మాళవిక నాయర్ పెర్ఫార్మన్స్ , ప్రొడక్షన్ వాల్యూస్ , వేళ్ళతో లెక్కించదగిన కామెడీ సీన్స్ మాళవిక నాయర్ పెర్ఫార్మన్స్ , ప్రొడక్షన్ వాల్యూస్ , వేళ్ళతో లెక్కించదగిన కామెడీ సీన్స్ ఎడిటింగ్ , మ్యూజిక్ , నేపధ్య సంగీతం , సెకండాఫ్ , క్లైమాక్స్ , ఎమోషనల్ లేని పాత్రలు

గేమ్ డిజైనర్ అయిన శౌర్య(నాగ శౌర్య) - దివ్య(మాళవిక నాయర్) ల మధ్య పెళ్లి చూపులతో కథ మొదలవుతుంది. ఇద్దరూ విభిన్న అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు. అందుకే వీరిద్దరికీ మాచ్ ఫిక్స్ అవ్వదు. కానీ వీరిద్దరూ పేరెంట్స్ వీళ్ళకి వరుసగా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. కానీ ఏవీ సెట్ అవ్వవు. ఆ తర్వాత ఓ సందర్భంలో కలిసిన శౌర్య - దివ్యలు ఓ ప్లాన్ వేస్తారు. అదేమిటంటే పెద్దల కోసం పెళ్లి చేస్కొని ఆ తర్వాత విడిపోదాం అనుకొని పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లి చేసుకున్నాక ఇద్దరి మధ్య జరిగే కొన్ని సంఘటనల వలన ఇద్దరికీ ఒకరి మీద ఒకరి ఫీలింగ్స్ మొదలుతాయి. ఇక అక్కడి నుంచి వారిద్దరి మధ్యా జరిగిన పరిస్థితులు ఏంటి? చివరికి ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టి ఒకటయ్యారా లేదా అన్నది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..     


ఈ సినిమా కథకి పర్ఫెక్ట్ గా సరిపోయే నటీనటులను ఎంచుకోవడంలోనే నందిని రెడ్డికి ఫుల్ మార్క్స్ పడ్డాయి. వీళ్ళు మాత్రమే ఆ పాత్రలకి న్యాయం చేయగలరు అనిపించేలా పెర్ఫార్మన్స్  ఇచ్చారు. చాలా రోజులుగా కనపడని వారు సీనియర్ యాక్టర్స్ ఇందులో కనిపించడం చాలా ఫ్రెష్ గా ఉంది. ఇక హీరోగా నాగ చౌర్య తన పాత్రలో జీవించాడు. తన కెరీర్లో ఇప్పటి వరకూ చేసిన అన్ని సినిమాల్లోకి ఇందులోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మెయిన్ గా డైరెక్టర్ కి సరండర్ అయ్యి తను చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక మాళవిక నాయర్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఎక్స్ ప్రెషన్స్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ లతో పాత్రకి ప్రాణం పోసింది. ఇక సపోర్టింగ్ రోల్స్ లో చేసిన ఆనంద్, రాశి, ఐశ్వర్యలు తమ తమ పాత్రలకు జస్టిఫికేషన్ ఇచ్చారు. ప్రగతి, నవీన్ నేని, ధనరాజ్, మహేష్ కోనేరులు అతిధి పాత్రల్లో మెప్పించారు.    

కళ్యాణ వైభోగమే సినిమా కథ ఎప్పుడో సినిమా  పుట్టినప్పటి నుంచీ వస్తూనే ఉన్నాయి.. ఆ కథని తీసుకొని ఇప్పటి యువత మెంటాలిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి నందిని రెడ్డి ఈ కథని సిద్దం చేసింది. మెయిన్ గా ఇప్పటి యువత మధ్య ప్రేమ, పెళ్లి అంటే ఉన్న అభిప్రాయాల మీద ఈ సినిమాని డీల్ చేసారు. కాస్త ఆసక్తిగా సినిమాని మొదలు పెట్టి ఆ తర్వాత ఆపోజిట్ పోల్స్ లాంటి ఇద్దరికీ పెళ్లి చేస్తారు. అక్కడి దాకా బాగానే ఉన్న అక్కడి నుంచి మరీ స్లోగా తయారవుతుంది.. రాను రాను బోరింగ్ గా తయారవుతుంది. పెళ్లి తర్వాత వచ్చే సమస్యలు, రొమాంటిక్ ట్రాక్ మరియు విడిపోవాలనుకోవడం లాంటి టాపిక్స్ అస్సలు సినిమాకి సెట్ అవ్వలేదు. ఇక ఇంటర్వెల్ తర్వాత అయితే నందిని రెడ్డి సందర్భాల పరంగా ఏమీ కొత్తగా ట్రై చేయకుండా  పాత చింతకాయ పచ్చడి లాంటి సీన్స్ తో ప్రేక్షకులకు టార్చర్ పెట్టింది. సెకండాఫ్ లో మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. అంతే ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మెయిన్ గా చెప్పాలి అంటే, హీరో - హీరోయిన్ మధ్య రిలేషన్ షిప్ మరియు లవ్ ని ఎక్కడా ఎలివేట్ చేయలేదు.. కావున వాళ్ళు ప్రేమ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. మళ్ళీ క్లైమాక్స్ దగ్గర కాస్త స్పీడా వుతుంది. మెయిన్ గా తాగుబోతు రమేష్, ఆశిష్ విద్యార్థి ల పాత్రలని అలా మొదలైంది నుంచి తీసుకొని ఇందులో క్లైమాక్స్ లో వాడుకున్నారు. కానీ అవి ఏవీ వర్కౌట్ అవ్వలేదు.     

నందిని రెడ్డి కామెడీ బాగా చూపిస్తుంది, అలాగే నేటి తరం పెళ్ళిళ్ళు మీద సినిమా కాబట్టి ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ఆశించవచ్చు కానీ అలా అనుకుంటే మీరు పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే సినిమాలో ఏ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. నందిని రెడ్డి నవ్వించడానికి కొన్ని ట్రిక్స్ వాడింది కానీ దానికంటే ఇర్రిటేట్ చేసే అంశాలను ఎక్కువగా మిక్స్ చేసింది. ఫైనల్ గా నందినిరెడ్డి ఎంటర్ టైన్ చేస్తుంది అని వచ్చిన వారిని నిరుత్సాహాపరిచింది.  

కల్యాణి కోడూరి పాటలు ఏవీ మెచ్చుకునేలా లేవు.. అన్ని పాటలు బాలీవుడ్ హిట్ సాంగ్స్ నుంచి తీసుకున్నట్టే ఉంటాయి. నేపధ్య సంగీతం యావరేజ్. జివిఎస్ రాజు సినిమాటోగ్రఫీ బాగుంది. హైదరాబాద్ ని కొత్తగా బాగా చూపించాడు. సిద్దిక్ ఎడిటింగ్ బాలేదు. మెయిన్ గా 20 నిమిషాల సినిమాని కట్ చేసెయ్యచ్చు కానీ అలానే ఉంచి ప్రేక్షకులకు టార్చర్ చూపించాడు. రంజిత్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. 


ప్రస్తుతం యువత అంతా పెళ్లి అనేది నూరేళ్ళ మంట అని అనుకుంటుంటే నందిని రెడ్డి మాత్రం పెళ్లి అనేది నూరేళ్ళ పంట అని చెప్పాలనుకొని ట్రై చేసింది. కానీ అలా చెప్పాలి అంటే ప్రతి ఎమోషన్ ని అందులో ఉన్న ఫీలింగ్స్ ని పర్ఫెక్ట్ గా చూపించాలి.


కానీ ఆ విషయంలో ఫెయిల్ అవ్వడం వలన సినిమా ఇర్రిటేట్ చేస్తుంది. ఇలాంటి పెళ్లి బంధం మీద వచ్చిన పెళ్ళి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, హ్యాపీ లాంటి సినిమాలు ఎమోషన్స్ పరంగా కనెక్ట్ అయ్యాయి కానీ ఇందులో ఎలాంటి ఎమోషన్స్ కనెక్ట్ అవ్వలేదు. ఫైల గా నందిని రెడ్డి తన మూడవ చాన్స్ ని కూడా వృధా చేసుకుంది. 

Naga Shourya,Malavika Nair,Pearle Maaney,Nandini Reddy,K Damodar Prasad,Kalyan Koduriకళ్యాణ్ వైభోగమే - వైభవంగా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: