కాస్తో కూస్తో కామెడీకాస్తో కూస్తో కామెడీమిగిలినవన్ని

ఆది (తరుణ్ శెట్టి) ఎప్పుడూ జాలీగా చైల్డిష్ మెంటాలిటీతో ఉంటాడు. తనకు నచ్చిన పని చేసుకుంటూ పోయే ఆదికి ప్రియ (అవంతిక మిశ్ర) ప్రపోజ్ చేస్తుంది. అయితే ఆది మంచివాడనే ఆలోచనతో ప్రపోజ్ చేసిన ప్రియకు తన అసలు అలవాట్లన్ని చెప్పి ఇంప్రెషన్ కొట్టేస్తాడు. ప్రియ ఆదిని డీప్ గా లవ్ చేస్తుంది. ఇక ఆది ఫ్రెండ్ కిరీటి (దామరాజు) ఆది వాళ్లు ఉంటున్న పెంట్ హౌజ్ లోనే ఉంటారు. ఆది, ప్రియలు కలిసిన కొద్దిరోజులు హ్యాపీగానే ఉంటారు.. కాని చిన్నగా ప్రియ చేసే పనులకు ఆదికి ఇరిటేషన్ కలుగుతుంది. తనతో ఉండాలంటే.. మాట్లాడాలంటే అదో పనిలా చేస్తాడు తప్ప ప్రేమ ఉండదు.. ఆ విషయం తెలుసుకున్న ప్రియ ఆదికి లైఫ్ లో ప్రేమకు అర్ధం తెలిసినప్పుడు తన కోసం రమ్మని చెబుతుంది. మరి ఆది నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసిందా..? ఆది, ప్రియల లవ్ స్టోరీ ఏమైంది..? ఆది చివరకు ప్రియ మనసు గెలుచుకున్నాడా..? అన్నది అసలు కథ.

ఆదిగా చేసిన తరుణ్ శెట్టి అల్లరి చిల్లర కుర్రాడిలా మంచి నటన కనబరిచాడు. ఇక ప్రియగా చేసిన అవంతిక సినిమా మొత్తం తన నిజమైన ప్రేమను వెతుకుతూ బాగా నటించింది. కిరీటి గా చేసిన దామరాజు మంచి కామెడీ పండిచాడు. ఇక మిగతా పాత్రలన్ని చేసినంత ఏదో అలా చేశేసారు. 



సినిమా టెక్నికల్ డిపార్ట్ మెంట్ గురించి మాట్లాడితే దర్శకుడు హుస్సెన్ షా కిరణ్ కథగా రాసుకున్నది బాగున్నా దాన్ని తెర మీద చిత్రీకరించడంలో విఫలమయ్యాడు. శ్రవణ్ సంగీతం యావరేజ్ గా ఉంది. థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత పాటలు గుర్తుండే ఛాన్స్ లేదు. సినిమా కెమెరా వర్క్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఇక ఎన్.పి.జి స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు కావాల్సినంత రిచ్ గానే ఉన్నాయి. 



ప్రేమంటే తెలియని ఓ అబ్బాయి లైఫ్ లో ప్రేమ మీద మంచి ఆలోచన ఉన్న అమ్మాయి ప్రేమ ఎలా ఉంటుందో ఈ సినిమా కథ అది. అయితే దర్శకుడు హీరోని చూపించిన విధానం అంతా గందరగోళంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే అసలు వర్క్ అవుట్ అవలేదని అనుకోవచ్చు. నాన్నకు ప్రేమతో సినిమాకు కథ అందించిన రచయిత నుండి ఇలాంటి సినిమా వస్తుంది అని ఎవరు ఊహించరు. నటీనటులంతా కొత్త వారే అయినా తల తోకా లేకుండా వచ్చిన సీన్లే వచ్చి ఆడియెన్స్ కు బోర్ కొట్టిస్తాయి.   


సినిమాలో కామెడీ ప్రయత్నించినా అది కూడా అంతంత మాత్రంగానే ఉంది. హీరో ఎన్ని సార్లు తప్పు చేసినా హీరోయిన్ క్షమించడం అసలు ఆమె అతనిలో ఏం చూసి అంత కమిట్ మెంట్ అవుతుందో అన్నది అర్ధం కాదు. ఇక చివరిలో కూడా హీరో వచ్చి ప్రేమకు మీనింగ్ అంటే ఇది అని వచ్చి చెప్పగానే వచ్చి కౌగిలించుకుంటుంది. అయితే ఆమె అతన్ని ఇష్టపడే కారణాలు ముందే చెప్పినా అవేవి నిజం కాదని తెలిసినా ఎందుకు అతనంటే అంత ఇష్టమన్నది తెలియలేదు.  కొత్త వారితో కొత్త ప్రయత్నం చేద్దామనుకుని చేసిన దర్శకుడి ఆశ ప్రయాసగానే మిగిలింది. సినిమా పతాక సన్నివేశాల్లో ప్రేక్షకుల సహనాన్ని పరిక్షపెడుతుంది. ఓవరాల్ గా మాకు నచ్చింది మేము తీస్తాం మీకు నచ్చితే చూడండి అన్నట్టు ఉంది సినిమా. 



Tarun Shetty, Avantika, Jenny,Keeriti, Bharanసినిమాకు వెళ్తే మీకు మీరు శిక్ష వేసుకున్నట్టే..!

మరింత సమాచారం తెలుసుకోండి: