సునీల్ ,30 ఇయర్స్ పృథ్వి కామెడీ ,సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ సునీల్ ,30 ఇయర్స్ పృథ్వి కామెడీ ,సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ కథనం,డైరక్షన్ ,మ్యూజిక్
తనకు ఎవరు ఏం సహాయం చేసినా జీవితాంతం గుర్తుంచుకుని వారికి తిరిగి సహాయ పడే మనస్థత్వం కలవాడు గణేష్ అలియాస్ జక్కన్న (సునీల్).  తనకు సాయం చేసిన వారి కోసం ఏం చేయడానికైనా వెనుకాడని గణేష్ కు ఓ సందర్భంలో బైరాగి (కబిర్ సింగ్) హెల్ప్ చేస్తాడు. అయితే బైరాగి సహాయానికి గణేష్ కూడా ఆయన బాగుండాలనే ఉద్దేశంతో అతన్ని వెతుక్కుంటూ వైజాగ్ కు వస్తాడు. తొలిచూపులోనే సహస్ర (మన్నారా చోప్రా) ను చూసి ఇష్టపడతాడు గణేష్. ఇక ఇంతలోనే బైరాగి చేస్తున్న రౌడియిజం తెలుస్తుంది. అసలు బైరాగి గణేష్ కు చేసిన సహాయం ఏంటి..? బైరాగి కోసం గణేష్ ఏం చేశాడు..? కథ ఎన్ని మలుపులు తిరిగిందన్నది అసలు సినిమా.

గణేష్ గా సునీల్ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు. అయితే గణేష్ క్యారక్టరైజేషన్ విషయంలోనే దర్శకుడు వంశీ ఆకెళ్ల తప్పులు తడకలు చేశాడు. చేసినంతలో సునీల్ సూపర్ అనిపించాడు. ఇక తన డ్యాన్సులు ఎప్పటిలానే అదరగొట్టేశాయి. విలన్ గా నటించిన కబిర్ సింగ్ ఓకే అనిపించగా.. హీరోయిన్ గా మన్నారా చోప్రా తన గ్లామర్ లుక్ తో పర్వాలేదనిపించింది. ఇక ప్రస్తుతం తన కామెడీతో స్టార్ కమెడియన్ గా క్రేజ్ తెచ్చుకున్న 30 ఇయర్స్ పృథ్వి మరోసారి పోలీసాఫీసర్ కట్టప్పగా నవ్వులు చిందించాడు. ఇక ఉన్నంత వరకు సప్తగిరి కూడా తన కామెడీతో నవ్వించాడనే చెప్పాలి.

సినిమా టెక్నిక డిపార్ట్ మెంట్ విషయానికి వస్తే కథ అనుకున్న పాయింట్ బాగున్నా దాన్ని తెర రూపం దాల్చడంలో దర్శకుడు కొద్దిగా పట్టుతప్పాడు. సినిమా మొత్తం దర్శకుడు ఆలోచన బట్టే నడిచినా ఆడియెన్స్ కాస్త బోర్ ఫీలవుతారు. రక్ష సినిమాతో దర్శకత్వ ప్రతిభను చాటిన వంశీ ఆకెళ్ల జక్కన్నకు సరైన ఫినిషింగ్ ఇవ్వలేదు. ఇక సినిమాలో మెయిన్ డ్రా బ్యాక్ మ్యూజిక్. దిణేష్ అందించిన ఏ పాట అంతగా ఆకట్టుకోలేదు. ఏదో సినిమాలో నడుస్తుంటాయి అంతే. సినిమాలో టెక్నికల్ గా ది బెస్ట్ ఇచ్చింది మాత్రం కెమెరా మన్ రాం ప్రసాద్. విలన్ ఎపిసోడ్స్ అన్ని కెమెరా వర్క్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఎం.ఆర్ వర్మ ఎడిటింగ్ కూడా సోసోగానే ఉంది. సినిమాను ఉన్నంతలో రిచ్ గానే తీసేందుకు ప్రయత్నించారు.

స్టార్ కమెడియన్ గా ఉన్న సునీల్ హీరోగా ఎలాగైనా స్టార్ ఇమేజ్ సంపాదించాలని చూస్తున్నాడు. వరుస ఫ్లాపులు వస్తున్నా ఈ జక్కన్న తనలోని కామెడీ యాంగిల్ తోనే హిట్ కొట్టేస్తా అన్న నమ్మకంతో వచ్చాడు. తీరా చూస్తే దర్శకుడి అర్ధం లేని కథనాల వల్ల సినిమా నిరాశ పరచిందనే అనాలి. తనకు సహాయం చేసిన వారికి తిరిగి సహాయం చేయాలన్న కాన్సెప్ట్ ఓకే కాని విలన్ కోసం వెళ్లేలా చేసే లాజిక్ పనిచేయదు. 

అంతేకాదు సినిమాలో కేవలం సునీల్ లో కొన్ని కామెడీ సీన్స్, విలన్ కొన్ని సీన్స్, 30 ఇయర్స్ ప్రుధ్వి కామెడీ ఇలా మూడు నాలుగు సందర్భాలు తప్ప మిగతా అంతా బోరింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు హీరో క్యారక్టరైజేషన్ సరిగా చూపించలేదు. ఇక హీరోయిన్ గా మన్నారాను కూడా సరిగా వాడుకోలేదనే అనాలి. సునీల్ తో కాస్త కథతో మొత్తం కామెడీ నింపేసి సినిమా హిట్ కొడదామనుకున్న పాయింట్ బాగున్నా కథ కథనాల విషయంలో దర్శకుడి తప్పులు సినిమా ఆడియెన్స్ కు రీచ్ అవ్వకుండా చేస్తాయి.

సెకండ్ హాఫ్ ట్విస్ట్ రివీల్ అయిన సందర్భంలో కాస్త గ్రిప్ సాధించినట్టు అనిపించినా మళ్లీ దాని మీద పట్టు తప్పించి వేరే రూట్లో సినిమా తీసుకెళ్తాడు దర్శకుడు. సినిమా చిన్నదే అయినా ఆడియెన్స్ అంతా ముందే కనిపెట్టేలా ఉంటుంది. ఇక సినిమాకు ఎంతో బలాన్నివ్వాల్సిన ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా దర్శకుడు తన ప్రతిభ కనబరచలేకపోయాడు.  

సినిమా టెక్నికల్ డిపార్ట్ మెంట్ కూడా సినిమా వైఫల్యంలో కారణమని చెప్పాలి. సినిమాలో కొన్ని సీన్స్ లో మంచి సందర్భాల్లో కూడా డైలాగులు సరిగా రాయించలేక పోయాడు. ఇక సునీల్ తో కలిసి మిగతా కామెడీ గ్యాంగ్ కొద్దిపాటి సరదా నవ్వులు చూడాలనుకునే వారికి సినిమా నచ్చే అవకాశం ఉంటుంది. కాని అంచనాలు అందుకునే రేంజ్ లో సునీల్ జక్కన్న లేడని మాత్రం చెప్పొచ్చు.


Sunil,Mannara Chopra,Vamsi Krishna Akella,R.Sudharshan Reddy,Dineshసునీల్ ను 'జక్కన్న' కూడా కాపాడలేదు...!

మరింత సమాచారం తెలుసుకోండి: