మరో అనువాద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గజరాజు పేరుతో తెలుగులో విడుదల అయిన ఈ సినిమాలో శివాజీ గణేష్ మనవడు విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు. ఈ గజరాజు సినిమాను ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ విడుదల చేశారు. చిత్రకథ :     మాణిక్యం (ఏనుగు),  బోపన్న(విక్రం ప్రభు) చిన్నప్పట్నుంచి కలిసి పెరుగుతుంటారు. తల్లితండ్రులు లేని బోపన్న మాణిక్యంను దేవస్థానాలకు, వివాహాలకు తిప్పుతూ ఉపాధి పొందుతుంటాడు.  దేవగిరి అనే ఊరులో కపాలీ అనే అడవి ఏనుగు విధ్వంసం సృష్టిస్తుండటంతో అనుకోని పరిస్థితుల్లో ఆ ఏనుగును అదుపు చేయడానికి మాణిక్యంను తీసుకుని వెళతాడు  బోపన్న. అక్కడ  ఆ ఊరి పెద్ద కుమార్తె సింగి (లక్ష్మీమీనన్)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. దీంతో రెండు రోజుల్లోనే దేవగిరి నుంచి తిరిగి వద్దామని వెళ్లిన బోపన్న ఆ గ్రామంలో మరిన్ని రోజులు ఉండటానికి నిర్ణయించుకుంటాడు. అయితే అడవి ఏనుగులను అదుపు చేయాలంటే గుమ్కీ అని పిలవబడే శిక్షణ పొందిన ఏనుగులకే సాధ్యం. మరి, కపాలీను మాణిక్యం అదుపు చేసిందా.., కట్టుబాట్లు మద్య పెరిగిన సింగిని బోపన్న దక్కించుకున్నాడా.. అన్న విషయాలు వెండి తెర మీద చూడాలి. నటీనటుల ప్రతిభ :     ప్రసిద్ధి చెందిన తమిళ నటుడు శివాజీ గణేష్ మనవడు, హీరో ప్రభు కుమారుడు విక్రం ప్రభు హీరోగా నటించిన తొలి సినిమా ఇది. ఓ ప్రముఖ సిని వారసుడు నటిస్తున్నాడంటే తెలుగు సినిమాల్లో కనిపించే అడంబరాలు, హంగులు ఈ సినిమాలో కనిపించవు. సినిమాలో కలిసిపోయి, కథా ప్రకారం సాగిపోయే హీరో పాత్రలో విక్రం నటించాడు. బోపన్న అనే పాత్రకు విక్రం సరిగ్గా సరిపోయాడు. సింగి పాత్రలో లక్ష్మీమీనన్ ఒదిగిపోయింది. మిగిలిన వారు కూడా పాత్రల్లో ఇమిడిపోయారు.  సాంకేతిక వర్గం పనితీరు : ఇలాంటి మనసును తట్టే సినిమాలకు సంగీతం-ఫోటోగ్రఫీ ప్రాణం. ఈ రెండు గజరాజుకు చక్కగా కుదిరాయి. నేపధ్య సంగీతం, ‘చెప్పేసానే..’ అనే పాట బాగున్నాయి. జలపాతం దృశ్యాన్ని చక్కగా చూపించారు. పైన నుంచి పడే జలపాతం సన్నివేశాన్ని గతంలో మనం ఏ సినిమాలోనూ చూసి ఉండం అంటే అతిశయోక్తి కాదు.   ఎలాంటి హంగు, అర్భాటం కోరుకోని సినిమా ప్రియులను ఈ సినిమా అలరిస్తుంది.  అయితే, తమిళ  నేటివిటి ఎక్కువగా ఉండే ఈసినిమా తెలుగు ప్రేక్షకులను అలరించడం కొంచెం కష్టం. విశ్లేషణ :  మనం ఎన్నో ప్రేమకథలను ఇప్పటి వరకూ చూశాం. ఈ సినిమా కూడా ఓ ప్రేమకథే. అయితే ఈ సినిమాలోని ప్రేమకథ ఓ ఏనుగు నేపథ్యంలో సాగడం విశేషం. నాగరికతకు దూరంగా ఉన్న ఓ ఆటవీ ప్రాంతంలో ఈ సినిమా సాగుతుంది. ఈ రెండు విషయాలు సినిమాకు ప్రధాన అకర్షణగా నిలుస్తాయి.   కొత్త సినిమా కథలు దొరకడం లేదని భావించే కొంత మంది తెలుగు సినిమా దర్శక నిర్మాతలు ఈ సినిమా చూసి చాలా నేర్చుకోవచ్చు. కథ, కథనాలు ఎక్కడో అకాశం నుంచి రావని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఎన్ని కథలు అయినా తయారు చేసుకొవచ్చని, వాటికి అందమైన కథనాలు జోడించి అద్భుతాలు సృష్టించవచ్చని ఈ ‘గజరాజు’ సినిమాను చూసి తెలుసుకోవచ్చు.    

Gajaraju Review : Cast & Crew

Gajaraju Movie Review, Rating | Gajaraju Review |Gajaraju Rating | Vikram Prabhu Gajaraju Telugu Movie Cast & Crew, Music, Performances te Gjaraju Review;Gjaraju Rating;Gjaraju Movie Review;Gjaraju Movie Rating;Vikram Prabhu Gjaraju Review, Rating;Telugu;Review;Rating;Vikram Prabhu ;Lakshmi Menon;Bellamkonda Suresh;Telugu Latest Movies; true APHerald APHerald http://www.apherald.com/ImageStore/images/Movies/Movies_Reviews/Gajaraju-Movie-Review-300x300.jpg http://www.youtube.com/embed/Z5T6nNKgKjQ
 

మరింత సమాచారం తెలుసుకోండి: