సినిమా స్టార్టప్ , క్లైమాక్స్ బిట్సినిమా స్టార్టప్ , క్లైమాక్స్ బిట్ఓల్డ్ స్టొరీ లైన్ , ఆద శర్మ లుక్ & పెర్ఫార్మన్స్ , బాడ్ స్క్రీన్ ప్లే - స్లో నేరేషన్ , వర్కౌట్ కాని కామెడీ , వీక్ డైరెక్షన్ , ఎడిటింగ్ , హారిబుల్ సెకండాఫ్ , అనవసరమైన సాంగ్స్

రాంబాబు(తనికెళ్ళ భరణి) లేకలేక కలిగిన సంతానం అని వారాలబాబు(ఆది) అని పేరు పెట్టుకుంటాడు. కానీ మన వరాలబాబు ఏమో చిన్నప్పటి నుంచీ చదువు సంధ్యా ఎక్కక జులాయిలా పెరుగుతాడు. కట్ చేస్తే ఓ రోజు పక్కింటి వాళ్ళ వారసుడు ఏదో అయిపోతున్నారని తక్కువ చేసి మాట్లాడుతుండడంతో, వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకోమని చెప్పడం కాదు, నన్ను చూసుకొని నేర్చుకోమనే స్టేజ్ కి వస్తా అని చెప్పి ఊరి నుంచి సిటీకి బస్ ఎక్కుతాడు. అలా హైదరబాద్ లో దిగగానే మన హీరో హీరోయిన్ సమీర(ఆద శర్మ)ని చూసి ప్రేమలో పడతాడు. ఇక అక్కడి నుంచి లుక్ అండ్ గెటప్ మార్చి సమీరని ఇంప్రెస్ చేసే పనిలో పడతాడు. కట్ చేస్తే ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్.. సమీరకి బిజ్జు(కబీర్ దుహన్ సింగ్) నుంచి ఓ సమస్య వస్తుంది. అసలు ఈ బిజ్జు ఎవరు, బిజ్జు తెచ్చిన సమస్య ఏంటి? సామాన్య యువతి అయిన సమీరకి అంత పెద్ద సమస్య రావడానికి గల కారణం ఏంటి? వీటన్నిటినీ క్లియర్ చేసిన వారాల బాబు చివరికి తన ప్రేమని గెలుచుకున్నాడా? లేదా? అన్నదే అసలు కథ.     

ఆది మొదటిసారి ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో నటించాడు. సినిమా మొత్తం ఒకటే ఈజ్ ని మైంటైన్ చేస్తూ, మాస్ ఎలిమెంట్స్ ని చక్కగా ప్రెజంట్ చేసాడు. అక్కడక్కడా డైలాగ్ మాడ్యులేషన్ కూడా బాగుంది. హీరోయిన్ ఆద శర్మ చుట్టూనే కథ తిరుగుతుంది. కానీ అస్సలు రోల్ లేదు. అంతే కాకుండా, ఆద శర్మ లుక్ పరంగానూ, పెర్ఫార్మన్స్ పరంగానూ మెప్పించలేకపోయింది.. తన కెరీర్ కి ఇదొక పెద్ద నెగటివ్ మార్క్ అని చెప్పవచ్చు. ఇక మెయిన్ విలన్ గా చేసిన కబీర్ దుహన్ సింగ్ నెగటివ్ షేడ్స్ బాగానే చేసాడు. ఇక తనికెళ్ళ భరణి, సీనియర్ నరేష్ లు కీలక సన్నివేశాల్లో మంచి నటనని కనబరిచి బెస్ట్ అనిపించుకున్నారు. మెయిన్ గా నరేష్ క్లైమాక్స్ సీన్ లో మెప్పించాడు. ఇక బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి  పృధ్వీ రాజ్, తాగుబోతు రమేష్ లు నవ్వించడంలో దారుణంగా ఫెయిల్ అయ్యారు. శకలక శంకర్, మధులు పరవాలేదనిపించుకున్నారు. 

పెళ్ళైన కొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు లాంటి డీసెంట్ క్లాస్ ఎంటర్టైనర్స్ తీసిన మదన్ నుంచి వచ్చిన మొట్ట మొదటి ఫుల్ మాస్ సినిమా ఇది. అలాగే మదన్ కూడా ఈ సినిమాకి కథ రాసుకోలేదు. శ్రీనివాస్ గావిరెడ్డి దగ్గర కథ నచ్చి తీసుకున్నారు. కానీ పాయింట్ ఏంటంటే అదేదో ఆహా ఓహో అనే కతెం కాదు.. చాలా పాత కథే.. దానికి ఏదో కొంత మాస్ యాంగిల్ ని, కొన్ని కొత్త రంగుల్ని వేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. కానీ ఆ కొత్త రంగులు ఏవీ వర్క్ అవుట్ కాలేదు. మైన గా మాస్ అండ్ కామెడీ అనే దాని కోసం స్పూఫ్ ల మీద, రొటీన్ యాక్షన్ స్టఫ్ మీద ఆధార పడాల్సి వచ్చింది. మెయిన్ గా సినిమా స్టార్టప్ లో పాత్రల పరిచయాలు కాస్త నవ్విస్తాయే తప్ప మిగతా ఎక్కడా నవ్వుకునే సీన్స్ లేవు. పోనీ కథ పాతదే అయినా మదన్ ఏమన్నా స్క్రీన్ ప్లేలో మేజిక్స్ చేసాడా అంటే అదీ లేదు. జస్ట్ తన దగ్గర ఉన్న ఒక్క ట్విస్ట్ ని చివరి దాకా హోల్డ్ చేయడానికి ట్రై చేసాడు. కానీ అది ముందే గెస్ చేసేయ్యగలం కావున పెద్ద కిక్ ఉండదు. ఇక నేరేషన్ విషయానికి వస్తే మొదటి 20 నిమిషాల తర్వాత నేరేషన్ చాలా స్లో అయిపోతుంది. దానికి తోడు సొల్లు కామెడీ మరియు పాటలు తెగ చిరాకు పెడతాయి. డైరెక్టర్ గా మదన్ కి క్లాస్ పాయింట్స్ ని డీల్ చేయడం బాగా తెలుసు. కానీ మొదటి సారి మాస్ ఎలిమెంట్స్ ని టచ్ చేసి తన గొయ్యి తనే తీసుకున్నాడు. మాస్ యాంగిల్ లో సినిమాని అస్సలు డీల్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయనకీ బలవంతంగా వచ్చే కామెడీ, పాటలు, పాత్రలని కథలో తీసుకు రావడం చేత కాదు కానీ ఇందులో అనాటివి చాలా ఉండడం వలన తడబడ్డాడు. ఓవరాల్ గా ఫెయిల్ అయ్యాడు.


శ్రీనివాస్ గావిరెడ్డి(సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు డైరెక్టర్) ఈ సినిమాకి కథ, మాటలు అందించాడు. కథ ఓవరాల్ ఫార్మాట్ చాలా పాతదే అయినా అందులో చెప్పిన ఒకటి, రెండు పాయింట్స్ పరవాలేధనిపిస్తాయి. డైలాగ్స్ మాత్రం చాలా చోట్ల బెటర్ గా ఉంటాయి. సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాలోని కంటెంట్ పరంగా డీసెంట్ అనిపిస్తుంది. అగస్త్య సాంగ్స్ ఓకే కానీ ప్లేస్ మెంట్ అస్సలు బాలేవు. అందుకే సాంగ్స్ ని ఎవరూ పట్టించుకోరు. నేపధ్య సంగీతం పరవాలేదు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ సెకండాఫ్ లో దారునాతి దారుణంగా ఉంది. సురేఖ.పి నిర్మాణ విలువలు బాగున్నాయి.  



ప్రతి ఒక్క డైరెక్టర్ కి ఒక్కో మార్క్ ఉంటుంది, ఒకరు ప్రేమకతల్ని బాగా తీస్తే కొంతమంది మాస్ సినిమాలను తీస్తారు.. ఇక్కడ పాయింట్ ఏంటంటే దాదాపు అందరూ ఎప్పుడూ ఎక్కడో చెప్పిన కథలనే సెలక్ట్ చేసుకొని ఎంగేజింగ్ గా ఉండేలా చెప్తారు. కానీ ఎప్పుడైతే డైరెక్టర్ తను బెస్ట్ అనిపించుకున్న ఫ్లేవర్ ని కాకుండా పక్కదానిని ట్రై చేస్తాడో అప్పుడు డెబ్బై పోతుంటాడు. 100 కి 100 శాతం ఈ సినిమా విషయంలో అదే జరిగింది. మదన్ కి క్లాస్ పాయింట్, టేకింగ్ అండ్ సందర్భానుసారంగా వచ్చే కామెడీ మీద ఎక్కువ పట్టుంది. కానీ తనకి వచ్చిన దాన్ని పూర్తిగా పక్కన పెట్టి మాస్, కమర్షియల్ సినిమా అనే మూసలో పడి చేసిన ఈ గరం సినిమా పూర్తిగా గాడి తప్పి ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. అలాగే హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆదికి మరో ఫ్లాప్ ని ఇచ్చింది.గరం అనే సినిమాలో మీరు థియేటర్ కి వెళ్లి చూసి ఎంజాయ్ చేసే ఎలిమెంట్ ఏమీ లేదు. అలాగే ఈ సినిమా నటనపరంగా ఒక్క ఆదికి తప్ప మిగతా ఎవ్వరికీ లాభం లేనిది.

Aadi,Adah Sharma,Madan,Saikumar,Agasthya.గరం - సప్పగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: