రామ్ సూపర్బ్ పెర్ఫార్మన్స్ , దేవీశ్రీ ప్రసాద్ సూపర్బ్ మ్యూజిక్ , ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ , సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ , కీర్తి సురేష్ నటనరామ్ సూపర్బ్ పెర్ఫార్మన్స్ , దేవీశ్రీ ప్రసాద్ సూపర్బ్ మ్యూజిక్ , ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ , సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ , కీర్తి సురేష్ నటనపాతదే అనిపించే కథ , ఊహాజనితంగా సాగే కథనం , బాగా స్లోగా అనిపించే సెకండాఫ్ నేరేషన్ , సెకండాఫ్ బాలేకపోవడం , ఫ్యామిలీ ఎమోషన్స్ సరిగా పండకపోవడం , సెకండాఫ్ ఎడిటింగ్

చిన్నప్పుడే మన హీరో హరి(రామ్)కి కనపడిన అమ్మాయికల్లా ప్రపోజ్ చేయడం అలవాటు. కానీ అందరూ నో అంటూ ఉంటారు. అలాంటి టైంలోనే అదే ఊర్లో ఉన్న శైలుని చూస్తాడు. ఎప్పుడూ సీరియస్ గా ఉండే శైలుని నవ్వించాలని చూస్తాడు. నవ్విస్తాడు. కానీ హరి ఫ్యామిలీ వైజాగ్ కి షిఫ్ట్ అవ్వడం వలన ఆ శైలుని మిస్ అవుతాడు. ఇక వైజాగ్ లో కూడా అదే విధానం ఫాలో అవుతున్న రామ్ ప్రేమని ఎవ్వరూ ఒప్పుకోరు. దాంతో ప్రేమకి పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తాడు. అదే టైములో శైలజ(కీర్తి సురేష్) రామ్ లైఫ్ లోకి వస్తుంది. అలా ఇద్దరూ ఒకరికి ఒకరు దగ్గరవుతారు. కొద్ది రోజులకి వారిద్దరూ చిన్ననాటి స్నేహితులని తెలుసుకుంటారు. అప్పుడే హరి శైలజకి ప్రపోజ్ చేస్తాడు. కానీ శైలు నో అంటుంది. దాంతో బాధలో ఉంటాడు హరి. అప్పుడే హరికి శైలు తనకి నో ఎందుకు చెప్పింది అనే విషయం తెలుస్తుంది. దాంతో అక్కడి నుంచి మన హరి శైలు సమస్యని తీర్చడానికి ఏం చేసాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు? చివరికి అన్ని సమస్యలు తీర్చి ఫైనల్ గా శైలుని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నదే మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.. 

నటీనటుల్లో మొదటి నుంచి లాస్ట్ దాక చెప్పుకోవాల్సిన పేరు ఒక్కటే... అదే రామ్ రామ్ రామ్.. రామ్ కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినా తనలోని అసలుసిసలైన నటున్ని పరిచయం చేసింది మాత్రం ఈ సినిమానే.. తను మొదటి నుంచి చివరి దాకా ఎవరి సపోర్ట్ లేకుండా సోలోగా సినిమాని నడిపించాడు. తన ఎక్స్ ప్రెషన్స్, మానరిజమ్స్, డైలాగ్ డెలివరీలో చూపిన వైవిధ్యం సింప్లీ సూపర్బ్. నేను శిలాజ సినిమాకి రియల్ హీరో రామ్. ఇక కీర్తి సురేష్ చూడటానికి బాగుంది. కానీ తనని ఎనర్జిటిక్ పాత్రలో కాకుండా కామ్, సీరియస్ తరహా పాత్రలో చూపారు.  కానీ ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ లో మాత్రం తన స్మైల్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సత్యరాజ్ ఓకే డీసెంట్ అనిపించాడు. నరేష్, ప్రగతి, చైతన్య కృష్ణ, ధన్య బాలకృష్ణ, ప్రిన్స్, శ్రీముఖి, కృష్ణ భగవాన్, జబర్దస్త్ సుధీర్ లు తమ పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు. 

టెక్నికల్ టీం గురించి చెప్పడానికి ముందు ఈ సినిమా కథని ఎలా తయారు చేసారు అనేది చెప్పాలి. అందులో ముందుగా ఈ సినిమా స్టొరీ ఫార్మాట్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాని నుంచి తీసుకొని దానికి నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావ్, సోలో లాంటి సినిమాలను కలిపితే ఈ కథని సిద్దం చేసారని చెప్పచ్చు. ఇక కిషోర్ తిరుమల విషయానికి వస్తే కథ పాతదే, కానీ దానిని కొత్తగా ప్రెజంట్ చేయాలి అని పాత్రలు రాసుకున్నాడు. కాస్తలో కాస్త రామ్ పాత్రని కొత్తగా రాసాడు.. మిగతా ఏ పాత్రని అంత పర్ఫెక్ట్ గా రాసుకోలేదు. అందువల్లీ రామ్ వాళ్ళ ఫస్ట్ హాఫ్ ఒకమాదిరిగా అనిపించినా సెకండాఫ్ మాత్రం అస్సలు బాలేదనిపిస్తుంది. కథ చాలా పాతది అవ్వడం వలన మొదటి నుంచీ చివరి దాకా మనకు తెలిసిందే జరుగుతుంది. అలాంటప్పుడు కథనంలో అన్నా డైరెక్టర్ కిషోర్ మేజిక్ చేయడానికి ట్రై చేయాల్సింది. కానీ అలా చేయలేదు దాంతో బాగా బోరింగ్ గా తయారయ్యింది. కథ - కథనంలు అటు ఇటుగా ఉన్నప్పటికీ డైరెక్టర్ గా మాత్రం కిషోర్ తిరుమల కొంతలో కొంత పరవాలేదనిపించాడు. అది కూడా ఫస్ట్ హాఫ్ పరంగానే.. సెకండాఫ్ ని పూర్తిగా ఫెయిల్యూర్ అనేలా చేసాడు. సెకండాఫ్ మొత్తం ఎమోషన్స్ మీదే నడపాటి కానీ ఒక్క ఎమోషన్ ని కూడా పర్ఫెక్ట్ గా చూపలేదు. మెయిన్ గా రెండు పాయింట్స్ చెప్తా... తండ్రి - కుమార్తెల మధ్య దూరం ఎందుకు పెరిగింది అనేదానికి ఒక సరైన కారణం లేదు. అలాగే చివర్లో హీరోని వెళ్ళిపొమ్మని మళ్ళీ అదే విషయాన్ని తండ్రితో ఎందుకు డిస్కస్ చేయాలి. అక్కడే చెప్పేయచ్చు కదా.. ఇలా చేయడం వలెనే సెకండాఫ్ లో ఎమోషన్ అనేది పూర్తిగా మిస్ అయ్యింది. ఓవరాల్ గా కిషోర్ తిరుమల రొటీన్ స్టొరీని కొత్తగా ప్రెజంట్ చేసి సక్సెస్ అవుదాం అనుకున్నాడు కానీ అందులో సగం మాత్రమే సక్సెస్ అయ్యాడు. 


ఇక మిగతా టెక్నికల్ టీం విషయానికి వస్తే.. దేవీశ్రీ మ్యూజికల్ ఆల్బం సూపర్ హిట్. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, సింక్ అయ్యింది.. కానీ ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఎక్కడో విన్నట్టు అనిపించే ట్యూన్స్ కొట్టాడు. ఇకపోతే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ కి డీసెంట్ గా అనిపిస్తే సెకండాఫ్ ని స్లో చేసి చిరాకు పెట్టించేసారు. కిషోర్ తిరుమల డైలాగ్స్ బాగున్నాయి. స్రవంతి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ అదుర్స్. 

నేను శైలజ అనే సినిమాని రొటీన్ అనే పదానికి దూరంగా ఉంది అనిపించే ఫీల్ ని క్రియేట్ చేయడంలో రామ్ సక్సెస్ అయ్యాడు. పాత కథనే కొత్తగా చూపించాలని ప్రయత్నించారు. అలాంటప్పుడు కథనంని కేర్ఫుల్ గా చూసుకోవాలి, అది మిస్ అవ్వడం వలన హాఫ్ బేక్ సినిమాలా తయారైంది. నేను శైలజ సినిమా ఎలా ఉంది అంటే యావరేజ్ అనే పదానికి ఎక్కువగా హిట్ అనే పదానికి కాస్త తక్కువగా ఉంది. ఓవరాల్ గా సూపర్బ్ సినిమా కాకపోయినా వేరే సినిమా ఏదీ లేకపోవడం వలన ఉన్నంతలో బాగుండడం వలన ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పచ్చు.

Ram,Keerthi Suresh,Kishore Tirumala,Sravanthi Ravi Kishore,Devi Sri Prasadనేను శైలజ - ఫీల్ గుడ్ ఫస్ట్ హాఫ్, ఎమోషన్ లెస్ సెకండాఫ్..!

మరింత సమాచారం తెలుసుకోండి: