Genius: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review

టీవి యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ దర్శకుడిగా రూపొందించిన తొలి సినిమా ‘జీనియస్’. హవీష్ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి, ఈ ‘జీనియస్’తో ఓంకార్ జీనియస్ అనిపించుకున్నాడా...? చిత్రకథ :   హవీష్, అశ్విన్ బాబు, వినోద్ ముగ్గురు చిన్నతనం నుంచి స్నేహితులు. ముగ్గురూ మూడు రకాల రంగాల్లో రాణించాలని అనుకుంటారు. అయితే వారు ఆదర్శంగా తీసుకున్నవ్యక్తులు వారిని మోసం చేయడంతో జీవితంలో చాలా కొల్పోతారు. దీంతో తమ మాదిరిగా వ్యక్తులను ఆరాధిస్తున్న వారికి ఓ సందేశం ఇవ్వాలని భావిస్తారు. మరి అందుకు వారు ఎన్నుకున్న మార్గం ఏమిటి..., తమను మోసం చేసిన వ్యక్తులకు వారు చెప్పిన గుణపాఠం ఏమిటి అనేది చిత్రకథ. నటీనటుల ప్రతిభ :   హవీష్ ఈ సినిమాలో హీరోగా కనిపిస్తాడు. అయితే మిగిలిన అశ్విన్ బాబు, వినోద్ లకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుంది. హవీష్ చాలా సన్నివేశల్లో ఒకే ఎక్స్ ప్రెషన్ తో కనిపిస్తుంటాడు. సన్నివేశం సీరియస్ గా సాగుతుంటే ఇతని ముఖంలో మాత్రం ఎలాంటి భావాలు పలకవు. నటనలో హవీష్ చాలా పరిణితి సాధించాలి. అశ్విన్ బాబు ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా తన స్నేహితుడు క్రికెటర్ తో సాగే సన్నివేశం బాగా పండించాడు. హవీష్ మరదలుగా నటించిన సునష బొద్దుగా కనిపిస్తూ అలరిస్తుంది. ఆయితే ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. బ్రహ్మనందం కనిపించేది తక్కువ సమయమే అయినా థియేటర్లలో నవ్వులు పూయించాడు. గబ్బర్ సింగ్, ముఠామేస్ర్తి పాటల్లో పవన్ కళ్యణ్, చిరంజీవిలను అనుకరించిన తీరు బావుంది. పెదబాబుగా అశీష్ విద్యార్థి, ఎమ్మెల్యేగా ప్రదీప్ రావత్ తమదైన నటనతో ఆకట్టుకుంటారు. పెదబాబు పాత్ర చూస్తే మనం నిజ జీవితంలో ఏ హీరోనూ అభిమానించం అంటే అతిశయోక్తి కాదు. సిన్సియర్ పోలీసాఫీసర్ గా శరత్ కుమార్ ఆకట్టుకుంటాడు. కోట శ్రీనివాసరావు, సుమన్, నాగబాబు, అన్నపూర్ణ తదితరలు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ బావుంది. నేపధ్య సంగీతం సినిమా కు మంచి బలాన్ని ఇచ్చింది. నటీనటులు తడబడినా నేపధ్య సంగీతం సన్నివేశాలకు ప్రాణం పోసింది. ‘డిబ్బిరి.. డిబ్బిరి..’ పాట ఆకట్టకుంటుంది. చాలా కాలం తరువాత పరుచూరి బ్రదర్స్ కలం కదం తొక్కింది. ‘విగ్రహాలు పెట్టుకున్నవాళ్ళంతా మహ్మతులు కాదు’, ‘ డైలాగ్ మార్చాలా.. డైరెక్టర్ ను మార్చాలా’... వంటి మాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు, నటులు కొత్త వారే అయినా నిర్మాత నమ్మకంతో ఖర్చుకు వెనకడుగు వేయలేదు. సందేశం ఉన్నకథతో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించాడు. తాను చెప్పే విషయంలో దర్శకుడు కొంత గందరగోళంకు గురి అవ్వడంతో ఫస్టాఫ్ తికమకగా సాగినా సెకెండ్ ఆఫ్ పట్టుగా సాగుతుంది. తాను స్పష్టంగా చెప్పవలసిన విషయాన్ని చెప్పి సినిమాను ముగిస్తాడు. హైలెట్స్ :   సందేశం తో కూడిన కథ, నేపథ్య సంగీతం, బ్రహ్మనందం ఎపిసోడ్, ‘డిబ్బిరి.. డిబ్బిరి..’ ఐటెం సాంగ్ డ్రాబ్యాక్స్ :   తికమకగా సాగే ఫస్టాఫ్, పాటలు, ఆశించిన స్థాయిలో ప్రధాన పాత్రధారుల నటన లేకపోవడం. విశ్లేషణ :   ముందు నుంచి ప్రచారం చేయబడుతున్నట్లుగా ఈ సినిమా ‘వ్యక్తిపూజ వద్దు’ అనే అంశం ఆధారంగా రూపొందిచబడింది. చిన్నికృష్ణ అందించిన ఈ కథ సందేశాత్మకంగా సాగుతుంది. సమాజంలో ఆసక్తి కలిగించే, ప్రముఖ రంగాలు అయిన సినిమా, రాజకీయం, క్రికెట్ నేపధ్యాలను ఈ సినిమాకు ఎంచుకున్నారు. ఈ రంగాలపై ఆసక్తి పెంచుకున్న ముగ్గురు యువకులు తాము ఎదుర్కొన్న అనుభవాలతో సమాజానికి ఏం సందేశం ఇచ్చారు అనే ఆంశంతో ఈ సినిమా రూపొందించారు. దీనికి కామెడీ, ఐటెం సాంగ్స్ (రెండు) కలిపి ఓ కమర్షియల్ సినిమాగా రూపొందించాలని ప్రయత్నించారు. ఈ సినిమాలో అసలు కథను ఓ ఫ్లాష్ బ్యాక్ విధంగా ప్రారంభించినా, సినిమా ప్రారంభంలో అనవసర సన్నివేశాలు ఉండటంతో ఫస్టాఫ్ ప్రేక్షకులను కన్ ఫ్యూజ్ చేస్తూ సాగుతుంది. అయితే కథను మొదలు పెట్టిన తరువాత, సెకెండ్ ఆఫ్ లోనూ సినిమా రసవత్తరంగా సాగుతుంది. భారత్-పాక్ ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్, దేశాన్ని మోసం చేసిన క్రికెటర్ ను అంతం చేసే సీన్ బాగా పండాయి. కోట శ్రీనివాసరావు- అశీష్ విద్యార్థి మధ్య సాగే సన్నివేశం సినీ తారలను మూర్ఘంగా అభిమానించే వారి కళ్ళు తెరిపిస్తుంది. టీవీ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ సినీ రంగంలో తన ప్రయాణాన్ని అందరూ గుర్తుంచుకోనేవిధంగా ప్రారంభించాడు. అనుభవం ఉన్న దర్శకుడిలా తాను చెప్పవలసిన విషయన్ని స్పష్టంగా చెప్పాడు. చివరగా : యాంకర్ ఓంకార్ ను అధిగమించిన ‘జీనియస్’ దర్శకుడు      

Genius Review : Cast & Crew

Genius Telugu Movie Review, Rating | Genius Movie Review | Genius Movie Rating | Omkar Genius Telugu Movie Cast & Crew, Music, Performances te Genius Telugu Movie Review;Genius Telugu Movie Rating;Genius Movie Review;Genius Movie Rating; Omkar Genius Movie Review, Rating;Telugu;Review;Rating; Havish;Sanusha;K. Viswanath;Telugu Latest Movies; true APHerald APHerald http://www.apherald.com/ImageStore/images/Movies/Movies_Reviews/Genius-Telugu-Movie-Review-300x300.jpg http://www.youtube.com/embed/_iXIUPT7N9Q

మరింత సమాచారం తెలుసుకోండి: