Sarocharu:  Tweet Review   ||  English Full Review   ||  తెలుగు  ఫుల్  రివ్యూ


 సారొచ్చారు మూవీ ట్వీట్ రివ్యూ :
8:45 : ట్వీట్ రివ్యూ ప్రేక్షకులకు స్వాగతం..
8:50 : ఇంత చలిలో కూడా థియెటర్ల వద్ద రవితేజ, కాజల్ అభిమానుల కోలాహలం ఏమాత్రం తగ్గలేదు.
9:00  : చిత్రంలోని మొదటి సన్నివేశం ‘‘అద్భుతమైన ఫైట్ తో హీరో రవితేజను పరిచయం చేస్తూ మాస్ మాస్టర్ అభిమానులను ఊర్రూతలూగించింది’’.
9:05  : ప్యారిస్ అందాలను చూపిస్తూ ఈ చిత్ర టైటిల్స్ అలరింపచేస్తున్నాయి.
9:10  :కాజల్ మిని స్కర్ట్ వేసుకుని తొందరతొందరగా కాలేజ్ కి వెళ్లే సన్నివేశం అందంగా చూపబడింది.
9:15  :మేడ్ ఫర్ ఇచ్ అదర్‘ పాటలో కార్తీక్ [రవితేజ] తన సహజమైన డ్యాన్స్ తో ఆకట్టుకుంటుండగా సంధ్య [కాజల్] మాత్రం కొద్దిగా బొద్దుగా ముద్దుగా కనబడుతుంది.

  9:20  : కార్తీక్, సంధ్యలు ప్యారిస్ నుండి భారతదేశానికి తిరిగు ప్రయాణ సన్నివేశంలో సంధ్య పాత్ర సరదాగా సాగుతుంది.
9:25  :ఈ సుధీర్ఘ ప్రయాణంలో సంధ్య, కార్తీక్ ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు చాల సరదాసరదాగా సాగుతున్నాయి. ఇందులో ప్లాటినమ్ ప్రసాద్ [ఎమ్మెస్ నారాయణ] పాత్ర నవ్వులు కురిపిస్తుంది.
9:30  :‘జగ జగ జగదేకవీర’ పాట అద్భుతమైన ప్రాంతాలలో అందంగా చిత్రీకరించారు. కానీ సంధ్య దుస్తులు కాస్త ఎబ్బెట్టుగా ఉంటాయి.
9:35  :సంధ్య ‘‘మొదటి చూపులోనే ’’ కార్తీక్ కు తన ప్రేమను వ్యక్త పరుస్తుంది. కానీ కార్తీక్ ఇచ్చిన సమాధానానికి సంధ్య హృదయం ముక్కలవుతుంది, దీంతో సంధ్య అసహానానికి గురై చెప్పే మాటలు హస్యభరితంగా ఉంటాయి.  
9:45 : కార్తీక్ తన గతం వివిరిస్తూ వసుధ (రిచా) తో తన ప్రేమ కథ గురించి వివరించసాగాడు.
9:50 :కార్తీక్ వసుధా తో ప్రేమలో పడే సన్నివేశాలు అందంగా చిత్రీకరించారు. ఇందులో కార్తీక్ హస్య భరిత నటన మొదలవుతుంది.
9:45 : కార్తీక్ తన గతం వివిరిస్తూ వసుధ (రిచా) తో తన ప్రేమ కథ గురించి వివరించసాగాడు.
9:50 : కార్తీక్ వసుధా తో ప్రేమలో పడే సన్నివేశాలు అందంగా చిత్రీకరించారు. ఇందులో కార్తీక్ హస్య భరిత నటన మొదలవుతుంది.
10:00: కార్తీక్ ఫుట్ బాల్ కోచ్ గా వసుధా సోదరుడు మాస్టర్ భరత్ ను ఉచ్చులో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.
10:02 : ప్రేమపై కార్తీక్ అభిప్రాయానికి మగ్ధురాలైన వసుధాకి కార్తీక్ పై ప్రేమ చిగురిస్తుంది.
10:05 : చిత్రంలోని మూడవ పాట ‘‘ రచ్చ రంబోలా ‘ మొదలైంది. ఈ పాటలో రిచా తన భావాలను అందంగా వ్యక్తికరించగా, రవితేజ తన సహజ నృత్యంతో ఆకట్టుకుంటున్నాడు.
10:10 : కార్తీక్, వసుధాకు వివాహం అవుతుంది. కానీ కథలో మలుపు ఏమిటంటే కార్తీక్ ఇప్పుడు భారతదేశానికి వస్తున్నది వసుధా కు విడాకులు ఇవ్వడానికి.
10:15 : చిత్రంలోని నాల్గోవ పాట ‘ గుస గుస ’ లో కార్తీక్, వసుధాల జోడి ప్రేక్షకులలో వేడిపుట్టించే విధంగా చిత్రీకరించారు. ఈ పాటలో రిచా అందాలను ఆరబోసింది.

10:20 : కార్తీక్, సంధ్యా భారతదేశంలో విమానం దిగుతారు. ఈ ప్రయాణంలో కాజల్, రవితేజ చెబుతున్న ప్రేమకథ వింటూంటుంది. 
10:25 :  కార్తీక్ తన గతం గురించి మరియు వసుధా స్వబావం గురించి వివరించిన సన్నివేశాలు సరదాగా సాగుతాయి.  
10:27 : కార్తీక్ ఫుట్ బాల్ కోచ్ గా బిజీగా ఉండడం కార్తీక్, వసుధా ల మధ్య దూరం పెరగడానికి కారణమవుతుంది.  
10:30 : కొన్ని విసిగించే సన్నివేశాలతో చిత్రం నిదానంగా సాగుతుంది.
10:33  :‘‘ కాటుక కళ్లు’’ పాట థియేటర్ లో మళ్లీ ఉషారెత్తిస్తుంది.
11: 00 : ఈ ప్రేమ కథ కార్తీక్ది కాదని తెలసుకున్న సంధ్య అసహనాన్ని వ్యక్తం చేసే సన్నివేశం అంతగా ఆకట్టుకోలేదు.
11: 10 : 'సంధ్య' గురించి 'నారా రోహిత్' కవిత్వం హాల్ లో నవ్వులు పుట్టిస్తుంది.
11: 15 : సంధ్య తన తల్లి సలహా మేరకు గౌతమ్ [నారా రోహిత్] తో పెళ్లికి సిద్దమౌతుంది. కానీ గౌతమ్, సంధ్యకు కార్తీక్ పై ప్రేమ ఉన్నట్లు గ్రహిస్తాడు.
11: 20 : నారా రోహిత్, సంధ్యకు కార్తీక్ పై ఉన్న ప్రేమ గురించి చెప్పే మాటలు ఆకట్టుకుంటాయి.  
   

Sarocharu : Cast & Crew

Sarocharu Movie Review, Rating | Sarocharu Review | Sarocharu Rating | Ravi Teja's Sarocharu Telugu Movie Cast & Crew, Music, Performances te Sarocharu Review;Sarocharu Rating;Sarocharu Movie Review;Sarocharu Movie Rating;Ravi Teja Sarocharu Movie Review, Rating;Telugu;Review;Rating;Ravi Teja;Kajal Agarwal;Richa Gangopadhyay;Telugu Latest Movies; true APHerald APHerald http://www.apherald.com/ImageStore/images/Movies/Movies_Reviews/Sarocharu-Movie-Review-300x300.jpg http://www.youtube.com/embed/S7p0UYSXrIY
 

Sarocharu Full English Review

 

మరింత సమాచారం తెలుసుకోండి: