క్లైమాక్స్ ఎపిసోడ్ , మెయిన్ స్టొరీ లైన్ , హీరోయిన్ సొనారిక మరియు తమన్నాల అందాల ఆరబోత , అక్కడక్కడా కామెడీ , సినిమా స్టార్టింగ్ క్లైమాక్స్ ఎపిసోడ్ , మెయిన్ స్టొరీ లైన్ , హీరోయిన్ సొనారిక మరియు తమన్నాల అందాల ఆరబోత , అక్కడక్కడా కామెడీ , సినిమా స్టార్టింగ్ ఒరిజినల్ వెర్షన్ లోని ఎమోషనల్ ఫీల్ ని మిస్ చేయడం , సాంగ్స్ ప్లేస్ మెంట్ , కమర్షియాలిటీ కోసం నేటివిటీని మిస్ చేయడం , కథనం , నేరేషన్ ఒక్కో చోట బాగున్నా ఎక్కువ భాగం స్లోగా అనిపించడం , ఎడిటింగ్

రాప్తాడు నియోజకవర్గంలోని వెంకటాపురం గ్రామంలోని వారు పగ ప్రతీకారాలు అని ఎంతలా తిరుగుతారో, అదే రేంజ్ లో తమ ఇంటి ఆడపడుచులను, కూతుళ్ళను ప్రేమగా చూసుకుంటారు. వారి ఆడ పిల్లల వెంట ప్రేమ గీమ అంటూ ఎవరన్నా వెనకపడితే వాణ్ణి చంపేస్తారు. కట్ చేస్తే పక్క ఊరైన రామగిరి గ్రామానికి పెద్ద అయిన వీరభద్రప్ప కుమారుడే మన హీరో శోభన్(బెల్లంకొండ శ్రీనివాస్). చదువు ఫినిష్ చేసి ఆవారాగా తిరిగే శోభన్ కి ఉన్న ఒకే ఒక్క బలహీనత ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ కోసం ఏం చేయడానికైనా సిద్దపడే మనస్తత్వం. ఓ రోజు తన ఫ్రెండ్ అయిన గిరి (మధు) ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి తనని సాయం అడుగుతాడు. ఆ అమ్మాయే మన హీరోయిన్ వాసంతి(సొనారిక బడోరియా).


కొద్ది రోజులు ఆ అమ్మాయి చుట్టూ తిరిగి గిరికి ఆ అమ్మాయిని సెట్ చేయాలని ట్రై చేస్తాడు. మరి అందరూ అనుకున్నట్టుగానే హీరోయిన్ హీరోనే కదా లవ్ చేస్తుంది. అలానే వాసంతి శోభన్ ని ప్రేమిస్తుంది. గిరి కన్విన్స్ అవ్వడంతో శోభన్ - వాసంతిల ప్రేమ షురూ అవుతుంది. ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచే శోభన్ కి లేని పోని సమస్యలు వస్తాయి. దాని వలన జైలుకి కూడా వెళ్ళాల్సి వస్తుంది. శోభన్ ఇన్ని ఇబ్బందులకు కారణం మదన్(చైతన్య కృష్ణ), జగన్(కబీర్ దుహన్ సింగ్). అసలు శీను కి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వీరిద్దరి వలన శోభన్ కు వచ్చిన ఇబ్బందులు ఏంటి అనేదే అసలైన ట్విస్ట్? శోభన్ జైలుకెందుకు వెళ్ళాడు? అలాగే ఫ్రెండ్స్ శోభన్ మీద ఎందుకు పగ బట్టారు అన్నదే మిగిలిన కథ..  

మొదటి సినిమాలో ఎలా అయితే ఫాస్ట్ బీట్స్ కి అదిరే డాన్సులు వేసాడే, ఎలా అయితే గాల్లోకి ఎగిరేలా విలన్స్ తో ఫైట్ చేసాడో అదే ఈజ్ తో ఇందులోనూ డాన్సులు, ఫైట్లూ చింపేసాడు అని చెప్పాలి. కానీ నటుడిగా మాత్రం ఇందులో ఎలాంటి మెచ్యూరిటీ చూపలేదు. మొదతీ సినిమాలో ఎలా చేయ్సాడో అలానే ఉంది. చెప్పాలంటే ఈ సినిమాలో తన పాత్రకి ఎమోషనల్ టచ్ ఉంది. కానీ ఆ ఎమోషనల్ సీన్స్ లో తను తేలిపోయాడు. ఆ విషయంలో, లవ్ సీన్స్ లో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఫైట్లూ, డాన్సులు ఎవరన్నా చేస్తారు, కానీ నటన కొంతమందే చేయగలరు.


ఇక సినిమాకి హీరో కంటే హీరోయిన్స్ తో గ్లామర్ అట్రాక్షన్ తీసుకు రావడానికి నార్త్ ఇండియన్ బ్యూటీ  సొనారిక బడోరియాని హీరోయిన్ గా తీసుకొని ఎక్స్ట్రా అట్రాక్షన్ కోసం తమన్నాతో భారీగా అందాలు ఆరబోయించి ఓ స్పెషల్ సాంగ్ చేయించారు. సినిమాకి చివర్లో ఒక్కసారిగా ఊపు తీసుకొచ్చే సాంగ్ ఇది. సొనారిక సీన్స్ లో మాత్రం అచ్చ తెలుగమ్మాయిలా పద్దతిగా కనిపించి, పాటల్లో మాత్రం పొట్టి పొట్టి బట్టల్లో తన అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇక సినిమాకి ఎంటర్టైన్మెంట్ ని అందించడంలో సపోర్ట్ ఇచ్చిన వారు శ్రీనివాస్ రెడ్డి, పృధ్వీరాజ్, పోసాని కృష్ణమురళి. సపోర్టింగ్ రోల్స్ చేసిన ప్రకాష్ రాజ్, రావు రమేష్, పవిత్రా లోకేష్ లు బాగా చేసారు. ఎమోషనల్ అండ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కబీర్ దుహన్ సింగ్, చైతన్య కృష్ణలు బాగా చేసారు. 

తమిళ హిట్ మూవీ సుందర పాండ్యన్ సినిమాకి స్పీడున్నోడు రీమేక్. మనవాళ్ళు రీమేక్ అనగానే ఏదేదో చేసి సినిమాని రాంగ్ ట్రాక్ ఎక్కిస్తుంటారు. ఈ సినిమాలోనూ అలాంటివి కొన్ని మార్పులు జరిగాయి. అసలు ఒరిజినల్ వెర్షన్ కి రీమేక్ వెర్షన్ కి ఉన్న తేడాలు ఏంటి అనే విషయానికి వస్తే.. సీన్స్ పరంగా దాదాపు 70% సీన్స్ యాజిటీజ్ గా తీసేశారు.. ఎంతలా అంటే లొకేషన్ మరియు ఆ లొకేషన్ లో కనిపించే ప్రాపర్టీస్ కూడా సిమిలర్ గా ఉండేలా దించేసారు.. ఇక మిగతా 30% మన తెలుగు కమర్షియల్ ఫార్మాట్ అని మన తెలుగు సినిమాల రొటీన్ కామెడీ మార్క్ ని ఇరికించడానికి ట్రై చేసారు.

ఇక ఒరిజినల్ వెర్షన్ లో ప్రతి సీన్, పాత్రలు రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. కానీ తెలుగులో రియాలిటీ అనేదే కనిపించదు. దానికి తోడు కమర్షియాలిటీ పేరుతో  అక్కడక్కడా ఓవరాక్షన్ కూడా ఉంటుంది. ఒరిజినల్ స్టొరీ లైన్ చాలా సింపుల్ కానీ నేటివిటీ ఫ్లేవర్ తమిళ వెర్షన్ కి బిగ్గెస్ట్ ప్లస్ కానీ ఇక్కడ అదే మైనస్. మెయిన్ గా హీరోయిజం అనే పేరుతో హీరో పాత్రలో సోల్ ని మిస్ చేసారు. అలాగే అక్కడ ఉన్న ఒరిజినల్ ఎమోషనల్ ఫీల్ ని మొదటి నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తారు కానీ ఇందులో మాత్రం ఎమోషనల్ ఫీల్ అనేది లేకుండా వెళ్తుంది. అందుకే క్లైమాక్స్ లో సడన్ గా ఎమోషనల్ వైపు టర్న్ చేయడంతో 100% సక్సెస్ కాలేకపోయాడు. కమర్షియాలిటీ కోసం జత చేసిన సాంగ్స్ అస్సలు హెల్ప్ అవ్వలేదు, అలాగే ఒకరి రెండు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కథకి అవసరం లేదు అనే ఫీలింగ్ ని తెస్తాయి. ఇకపోతే తమిళంలో హీరో ఫ్రెండ్ పాత్ర బాగా నవ్విస్తుంది, కానీ ఇక్కడ శ్రీనివాస్ రెడ్డికి పెద్ద ప్రాధాన్యత లేకుండా చేసేసారు.

అలాగే హీరోయిన్ పాత్ర చుట్టూ కథ తిరిగినా సినిమాలో తను కనిపించేది చాలా తక్కువ. భీమనేని చేసుకున్న స్టొరీ డెవలప్ మెంట్ లో రాంగ్ ట్రాక్స్ జత కలిసాయి తప్ప సినిమాకి హెల్ప్ అయ్యేవి ఏవీ దొరకలేదు. ఇకపోతే కథనం లో పెద్ద సస్పెన్స్ క్రియేట్ చేయలేదు, అలాగే నేరేషన్ కూడా బాగా స్లోగా ఉంది.. డైరెక్టర్ గా మాత్రం నటీనటుల నుంచి పరవాలేధనిపించుకునే నటనని రాబట్టుకున్నాడు. భీమనేని సినిమా అమోట్టంలో డీల్ చేసిన బెస్ట్ పార్ట్ క్లైమాక్స్.. ఓవరాల్ గా సుడిగాడు రేంజ్ లో భీమనేని సక్సెస్ కాలేకపోయాడు.


మిగతా డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే.. విజయ్ ఉలగనాథ్ ప్రత్ ఫ్రేం కలర్ఫుల్ గా, అలాగే నేటివిటీకి సింక్ అయ్యేలా కథని చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ఈ విజువల్స్ రావడానికి కారణమైన ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ ఆర్ట్ బాగుంది. ఇంకా చెప్పాలంటే ఆయన్ని కొత్తగా ఏమే ట్రై చేయలేదు, ఒరిజినల్ వెర్షన్ ఎలా అలానే యాజిటీజ్ గా దించేయమన్నారు, ఆయన దాన్ని చిన్న చిన్న మార్పులతో చెసాఉద్. డిజే వసంత మ్యూజిక్ బాగుంది. 3 పాటలు బాగున్నాయి, అలాగే షూట్ చేసిన విజువల్స్ ప్రకారం మాత్రం మస్త్ అనిపించాయి. నేపధ్య సంగెతం ఓకే ఓకే అనేలా ఉంది. ఎడిటింగ్ ఇంకా చాలా బాగుండాల్సింది. ఎందుకంటే.. చాలా చోట్ల అనవసరంగా డ్రాగ్ చేస్తూ వెళ్ళాడు. అవి తగ్గించి ఉంటె సినిమాకి కాస్త హెల్ప్ అయ్యేది. ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్ అనేలా ఉన్నాయి. 


రీమేక్స్ చేయడంలో దిట్ట అనిపించుకున్న భీమనేని శ్రీనివాసరావు 'అన్నవరం' తర్వాత మరోసారి రీమేక్ కాన్సెప్ట్ ని పర్ఫెక్ట్ గా తీయడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే ఆయన రీమేక్ చేయాల్సినప్పుడు పక్కగా ఉండాల్సిన ఒరిజినల్ సోల్ ని పూర్తిగా తీసుకొని ప్రెజంట్ చేయలేకపోయాడు. ఒరిజినల్ వెర్షన్ లోని సీన్స్, డైలాగ్స్, ట్విస్ట్స్ మరియు బేసిక్ లైన్ ని తీసుకున్నాడు కానీ ఒరిజినల్ సోల్ మరియు సినిమాకి కీలకం అయిన నేటివిటీని తీసుకొని వాటిని మనకు సింక్ అయ్యేలా చెప్పడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. చెప్పాలంటే పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ తీసుకొని ఒక్క సీన్ ని కూడా మార్చకుండా ఉన్నది ఉన్నట్టు తీసున్నా ఇంకాస్త బెటర్ గా ఉండేది. సినిమాలో అక్కడక్కడా ఎంటర్ టైన్మెంట్ ఉండడం, అలాగే క్లైమాక్స్ బెస్ట్ అవ్వడం వలన ఓ బెటర్ ఫీల్ తో బయటకి వస్తాం. వేరే సినిమాలేవీ లేకపోవడం వలన కచ్చితంగా కొత్త సినిమా చూడాలి అనుకుంటే ఈ చ్నేమాని చూడచ్చు. లేదా లైట్ తీసకోవచ్చు.

Bellamkonda Sai Sreenivas,Sonarika Bhadoria,Bheemineni Srinivasa Rao,Bheemaneni Suneetha,Sri Vasanthస్పీడున్నోడు - స్పీడ్ లెస్ రీమేక్!!

మరింత సమాచారం తెలుసుకోండి: