజువల్ గా మాత్రం బాగున్నాయి. ఇక చిన్నా అందించిన నేపధ్య సంగీతంలో రీ రికార్డింగ్ అనేది హీరో ఎలివేషన్ సీన్స్ కి మాత్రమే బాగుంది.. మిగతా అంటా చాలా డల్ గా ఉంది. అస్సలు బాలేదనే చెప్పాలి. ఇక బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ బాగుంది. రవి వర్మ యాక్షన్ ఎపిసోడ్స్ డీసెంట్ గా అనిపించాయి. ఎడిటర్ గౌతమ్ రాజు పనితనం చాలా వీక్ గా ఉంది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ అని అయితే మరీ మరీ బోర్ కొట్టించేసారు. సెకండాఫ్ ని కాసేపు పరిగెత్తించినా ఆ తర్వాత స్లో చేసేసాడు. శ్రీవాస్ - ఎరోస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.



కోన వెంకట్ - గోపి మోహన్ - శ్రీవాస్ అనే కాంబినేషన్ లో వచ్చిన పరం రెగ్యులర్ అండ్ బోరింగ్ సినిమానే ఈ డిక్టేటర్. ఈ ముగ్గురు కలిసి ఇంత పాత కథని ఎందుకు రాసుకున్నారో, దానిని బాలయ్య ఎలా ఓకే చేసాడో తెలియదు కానీ ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు మాత్రం ప్రేక్షకులకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ దొరక్క విల విలా లాదిపోతారు. థియేటర్ కి వెళ్ళిన వాళ్ళని సేవ చేసేది మాత్రం సెకండాఫ్ లోని కూని బాలయ్య ఎపిసోడ్స్.. ఆ ఎపిసోడ్స్ లో రీ రికార్డింగ్ కూడా హైలైట్ అవ్వడం సినిమాకి పెద్ద ప్లస్. శ్రేవాస్ అండ్ టీం బాలయ్య లాంటి స్టార్ హీరో ఇచ్చిన ఆఫర్ ని, స్టార్ హీరోని ఉపయోగించుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. దాంతో ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో కూడా ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు ఈ సినిమాకి వెళ్తే మీరు కచ్చితంగా నిరుత్సాహపడతారు.


Balakrisha,Anjali,Sonal Chauhan,Sriwass,Eros International,Thaman Sడిక్టేటర్ - వృధా అయిన పవర్ఫుల్ టైటిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: