6:00am: గుడ్ మార్నింగ్      
6:00am: ‘నాయక్’ మూవీ ట్వీట్ రివ్యూ  
6:05am: ఎపిహెరాల్డ్ ట్వీట్ రివ్యూ ‘వీక్షకులకు’ స్వాగతం…                                        
6:25am: మొదటిభాగం ప్రారంభమైంది  
6:40am:  ‘వినాయక్’ స్టైల్ లో ‘నాయక్’  టైటిల్స్ వస్తున్నాయి.
6:45am: సినిమా కలకత్తాలో రిచ్ గా ప్రారంభమైంది.
6:50am: డైలాగ్:  ‘‘కలకత్తా ను కాపాడాటానికి ఆ కాళీమాత ఉంది. మనల్ని కాపాడాటానికి మా నాయకుడు ఉన్నాడు.’’ 
6:55am:  థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ కలిసి... మెగా అభిమానులు కోరుకున్నదానికంటే భిన్నంగా ఉంది.
7:00am:  ‘‘నాజోలికి వస్తే సహిస్తా... నావాళ్ళ జోలికివస్తే చంపేస్తా’’ రామ్ చరణ్ ఫస్ట్ డైలాగ్ పవర్  చాలా బాగుంది.    
7:05am: ఆశీష్ విధ్యార్థి పోలీస్ ఆఫీషర్ గా బాగున్నాడు, ప్రదీప్ రావత్ పరిచయ సన్నివేశం బాగుంది.
7:10am: ‘‘లైలా ఓ లైలా’’ సాంగ్ వచ్చింది. పాటలో లో చెర్రీ ని గతంలో ఎప్పుడు చూడని విధంగా,  డ్యాన్స్, మూమెంట్స్ తో ఫ్యాన్స్ విజిల్స్ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నాయి.              
7:15am: చెర్రి కి బ్యాచలర్ అంకుల్ గా ‘బ్రహ్మి’  హాస్యన్ని పండిస్తున్నాడు.         
7:20am:  బ్రహ్మానందం చిన్నప్పటి ఫోటో మ్యారెజ్ ఎంగెజ్ మెంట్  కోసం చూపిస్తున్నారు.        
7:22am: ‘కాజల్’ ఎంట్రీ నార్మల్ గా ఉంది. కానీ బ్రహ్మానందం, రామ్ చరణ్ చేస్తున్న హాస్యం ప్రేక్షకులను అలరింపచేస్తుంది.
7:25am:  చిత్రంలో ‘జిలేబి’ [బ్రహ్మానందం], ‘చెర్రి’ [రామచరణ్] పేర్లు చాలా ఫన్నీగా ఉన్నాయి.
7:28am: చిత్రంలో  సిరియస్- హాస్య సన్నివేశాలు మిక్సింగ్ చేయడం బాగుంది.
7:30am: ఒక చిన్నపిల్లాడ్ని హ్యకింగ్ చేసి ఒక బిక్షగాడిగా చూపించే సన్నివేశాలు అందరి హృదయాల్నికదిలించే విధంగా ఉంటాయి
                     
7:35am: మరో విలన్ ఎంట్రీ ఇచ్చాడు,  ఇంతవరకు నలుగుర్ని విలన్లను చూసాం. అందుకే వి.వి.వినాయక్  పెద్ద డైరెక్టర్ గా అనుకుంటారేమో అనిపిస్తుంది.
7:40am:  చోటా కె.నాయుడు కెమెరా పనితీరు బాగుంది,  స్పెషల్ గా ఫ్లైట్ సీన్స్ బాగున్నాయి.
7:44am:  చెర్రి మూడు విషయాల గురించి పాత్రికేయులకు వివరిస్తున్నాడు. అందులో భాగంగా ప్రత్యేకంగా యాచకుల గూర్చి విరిస్తున్నాడు.                  
7:49am: బ్రహ్మి మంచి డ్యాన్స్ షో మెన్ గా అందర్నీ ఆశ్చర్య పరిచాడు.
7:54am: ‘ఒక చూపుకే పడిపోయా’’ పాట మంచి లోకేషన్స్ లో చెర్రి, కాజల్ కెమిష్ట్రి బాగుంది, కానీ కాజల్ కు ‘మగధీర’ లో ఉన్నంత ఫీల్ ఇందులోలేదు.
7:57am: ‘‘వాడు  ఈ దారిలో వరి పండించే రకం’’ అనే డైలాగ్  జయప్రకాష్ రెడ్డి నటన హాస్యంగా ఉంది.                   
7:59am:   బ్రహ్మి తినే తిండి  ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదనిస్తుంది.      
8:01am:  డైలాగ్ : ‘‘ నువ్వు డాక్టర్ వా... లాయర్ వా... ప్రశ్నలేస్తావేరా... ప్రాణం పోతుంటే...’’         
8:05am:    ఎం.ఎస్.నారాయణ పరిచయం ఒక తెలివైనా వాడుగా, డ్రింకింగ్ హ్యాబిట్ పైన డైలాగ్ ఫన్నీగా ఉంది.                
8:11am:   ‘‘వైన్ షాపుకి ఫ్రెండ్స్ తో వెళ్ళాలి’’ ‘అరెస్ట్ కి సింగిల్ గా వెళ్ళాలి’ డైలాగ్ హాస్యాన్నిపండిస్తుంది.
8:14am:  సీబీఐ మీద ఒక సన్నివేశం మన రాష్ట్ర్రంలోని బాగా తెలిసిన పొలిటికల్ పార్టీ పైన సెటైర్.          
8:17am: ఇప్పటి వరకు సినిమా ఇంటిరీయర్ లో జరింగింది
8:20am:డైలాగ్:  ‘‘కరెంట్ షాక్ కొ్ట్టిందని ట్రాన్స్ ఫార్మర్ తో పెట్టుకుంటామా సార్’’?            
8:24am: ‘‘ఓ మై గాళ్’’ పాట  ఊహించనంతగా  లేదు, కానీ చెర్రి ఫిజిక్ బాగుంది, కానీ హేర్ స్టైల్, ఫేస్ లుక్ అంతగా ఆకట్టుకోలేదు.            
8:29am: కాజల్ పిలక జడతో ప్రేక్షకుల్ని డిస్సాపాయింట్ చేసింది.           
8:32am:  కుంభమేళా సీన్ బాగుంది, చాలా గొప్పగా చర్రి మరోపాత్ర ఎంట్రీ.
8:38am: డైరెక్టర్ వినాయక్ మరో మంచి సినిమా...  మూవీ ఇంటర్వెల్ కు వచ్చింది, కానీ స్టోరి లైన్ ఏంటోనని తెలికుండావుంది. కానీ సినిమాలోని డ్యాన్స్, యాక్సన్, కామెడీ లతో ప్రేక్షకుల్ని అలరింపచేస్తుంది.                                                                          
విశ్రాంతి:        
8:43am:    సినిమా ముఖ్యంగా రాంచరణ్ చుట్టూ తిరగకుండా కథ మీదే బేసైవుంది. అయినా సరే హీరోయిజం మంచిగా ఉంది. వి.వి.వినాక్ ను  డైరెక్టర్లలో ఒక  గొప్ప డైరెక్టర్ అని  అన్నటువంటి మాటలు ఈ సినిమాతో గుర్తుకువస్తాయి.                         
8:44am:డైలాగ్ :  ‘‘సన్ రైస్, సన్ సెట్ ఒకే లాగున్నా టెంపరేచర్ లో తేడావుంటుంది.’’   డైలాగ్ బాగుంది.           
8:47am:  మరో విలన్ ‘‘దేవ్ గిల్’’ పరిచయంతో ప్లాష్ బ్యాక్ లో రాంచరణ్ మరోపాత్రలో   సిద్దూగా [రాంచరణ్] పరిచయం.    
8:50am:  హీరోయిన్ ‘అమలాపాల్’ పరిచయం బాత్ రూం లో ఎంట్రీ ఇచ్చింది. రాజీవ్ కనకాల సిద్దుకు బావగా నటన బాగుంది.
9:00am:  పోసాని కామెడీ అతని స్టైల్ లో వుంది. విలన్ గా కోటశ్రీనివాస్ రావు ఇతర విలన్స్ తో పరిచయం అవుతున్నాడు.                                    
9:04am:  వేణుమాదవ్ సెకండ్ ఆఫ్ కామెడీ సీన్ భాద్యతలు తీసుకున్నా,  కానీ అంతగా మెప్పించలేకపోతున్నాడు.                        
9:05am: ‘‘లివర్ పాడై పోతే అపోలో హస్పటల్ లో మార్పించుకుంటా....? కానీ, లవర్ పోతే..?  అనే డైలాగ్ బాగుంది.      
9:08am: ‘‘శుభలేఖ’’ సాంగ్ వస్తుంది, రాంచరణ్ మూమెంట్స్ బాగున్నాయి. కానీ అమలాపాల్ అంతగా మెప్పించలేకపోతుంది.        
9:15am: ఎమోషనల్ బ్యాగ్రౌండ్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.      
9:17am: యాక్షన్ బ్లాక్స్ రామ్ చరణ్ అభిమానులను మెప్పించే విధంగా ఉన్నాయి. కానీ ప్యామిలిస్ కి మాత్రం  కొంచెం ఓవర్ అన్పిస్తుంది.            
9:20am: సిద్దార్థ్ [రామ్ చరణ్] నాయక్ ‘నాయక్’ గా మారుతాడు. ఈ సీన్ బాగుంది.
9:25am:  చిత్రంలోని సెంట్ మెంట్ సన్నివేశాలు హృదయానికి దగ్గరయ్యేలా ఉన్నాయి, కానీ చూడటానికి నమ్మేవిధంగా లేవు.                              
9:28am:  సురేఖ నటన కష్టమైన్ సీన్స్ లోకూడా ఎమోషనల్ గా తన నటన బాగుందనిపిస్తుంది.       
9:29am: ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చీకటిలో చిత్రికరించారు. అందువల్ల ఈ సినిమాను థియేటర్ లోనే చూస్తే బాగుంటుంది. ఫైరసీలో చూస్తే సినిమా అంతగా మంచిగా అనిపించదు.
9:30am: ప్రదీప్ రావత్ యాక్షన్ లో ఫేయిల్యూర్ అయ్యాడనిపిస్తుంది, కానీ సిద్దార్థ్ నాయక్ సీరియస్ యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
9:35am: వినాయక్ ఆలోచన విధానం ప్రేక్షకులందర్నీ మరోసారి ఆకట్టుకుంటుంది. పోసాని నటన కూడా బాగుంది
9:40am: ‘‘యవ్వారమంటే ఏలూరే’’ పాట మ్యూజిక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. లిరిక్స్, డీసెంట్ విజ్వల్స్ బాగున్నాయి.  ఈ సాంగ్ తిరనాళ్ళ లో సాగుతుంది. రామ్ చరణ్ ఐటమ్ సాంగ్ లో చేసిన డ్యాన్స్ బాగుంది.
9:45am: కథలో ఆకట్టుకునే మలుపులకు తోడు అలరించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను రంజిపచేస్తాయి.
9:47am: చెర్రి, బ్రహ్మానందం ప్రతి సన్నివేశంలో కనపిస్తూ అలరిస్తున్నారు.                                                                                     
9:48am:  ఠాగూర్ సినిమాను తలపించే సన్నివేశాలతో కథ ముగింపు వైపుకు సాగుతున్నప్పటికీ ఠాగూర్ సినిమాలో చూపినంత హృదయాన్ని హత్తుకునే విధంగా ఉండకపోవచ్చు.        
9:52am:  జయప్రకాష్ రెడ్డి ఇతర హాస్య నటుల నటన చాలా హాస్యభరితంగా ఉంటుంది.  
9:57am: రామ్ చరణ్ రెండు పాత్రల్లో భేదమేమి కనిపించలేదు.      
9:59am: క్లైమాక్స్ బిగినింగ్ లో బాగానే వుంది. తర్వాత ఒక నాటకంలా సాగింది.

Nayak: Tweet Review || English Full Review || తెలుగు ఫుల్ రివ్యూ

 

Nayak Review: Cast & Crew






 

More Articles on Nayak || Nayak Wallpapers || Nayak Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: