గోపిచంద్ , సినిమాటోగ్రఫీ , యాక్షన్ సీన్స్గోపిచంద్ , సినిమాటోగ్రఫీ , యాక్షన్ సీన్స్మ్యూజిక్ , ఎడిటింగ్ , స్క్రీన్ ప్లే

రాజమండ్రిలో ఊరికి పెద్ద అయిన రఘుపతి (జగపతి బాబు).. అతనికి ఓ ఇద్దరు ప్రధాన శత్రువులు ఉంటారు. వారి నుండి తన కుటుంబానికి ముప్పు ఉంటుంది. తన ఇంట్లో ఉన్న అన్నదమ్ములకు కూతురికి ప్రాణాపాయం ఉందని చెప్పి అసలు ఇంట్లో నుండి అడుగు బయట పెట్టనివ్వడు. ఇక తన కూతురు శృతి (రాశి ఖన్నా) కి ఫారిన్ సంబంధం అయితే బాగుంటుందని భావించి కృష్ణ ప్రసాద్ (గోపిచంద్) ను పెళ్లిచూపులకు రమ్మంటారు. శృతికి ఊరు వదిలి వెళ్ల్లడం ఇష్టం ఉండదు అందుకే కృష్ణ నచ్చలేదని చెప్పాలనుకుంటుంది. కృష్ణ చాలా మంచివాడు.. కుటుంబానికి చాలా దగ్గరవడంతో శృతి కూడా అతన్ని నచ్చుతుంది. ఇక ఈలోగా శత్రువులు రఘుపతి ఫ్యామిలీ మీద దాడి చేయగా కృష్ణ వారందరిని కాపాడతాడు. అసలు ఇంతకీ రఘుపతికి శత్రువులు ఎలా తయారయ్యారు..? కృష్ణ వారిని ఎలా కాపాడాడు అన్నది అసలు కథ.

గోపిచంద్ ఎప్పటిలానే తన మాస్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మొదటి భాగం మొత్తం మంచివాడిగా కనిపించిన గోపిచంద్ సెకండ్ హాఫ్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రాశి ఖన్నా ఫీమేల్ లీడ్ గా బాగా చేసింది. అను ఇమ్మాన్యుయెల్ గెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. ఇక జగపతి బాబు పాత్ర ఎప్పటిలానే పెద్దతరహాగా నటించాడు. కిక్ శ్యాం, అభిమన్యు సింగ్ నటన ఆకట్టుకుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు జ్యోతికృష్ణ ఎంచుకున్న కథ కాస్త కొత్తగా ఉంది కాని కథనం రొటీన్ గా అనిపిస్తుంది. యువన్ శంకర్ రాజా సాంగ్స్ సినిమాలో పాటలకన్నా నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ ఇంకా దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఫైట్స్ బాగా తీశారు.
దర్శకుడు ఎంచుకున్న కథాంశం బాగున్నా దానికి కమర్షియాలిటీ యాడ్ చేసే సరికి థ్రిల్ మిస్ అయ్యింది. సినిమా మాస్ ఆడియెన్స్ కు చేరువయ్యేలా చేసినా కథ పొగత్రాగడం వల్ల వచ్చే అనర్ధాల గురించి చాలా మంచిగా చూపించారు. సినిమా టైటిల్ కన్వే అయ్యేలా కథ ఉంది. అయితే గోపిచంద్ సినిమాకు కావాల్సిన కమర్షియల్ హంగుల కోసం కథను కథనాన్ని కమర్షియల్ గా తీశారనిపిస్తుంది.


దర్శకుడు కొన్ని విభాగాల్లో పర్ఫెక్షన్ చూపించినా సినిమా అక్కడక్కడ కాస్త బోర్ అనిపిస్తుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అందించడంలో విఫలమయ్యారు. ఇక మొదటి భాగం మొత్తం సోసోగానే నడిచినా ఇంటర్వల్ ట్విస్ట్ బాగుంటుంది. ఇక సినిమా సెకండ్ హాఫ్ గోపిచంద్ మార్క్ సినిమాగా నడుస్తుంది. కమర్షియల్ అంశాలలో ఈ సినిమాకు ఫుల్ పాస్ మార్కులు ఇచ్చేయొచ్చు.


అయితే కథనం అక్కడక్కడ స్లో అవడం.. హీరో హీరోయిన్స్ కెమిస్ట్రా ఇవన్ని అంతగా కుదరలేదు. ఫైనల్ గా గోపిచంద్ మంచి ప్రయత్నమే చేశాడు అయితే ఆడియెన్స్ కు ఎంతమేరకు చేరువవుతుంది అన్నది మాత్రం చెప్పలేం.
Gopichand,Raashi Khanna,Jagapati Babu,Jyothi Krishna,S. Aishwarya,Yuvan Shankar Rajaమాస్ ప్రేక్షకులకే గోపిచంద్ ఆక్సిజన్..!

మరింత సమాచారం తెలుసుకోండి: