సూర్య ,ఏ.ఆర్.రెహమాన్ ,సినిమాటోగ్రఫీ ,స్క్రీన్ ప్లేసూర్య ,ఏ.ఆర్.రెహమాన్ ,సినిమాటోగ్రఫీ ,స్క్రీన్ ప్లేహాలీవుడ్ సినిమాల్ల కాపీయింగ్ ,ఎడిటింగ్

ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అయిన సూర్య 24 ట్రైలర్ లో చూపించిన అద్భుతాన్ని సినిమాలో చూపించింది. సూర్య మని, సెతురామన్, ఆత్రేయ రోల్స్ లో చేశాడు. కవలలుగా పుట్టిన సూర్యలలో ఒకరు సైంటిస్ట్ మరొకరు డాన్ గా మారుతారు. ఇక సైంటిస్ట్ సూర్య టైం కంట్రోల్ చేసే వాచ్ ను కనిపెడతాడు. ఆ వాచ్ కోసం సైంటిస్ట్ భార్యను చంపుతాడు విలన్ సూర్య. పిల్లాడిని తీసుకుని పారుపోతుండగా సైంటిస్ట్ ను కూడా చంపుతాడు. అయితే ఆ పిల్లాడిని ట్రైన్ లో వేరే వారికి అప్పగిస్తాడు సైంటిస్ట్ సూర్య. ఇక ఆ చిన్న పిల్లాడు ఓ వాచ్ రిపేర్ గా తయారవుతాడు.. అయితే తన దగ్గర ఉన్న వాచ్ రహస్యాన్ని కనిపెట్టిన సూర్య ఆ వాచ్ తో హీరోయిన్ సమంతతో రొమాన్స్ చేసేందుకు ఉపయోగిస్తాడు.. విలన్ సూర్య కు ఆ వాచ్ దొరికిందా..? సైంటిస్ట్ సూర్య ఏ ప్రయోజనాలకు ఆ వాచ్ ను కనిపెట్టాడు..? యంగ్ సూర్య వాచ్ విశిష్టను తెలుసుకొని ఏం చేశాడు..? అన్నది అసలు కథ.

సూర్య మూడు విభిన్న పాత్రలో అద్భుతంగా నటించాడని చెప్పాలి. ఇక 24 ఆడియో రిలీజ్ అప్పుడే చెప్పాడు తను చేసే చెత్త సినిమాలు ఎంకరేజ్ చేయొద్దు.. అలానే మంచి సినిమాలను మిస్ చేయొద్దు అని.. అన్నట్టుగానే మరో అద్భుత దృశ్య కావ్యంగా ఈ సినిమాను హాలీవుడ్ ఫీచర్స్ తో తెరకెక్కించాడు. మూడు పాత్రల్లో సూర్య ఒకదాని మీద మరొకటి పోటీగా నటించాడని చెప్పాలి. మూడు పాత్రల్లో సూర్య గొప్ప వేరియేషన్స్ ను చూపించాడు. ఇక హీరోయిన్ గా నటించిన సమంత, నిత్యా మీనన్ లు కూడా పాత్రల పరిధి మేరకు నటించారు. సమంత గ్లామర్ షో సినిమాకు అదనపు ఆకర్షణగా ఉంటుంది. శరణ్య పొన్వన్నన్ తల్లి పాత్రలో తన సహజ నటనతో ఆకట్టుకుంది.  

24 సినిమా స్క్రీన్ మీద అంత అందంగా కనబడానికి టెక్నికల్ టీం తమ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారని చెప్పాలి. ముఖ్యంగా సినిమా సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ అందించిన సంగీతం సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్తుంది. ఇక సినిమాలో మరో ముఖ్య పాత్ర పోశించింది కెమెరా మెన్ తిరు. బాలీవుడ్ లో బిజీ సినిమాటోగ్రాఫర్ గా ఉన్న తిరు మొదటిసారి 24 సినిమాతో సౌత్ సినిమాకు పనిచేశాడు. 24 లో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా అద్భుతం అని చెప్పాలి. కళ్ల ముందు వేరే లోకం కనిపించేంతలా ఉంది వారి పనితనం. ప్రవీన్ పూడి ఎడిటింగ్ కూడా ఓకే.. అయితే సినిమా కాస్త నిడివి తక్కువ ఉంటే బాగుండేది.. 164 నిమిషాలు ఉన్నా సరే సినిమా ఆద్యంతం సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఈ సినిమా టోటల్ క్రెడిట్ దర్శకుడు విక్రం కుమార్ కే చెందుతుంది. తెర మీద సూర్య ఎలా విజృంభించాడో తెర వెనుక విక్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. సూర్య సినిమా కోసం పెట్టిన ప్రతి రూపాయి సినిమాను రిచ్ గా చూపించడంలో సహకరించిం

విక్రం కుమార్ మరోసారి తన మ్యాజిక్ ను చూపించాడు. 24 అంటూ టైటిల్ పెట్టిన నాటి నుండి ఇంట్రెస్ట్ ను క్రియెట్ చేసిన విక్రం కుమార్ దాన్ని తెర మీద ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశాడన్నది సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఇక సర్ ప్రైజెస్ అయితే సినిమాలో చాలానే ప్లాన్ చేశాడు. ముఖ్యంగా ఇంటర్వల్ సీన్ లో ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అవ్వక తప్పదు. అయితే ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది. అక్కడక్కడ సినిమా కొన్ని హాలీవుడ్ సినిమాల వాసన తగులుతుంది. కాని కోలీవుడ్లోనే కాదు సౌత్ లోనే ఇలాంటి అటెంప్ట్ తో తన గట్స్ చూపించాడు సూర్య. 



Vikram Kumar,Suriya Samantha Ruth Prabhu,Nithya Menen,A. R. Rahman'24' సూర్య వెండితెర విశ్వరూపం..

మరింత సమాచారం తెలుసుకోండి: