Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 3:51 am IST

Menu &Sections

Search

పెన్సిల్ రివ్యూ

- 1.75/5
పెన్సిల్ రివ్యూ READ THIS MOVIE REVIEW IN ENGLISH

మంచి

  • మ్యూజిక్
  • శ్రీ దివ్య
  • క్లైమాక్స్ సీన్స్

చెడు

  • స్లో నేరేషన్
  • మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
ఒక్క మాటలో: జి.వి.ప్రకాశ్ పెన్సిల్ ఇంకాస్త చెక్కి ఉంటే బాగుండేది..!

చిత్ర కథ

శివ (జి.వి.ప్రకాశ్) ఓ బ్రిలియెంట్ స్టూడెంట్ ట్వెల్త్ స్టాండర్డ్ చదువుతున్న శివకు అదే క్లాస్ చదువుతున్న మాయ (శ్రీ దివ్య) అంటే చాలా ఇష్టం. ఆమెను ఎప్పటినుండో ప్రేమిస్తూ ఆరాధిస్తాడు శివ. మాయ ఓ పోలీస్ కమిషనర్ కూతురు కాబట్టి ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఇక అదే క్లాస్ ఓ స్టార్ హీరో కొడుకు నితిన్ (షరిక్ హాసన్) క్లాస్ లో అందరిని తన కంట్రోల్ లో పెట్టుకోవాలని చూస్తుంటాడు. అంతేకాదు అమ్మాయిలను కూడా మోసం చేస్తూ వారిని బ్లాక్ మేల్ చేస్తూ ఉంటాడు. ఇక అతను చేసే పనులన్ని ప్రిన్సిపాల్ కు తెలిసినా సూపర్ స్టార్ కొడుకు అవడం చేత అతన్ని మందలించి వదిలేస్తారే తప్ప అతన్ని శిక్షించరు. వి.ఆర్.ఎస్ స్కూల్స్ కు ఐ.ఎస్.ఓ సర్టిఫికేషన్ కోసం ఇన్స్పెక్షన్ జరుగుతుంటుంది. ఆ సమయంలోనే నితిన్ హత్య చేయబడతాడు. అసలు నితిన్ ను చంపింది ఎవరు..?  శివ నిత్యల గొడవలకు కారణం ఏమిటి..? నితిన్ మర్డర్ మిస్టరీలో మాయ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది..? అన్నది అసలు కథ.  

నటీనటుల ప్రతిభ

పెన్సిల్ అంటూ ఓ సాఫ్ట్ టైటిల్ తో వచ్చిన జి.వి.ప్రకాశ్ తన పాత్ర వరకు ఓకే అనిపించుకున్నాడు. అయితే కొన్ని చోట్ల హీరో కంటే హీరోయిన్ శ్రీ దివ్య ఎక్కువ మార్కులు కొట్టేసిందని అనాలి. మాయగా ఇన్వెస్టిగేట్ చేసే పాత్రలో అదరగొట్టేసింది శ్రీ దివ్య. సినిమాలో హీరో శ్రీ దివ్యనే అన్న ఫీల్ కలుగక తప్పదు. ఇక మిగతా నటులంతా ఓకే అనిపించుకున్నారు. అయితే నితిన్ గా నటించిన షరిక్ హాసన్ తొలి సినిమానే అయినా మంచి నటన కనబరిచాడు. ఇక స్కూల్ ఇన్స్పెక్షన్ చేసే హయ్యెర్ ఆఫీసర్ గా ఊర్వశి కొద్దిసేపు నవ్వులు పంచే ప్రయత్నం చేసింది. స్కూల్ ప్రిన్సిపాల్ గా నటించిన టి.పి.గజేంద్ర తన మార్క్ కామెడీ చేసి అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు

పెన్సిల్ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యంగా దర్శకుడు మణి నాగరాజ్ గురించి చెప్పాలి. కార్పోరేట్ స్కూల్ లో జరుగుతున్న అన్యాయాలను చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు ఓ మర్డర్ మిస్టరీని ఎంచుకున్నాడు. అయితే సెకండ్ హాఫ్ లో నితిన్ ను ఎవరు మర్డర్ చేశారు అన్న కంఫ్యూజన్ మెయింటైన్ చేసినా సినిమాలో కామెడీ లేక పోవడం చాలా పెద్ద మైనస్. ఇక సినిమాటోగ్రఫీ గోపి అమర్ నాథ్ ఓకే అనిపించుకున్నాడు. పాటల్లో తప్పించి మొత్తం స్కూల్ లోనే సినిమా మొత్తం ఉండటంతో ఆయన పనితనం ఎక్కువగా కనబడలేదని చెప్పాలి. ఇక ఆంథోని ఎడిటర్ పర్వాలేదు. సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో ఎడిటర్, దర్శకుడి సహకారం బాగానే అందిందని చెప్పాలి. ఇక సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా జి.వి.ప్రకాశ్ మంచి కంపోజింగ్ చేశాడు. పాటల వరకు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఇక ఎస్.పి రాఘవేష్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే సినిమా మొత్తం ఓ స్కూల్ కాంపస్ లోనే కానిచ్చేయడం విశేషం.

చిత్ర విశ్లేషణ

ఓ మర్డర్ మిస్టరీతో కథ రాసుకుని దానికి స్కూల్ బ్యాడ్ డ్రాప్త్ తో అల్లుకున్న కథనే ఈ పెన్సిల్ సినిమా. స్కూల్ లో గుడ్ బ్యాడ్ బాయ్స్ ఉంటారు. ఎవరు చేసే పనులు వారు చేస్తుంటారు అని చెప్పే సందర్భంలో గాడి తప్పిన విధ్యార్ధి జీవితం ఓ మాస్టారు చేతిలోనే అంతం అవుతుంది అని ఈ పెన్సిల్ సినిమా ద్వారా చెప్పాడు దర్శకుడు. అయితే సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో సినిమా ఎంటర్టైన్మెంట్ శాతం మిస్ చేశాడు దర్శకుడు మణి నాగరాజ్.   


ఇక సినిమా హీరోగా చేసిన శివ అదే జి.వి.ప్రకాశ్ కన్నా హీరోయిన్ గా చేసిన శ్రీ దివ్య ఎక్కువ స్కోప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. తను మర్డర్ మిస్టరీ కనిపెట్టేలా చెప్పే క్లూలు సూపర్ గా ఉంటాయి. ఇక నితిన్ చంపేసింది ఎవరు అని కనిపెట్టే విధానంలో నడిపించే స్క్రీన్ ప్లే ఓకే అనిపిస్తుంది. అంతేకాదు ఫైనల్ గా తన పాపను చంపినందుకే నితిన్ లాంటి దుర్మార్గుడిని చంపానని ఆ స్కూల్ టీచర్ అభిషేక్ శంకర్ చెప్పడం కథ సుఖాంతం అవుతుంది. అంతేకాదు ఈ క్రమంలో కార్పోరేట్ స్కూల్స్ మీద దర్శకుడు మణి నాగరాజ్ తన పగ తీర్చుకున్నాడని తెలుస్తుంది. విద్యను వ్యాపారం చేయొద్దు సేవ చేయండి అని చెప్పే సందేశం అందరికి నచ్చుతుంది.   


తాను అనుకున్న అసలు పాయింట్ ఇదని సినిమా పూర్తయ్యే నిమిషం తెలుస్తుంది. అయితే ఇక తెలుగులో ఈ సినిమా అంతగా ఆకట్టుకునే అవకాశం లేదు.. జి.వి.ప్రకాశ్ మ్యూజిక్ డైరక్టర్ గా మనకు తెలిసినా హీరోగా కొత్తే. మొన్నామధ్య త్రిషా లేదా నయనతార సినిమాతో వచ్చినా అంతగా లాభం లేకుండా పోయింది. అయితే ఈ పెన్సిల్ తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది అని చెప్పిన ప్రకాశ్. సినిమాను తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా అందించడంలో విఫలమయ్యాడు. ఇక తమిళ్ లో కూడా ఇది అంతగా ప్రభావితం చూపిస్తుందా అన్నది కూడా డౌటే.  


కాస్ట్ అండ్ క్రూ

5 / 5 - 1
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Bollywood

View all