Yamudiki Mogudu: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review

యముడి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో తెలుగు సినిమా యముడికి మొగుడు. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో యముడిగా షియాజీ షిండే నటించారు. రమ్యకృష్ణ, రిచా పనయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. చిత్రకథ :   బ్రహ్మ (చలపతిరావు)-సరస్వతి (సన)ల మధ్య నారదుడు (సీనియర్ నరేష్) కలహం సృష్టించిన కారణంగా తలరాత లేకుండానే నరేష్ (అల్లరి నరేష్) భూమి మీద జన్మిస్తాడు. నరేష్ కు తలరాత లేకపోవడం మాత్రమే కాకుండా దేవతలకు ఉండే శక్తులు కూడా ఉంటాయి. నారదుడి కారణంగా భూమికి వచ్చిన యముడి (షియాజీ షిండే) కుమార్తె యమజ ( రిచా పనాయ్)ను నరేష్ వివాహం చేసుకుంటాడు. దీంతో నరేష్-యమజను యముడు వేరు చేయడానికి ప్రయత్నిస్తాడు. నరేష్ కు తలరాత లేక పోయినా, అతని కుటుంబ సభ్యులకు తలరాత ఉందని గుర్తు చేస్తాడు. మరి, నరేష్ తన కుటుంబ సభ్యులను ఎలా రక్షించుకుంటాడు, యమజను ఎలా దక్కించుకుంటాడు... అనేది చిత్రకథ. నటీనటుల ప్రతిభ :   నరేష్ ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా నటించాడు. ఒక సన్నివేశంలో యముడిగాను కనిపిస్తాడు. పాటలే కాదు, ఈ సినిమాలో ఒక ఫైటు కూడా చేస్తాడు. ఇక కామెడీ చేయడంలో నరేష్ టైమింగ్ గురించి తెలిసిన విషయమే. హీరోయిన్ రిచా పనాయ్ అందంగా ఉంది. గ్లామర్ పరంగాను, నటన పరంగాను ఆకట్టుకుంటుంది. నారదుడి పాత్రలో సీనియర్ నరేష్ కనిపిస్తాడు. యముడిగా షియాజీ షిండే కు సాధారణ మార్కులు వస్తాయి. సత్యనారాయణ. మోహన్ బాబు వంటి వారిని యముడిగా చూసిన కళ్ళతో షియాజీ షిండేను చూడలేం. చిన్న యముడిగా మాస్టర్ భరత్ నవ్విస్తాడు. యముడి భార్యగా రమ్యకృష్ణ నటించింది. చాలా కాలం తరువాత కెమెరా ముందుగా వచ్చిన రమ్యకృష్ణ లో గ్లామర్ తగ్గలేదు. కృష్ణ భగవాన్, రఘుబాబు, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్ తదితరులు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : సంగీతం సాధారణంగా ఉంది. ఆకట్టుకునే పాటలు లేవు. ‘అల్లుడా మజాకా’ సినిమాలోని ‘అత్తో అత్తమ్మ కూతురో..’ రీమిక్స్ చేశారు. సినిమాకు ఈ పాట ప్రధాన అకర్షణగా నిలుస్తుంది. ఫోటోగ్రఫీ బావుంది. యమలోకం లో నరేష్ - రిచా పనాయ్ మధ్య సాగే పాట లోనూ, రఘుబాబు - భరత్ ల మధ్య సాగే క్రికెట్ మ్యాచ్ లోనూ గ్రాఫిక్స్ బావుంటాయి. ‘బలం కంటే బలమైనది బలహీనత’ వంటి మాటలు అక్కడక్కడ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ నటించిన ఈ సినిమాలో సెంటిమెంట్, ఫైట్ కూడా జోడించి పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా తీయడానికి దర్శకుడు ప్రయత్నించాడు.  హైలెట్స్ :   అల్లరి నరేష్ ప్రదర్శన, రిచా పనాయ్, కామెడీ సన్నివేశాలు డ్రాబ్యాక్స్ :   సాధారణంగా సాగే స్ర్కీన్ ప్లే, ఆకట్టుకోని దర్శకత్వం విశ్లేషణ :   యముడి నేపథ్యంలో సోషియో ఫాంటసీ సినిమాను తెరకెక్కించాలంటే చాలా కసరత్తు చేయాలి. అయితే ఈ సినిమాను అల్లరి నరేష్ కామెడీ సినిమా తరహలో దర్శకుడు రూపొందించాడు.  ఈ సినిమాలో దేవతల పాత్రలను చూపించిన తీరు, వారు ఉపయోగించే మాటలు దర్శకుడి అభిరుచిని తెలియచేస్తాయి. దేవతల ఔనత్యాన్ని కించపర్చేవిధంగా ఈ సినిమాలో దేవతల పాత్రల చిత్రీకరణ సాగింది. ముఖ్యంగా నారదుడి పాత్రను ఒక జోకర్ గా తీర్చిదిద్దారు. చిత్రగుప్తుడు (కృష్ణభగవాన్) చేత డబుల్ మీనింగ్ డైలాగులు పలికించారు. ఇక సమవర్తిగా పేర్కొనే యమధర్మరాజును అమ్మాయిల వెంటపడే వాడిగా తెరకెక్కించారు. ఈ కామెడీ సినిమాలో చివరన సెంటిమెంట్, ఫైట్ జోడించి ఈ సినిమాను ఏ వర్గానికి చెందకుండా చేశారు.  చివరగా :     అన్ని సినిమాలు ‘సుడిగాడు’ కాలేవు.

Yamudiki Mogudu Review : Cast & Crew

Yamudiki Mogudu Movie Review, Rating | Yamudiki Mogudu Review | Yamudiki Mogudu Rating | Allari Naresh Yamudiki Mogudu Telugu Movie Cast & Crew, Music, Performances te Yamudiki Mogudu Movie Review;Yamudiki Mogudu Movie Rating;Yamudiki Mogudu Review;Yamudiki Mogudu Rating;Allari Naresh Yamudiki Mogudu Movie Review, Rating;Telugu;Review;Rating;Allari Naresh;Richa Panai;Ramya Krishna;Telugu Latest Movies; true APHerald APHerald http://www.apherald.com/ImageStore/images/Movies/Movies_Reviews/Yamudiki-Mogudu-Movie-Review-300x300.jpg http://www.youtube.com/embed/L3RzcWTkhnU
 

More Articles on YM || YM Wallpapers || YM Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: