అక్కడక్కడా వచ్చి నవ్వించే కొన్ని సీన్స్ , అలీ చేసిన కామెడీ సీన్స్అక్కడక్కడా వచ్చి నవ్వించే కొన్ని సీన్స్ , అలీ చేసిన కామెడీ సీన్స్అనవసరంగా వచ్చి టార్చర్ చేసే సాంగ్స్ , కథలో మెప్పించే అంశాలు లేకపోవడం , ఫ్లాట్ అండ్ బోరింగ్ నేరేషన్ , ఎడిటింగ్ , సాగదీసిన సెకండాఫ్ , ఎమోషన్స్ లేని క్లైమాక్స్

ఎఆర్ మురుగదాస్ కథతో రూపొంది తమిళంలో మంచి విజయం అందుకున్న 'మాన్ కరాటే' సినిమాకి రీమేక్ గా వచ్చిన సినిమానే 'తుంటరి'.. ఇక కథ కమీషులోకి వస్తే.. ఎలాంటి పనీ పాటా లేకుండా ఫ్రెండ్ కిషోర్(వెన్నెల కిషోర్)తో కలిసి ఆవారాగా తిరిగే కుర్రాడే మన హీరో రాజు(నారా రోహిత్). రాజు ఒకసారి సిరి(లతా హెగ్డే)ని చూసి ప్రేమలో పడతాడు. తనని ఎలాగోలా పడేయాలి అని చూస్తున్న టైంలో.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ అయిన పూజిత అండ్ ఫ్రెండ్స్ బాచ్ రాజుని వెతుక్కుంటూ వచ్చి.. తను ఆ ఏడాది జరిగే కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చెయ్యాలని ఫోర్స్ చేస్తారు. కానీ తనకి తాడని రాజు ఒప్పుకోడు. కానీ తనకి అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని, డబ్బులతో పాటు తనకి కావాల్సినవి అన్నీ చేసి పెడతాము అని చెప్పి వారు రాజుని బాక్సింగ్ కి ఒప్పిస్తారు. రాజు మొదటగా సిరి తనని ప్రేమించేలా చేయమని కండిషన్ పెడతాడు. ఫైనల్ గా ఎలాగోలా చేసి రాజుని - సిరిని ఒకటి చేస్తారు. రాజు పెద్ద సీరియస్ గా బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకోకపోయినా వరుసగా మ్యాచ్ లు అన్నీ గెలుచుకుంటూ వస్తుంటాడు. ఇక పొతే ఫైనల్ మ్యాచ్ డేంజరస్ కిక్ బాక్సర్ అయిన రాజు ది కిల్లర్(కబీర్ దూహాన్ సింగ్)తో పడుతుంది. అప్పటి దాగా సాదాగా తీసుకున్న రాజు బాక్సింగ్ లైఫ్ సీరియస్ గా మారుతుంది. అదే టైంలో అన్ని రోజులు సపోర్ట్ చేసిన పూజిత అండ్ ఫ్రెండ్స్ కూడా రాజుని వదిలి వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుంచి కథ ఎలా ముందుకు సాగింది? ఫైనల్స్ లో రాజు గెలిచాడా? లేదా? పూజిత అండ్ ఫ్రెండ్స్ ఏ కారణంగా రాజుని వెతుక్కొని వచ్చి మరీ కిక్ బాక్సర్ ని చేసారు? ఏ కారణం చేత వదిలేసి వెళ్ళిపోయారు అనే? సమాధానాలను మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల్లో సినిమాకి హెల్ప్ అయ్యింది, అలాగే కొన్ని కొన్నియాంగిల్స్ లో నెగటివ్ అయ్యేలా అనిపించేది కూడా హీరోనే, అనగా నార రోహిత్ అనమాట.. నారా రోహిత్ తన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, పాత్రకి కావాల్సిన మానరిజమ్స్ పరంగా బెస్ట్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఎక్స్ ప్రెషన్స్ పరంగా ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండాడ్ కి వచ్చే సరికి అవే ఎక్స్ ప్రెషన్స్ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇక లుక్ పరంగా అయితే నారా రోహిత్ బాగా లావుగా బొద్దుగా కనిపిస్తున్నాడు. దాని వలన కొన్ని సీన్స్ లో కావాల్సిన ఇంపాక్ట్ రాలేదు. ముందు ముందు అతను స్లిమ్ అయితేనే తనకు హెల్ప్ అవుతుంది. లతా హెగ్డేకి సినిమాలో చాలా చిన్న పాత్ర. అందుకే తన లవ్ ట్రాక్ పరంగా మాత్రం బాగా చేసింది. అంతకు మించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇక నారా రోహిత్ చుట్టూ ఉండే బాచ్ లో వెన్నెల కిషోర్, పూజిత బాగా చేసారు. అంతే కాకుండా తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. ఇక మీనన్ విలన్ గా చేసిన కబీర్ సింగ్ పాత్రని ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే కాస్త తగ్గించారు. అందుకే ఆ పాత్ర అంత ఎఫ్ఫెక్టివ్ గా లేదు. కానీ ఉన్నంతలో కబీర్ బాగా చేసాడు. అతిధి పాత్రల్లో కనిపించినా సినిమాలో బెస్ట్ నవ్వులు పూయించింది మాత్రం అలీ, శకలక శంకర్ లే అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. మిగిలిన నటీనటులు ఓకే ఓకే అనిపించారు.   

ఈ మధ్య కాలంలో తెలుగులోని యంగ్ డైరెక్టర్స్ తెలుగు ప్రేక్షకులకు కొత్త కథలను అందించాలని ట్రై చేస్తున్నారు. అలాగే కొంతమంది ఇంకాస్త ముందుకెళ్ళి కథ కోసం ఎక్కువ టైం తీసుకోకుండా సరికొత్తగా అనిపించే రీమేక్ లని సెలక్ట్ చేసుకుంటున్నారు. అందులో వీరు కథ చెప్పేటప్పుడు, లేదా పేపర్ మీద రాసుకునేటప్పుడు బాగా రాసుకుంటున్నారు. కానీ ఫైనల్ అవుట్ పుట్ ఇచ్చేప్పుడు మాత్రం యావరేజ్ ఇస్తున్నారు. అలాంటి జాబితాలో చేరిపోయే సినిమానే నేడు రిలీజైన 'తుంటరి'. ఎందుకంటే ఇదొక తమిళ హిట్ సినిమా(మాన్ కరాటే)కి రీమేక్. కథ పరంగా బాగున్నా తెరపైకి వచ్చేసరికి తేలిపోయింది. 2 గంటల సినిమానే అయినా తెలుగు వెర్షన్ స్క్రీన్ ప్లే వలన సినిమా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది.


ముందుగా తెలుగు వెర్షన్ గురించి మాట్లాడి తర్వాత మిస్టేక్స్ కోసం తమిళ వెర్షన్ తో పోలుస్తా.. తుంటరి సినిమా స్టార్టింగ్ ఆస్కతికరంగానే మొదలవుతుంది.. ఆ తర్వాత రెగ్యులర్ ఆడియన్స్ కోరుకునేలా కామెడీ, లవ్ ట్రాక్, సాంగ్స్ తో నడిపించాడు. నారా రోహిత్ ఎప్పుడు కబీర్ సింగ్ తో ఢీ కొట్టాలి అనే అనౌన్స్ మెంట్ వస్తుందో అప్పుడే కథలో ఊపోస్తుంది. ఇక ఎదో జరుగుతుంది అనుకున్న టైంలో ఇంటర్వల్. అందరూ సెకండాఫ్ ఎదో ఉంటుందని ఆశిస్తారు. కానీ ఇంటర్వెల్ తర్వాత సినిమా బాగా స్లో అయిపోతుంది. బలవంతంగా ఇరికించిన కామెడీ సీన్స్, సాంగ్స్, రొమాంటిక్ ట్రాక్ మరియు అస్సలు వర్కౌట్ కాని ఎమోషనల్ సీన్స్ చిరాకు పెట్టేస్తాయి. మెయిన్ గా చివరి 40 నిమిషాలని తీగ తెగాల్సిందే అన్నట్టు సాగదీసి సాగదీసి వదిలారు. ఎమోషనల్ క్లైమాక్స్ అస్సలు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. అన్నిటికంటే మించి చివర్లో నారా రోహిత్ తన పాత్రకి జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయాడు. డైరెక్టర్ సక్సెస్ఫుల్ అయిన కథ కదా అని చాలా సింపుల్ గా తీస్కొని ఈ సినిమా చేసాడు. అందుకే ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. కొన్ని సీన్స్ ని రీ షూట్ కూడా చేయకుండా ఒరిజినల్ వెర్షన్ లోవి యాజిటీజ్ గా వాడుకోవడం అంతగా సెట్ అవ్వలేదు.


ఇక మిగతా టెక్నికల్ టీం ఎలాంటి అవుట్ పుట్ ఇచ్చారు అనే విషయానికి వస్తే.. పలని కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. తనకి ఇచ్చిన లోకల్ ఏరియాస్ ని విజువల్స్ పరంగా బాగా చూపించాడు. కలర్ఫుల్ విజువల్స్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయి. సాయి కార్తీక్ కంపిజ్ చేసిన ఆల్బంలో రేను పాటలు వినడానికి బాగున్నాయి. వాటితో పాటు మిగతా వాటిని పిక్చరైజేషన్ పరంగా బాగానే తీసినప్పటికీ సినిమా ఫ్లోని మాత్రం చెడగొట్టాయి. అనగా సినిమాకి ఇన్ని పాటలు అవసరం లేదనమాట. ఇక నేపధ్య సంగీతం బాగుంది. కెవ్వు కేక అనలేం కానీ సినిమాకి తగ్గట్టుగా ఉంది. మురళి కొండేటి ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉంది. వెంకట్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇక తమ్మి రాజు ఎడిటింగ్ చెప్పుకోతగ్గ స్థాయిలో లేదు. ఫస్ట్ హాఫ్ పరంగా పరవాలేదు అనిపించినా సెకండాఫ్ మాత్రం బోర్ కొట్టించేసాడు. శ్రీ కీర్తి ఫిల్మ్స్ నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.


తమిళంలో సూపర్ హిట్ అయిన కథ ఉంది, అందులోనూ అన్ని భాషల్లోనూ సక్సెస్ అవుతున్న కామెడీ ఇందులో ఉంది.. ఇంకేముంది తెలుగులో కూడా హిట్టే అన్న బ్లైండ్ ఫార్మాట్ లో డైరెక్టర్ కుమార్ నాగేంద్ర ఈ సినిమా చేసినట్టు ఉన్నాడు. ఎందుకంటే ఆయన కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. యాజిటీజ్ గా ట్రై చేసాడు కనీసం మనకు సెట్ అయ్యేలా ఎమోషన్స్ అన్నా మార్చివుండాల్సింది. ఇలా ఏం చేయకపోవడంతో సగం ఉడికిన బిర్యానిలో ఉన్న చికెన్ ముక్కలా సప్పగా తయారైంది. సినిమాలో భీభత్సంగా ఎంజాయ్ చేసే మొమెంట్స్ లేవు. కానీ తల పట్టుకొనే బోరింగ్ సీన్స్ మాత్రం ఉన్నాయి. ఒరిజినల్ వెర్షన్ అయిన మాన్ కరాటే చూసిన వారైతే ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఈ వీకెండ్ టైం పాస్ కాక, ఇక సినిమా తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ లేదు అనుకున్నప్పుడు మీరు కొన్ని బరించేద్దాం అనుకొని ఈ సినిమాకి వెల్లచ్చు.

Nara Rohit,Latha Hegde,Kumar Nagendra,Ashok Baba,Nagarjuna,Sai Karthikతుంటరి - అల్లరి ఉన్నా ఎమోషన్ లేని 'తుంటరి'.

మరింత సమాచారం తెలుసుకోండి: