వెంకటేష్ , నయనతార , ప్రుధ్వి కామెడీ , ఫస్ట్ హాఫ్వెంకటేష్ , నయనతార , ప్రుధ్వి కామెడీ , ఫస్ట్ హాఫ్కథ ,కథనం ,మారుతి డైరక్షన్

ఏసిపి కృష్ణ(వెంకటేష్) తన తాత మాదిరి అందరి మీద జాలి చూపిస్తు ఉంటాడు.. చేస్తున్న వృత్తిలో రౌడిలను శిక్షిస్తూనే వారిని చూసి మళ్లీ జాలి పడే మృదుస్వభావి. శైలజ (నయనతార) ఓ మెస్ రన్ చేస్తూ ఉంటుంది. ఇక ఓ పక్క ఎమ్మెల్యే పుచ్చప్ప (పోసాని కృష్ణ మురళి), మల్లేష్ యాదవ్ (సంపత్ రాజ్) లు పరారిలో ఉన్న శైలజ తండ్రి శాస్త్రి (జయ ప్రకాశ్)ని పట్టుకోవాలని చూస్తారు. శాస్త్రి మీద నేర ఆరోపణలు కూడా ఉంటాయి. ఏసిపి కృష్ణ మొదటి చూపులోనే శైలజను ప్రేమిస్తాడు.. ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నంలో తను పోలీస్ అని చెప్పకుండా దాస్తాడు కృష్ణ. ఇక తల్లి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు పరారిలో ఉన్న శాస్త్రి హాస్పిటల్ కు వస్తాడు. అప్పుడు కృష్ణ అండ్ టీం అతన్ని ఎటాక్ చేస్తారు. . అసలు శాస్త్రి చేసిన తప్పేంటి..? ఎమ్మెల్యే పుచ్చప్ప, మల్లేష్ యాదవ్ శాస్త్రిని ఎందుకు చంపాలనుకుంటారు..? ఫ్యామిలీకు దూరంగా శాస్త్రి ఎందుకు ఉండాల్సి వచ్చింది అన్నది అసలు కథ.

కొద్దిరోజులుగా కేవలం తన ఇమేజ్ పక్కన పెట్టి మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్న వెంకటేష్ తన పర్ఫెక్ట్ కం బ్యాక్ గా బాబు బంగారంలో కనిపించాడు. తన నుండి అభిమానులు ఏది ఆశిస్తున్నారో అలాంటి సినిమాతో వచ్చేశాడు. అయితే వెంకటేష్ క్యారక్టరైజేషన్ ఆయన చేసిన కామెడీ సినిమాకు ప్లస్ అయినా కథలో దమ్ములేక పోవడంతో ఢీలా పడ్డట్టు అనిపించింది. తన రోల్ వరకు వెంకటేష్ మరోసారి అదరహో అనిపించాడు. జాలితో కూడిన క్యారక్టర్ తో పాటుగా ఫైట్స్ లో కూడా తన సత్తా చాటాడు. విక్టరీ వెంకటేష్ ను ఇలా చూసి చాలా రోజులవుతుంది అన్న భావన వస్తుంది. ఇక హీరోయిన్ గా చేసిన నయనతార కూడా స్కోప్ ఉన్నంత వరకు బాగా నటించింది. ప్రతి ఫ్రేమ్ లో నయనతార అందంగా కనిపించేలా చేశారు. ఇక పాత్ర పరిధి మేరకు మంచి అభినయాన్ని ప్రదర్శించింది నయన్. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగించే క్రమంలో కమెడియన్స్ తో బాగానే పని చేయించుకున్నాడు దర్శకుడు మారుతి. ఆ క్రమంలో ఎప్పుడు వెంకటేష్ పక్కనే ఉండి బ్రహ్మాజి, వెన్నెల కిశోర్, రవిలు కామెడీ చేస్తుండగా.. బత్తాకాయల బాబ్జిగా థర్టీ ఇయర్స్ ప్రుధ్వి మరోసారి తన కామెడీతో అదరగొట్టేశాడు. ఇక మొదటి భాగంలో ఓ ఎపిసోడ్ లో కనిపించే జబర్దస్త్ టీం ఆడియెన్స్ లో హుశారు నింపేలా చేసింది.  కామెడీ విలన్స్ గా సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి ఇద్దరు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

వెంకటేష్ కు మంచి కం బ్యాక్ మూవీ ఇచ్చే ప్రయత్నం చేసిన దర్శకుడు మారుతి వెంకీ ఇమేజ్ తగ్గ స్క్రీన్ ప్రెజెన్స్ అందించాడు కాని కథలో ఏమాత్రం కొత్తదనం లేకుండా చేశాడు. ఇక జిబ్రాన్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రిచర్డ్ ప్రసాద్ కెమెరా పనితనం బాగుంది. వెంకటేష్, నయనతారను చూపించడంలో కెమెరా వర్క్ అద్భుతం. ఎడిటింగ్ ఉద్దవ్ వర్క్ బాగున్నట్టు అనిపించినా ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది. ఇక సితార ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. రాధాకృష్ణ సమర్పణలో సినిమాను నాగ వంశీ, ప్రసాద్ లు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.

బాబు బంగారం అంటూ కొద్దిరోజులుగా సందడి చేస్తున్న విక్టరీ వెంకటేష్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దృశ్యం, గోపాలా గోపాల ఇలా తన ఇమేజ్ వదిలేసి కాస్త రూట్ మార్చిన వెంకటేష్ బాబు బంగారంతో తన స్టైల్ సినిమాతో వచ్చాడు. సినిమాలో ఏసిపి కృష్ణగా నటించిన వెంకటేష్ తన పరంగా అద్భుతంగా చేశాడు. వెంకటేష్ ను ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాడు దర్శకుడు మారుతి.  


అయితే కథ విషయంలో మాత్రం మారుతి తప్పు చేశాడని చెప్పాలి. ఓ సాదా సీదా కథతో వెంకటేష్ లాంటి స్టార్ హీరో సినిమా చేయడం.. అది కూడా లాజిక్ లేకుండా చేయడం కాస్త ఇబ్బంది పెడుతుంది. రెగ్యులర్ కమర్షియల్ కథకే హీరో క్యారక్టరైజేషన్ కు జాలి అని ఓ ట్యాగ్ తగిలించి బాబు బంగారం సినిమా తీశాడు మారుతి. ఇక వెంకటేష్ క్యారక్టరైజేషన్ విషయంలో కూడా కొన్ని లోటు పాట్లు కనిపిస్తాయి.


ఓ ఎమ్మెల్యే, ఓ రౌడి షీటర్ తాము చేసిన ఓ తప్పు కోసం హీరోయిన్ తండ్రిని వెతికించడం.. దానికి ఏసిపి కృష్ణ హీరోయిన్ ఫ్యామిలీకు సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యేని ఆడించడం లాజిక్ గా అనిపించదు. అసలు ఎమ్మెల్యే అంటే కేవలం కామెడీగా చేసేశాడు మారుతి. రౌడిను కూడా అంతగా వాడుకున్నది లేదు. ఫైనల్ గా వెంకటేష్ ఇచ్చిన అవకాశాన్ని ప్రెజెంటేషన్ వరకు పర్ఫెక్ట్ గా చేసిన మారుతి కథ విషయంలో మాత్రం గ్రిప్ కోల్పోయాడు.  



వెంకటేష్ ను ఇదవరకు ఎనర్జీతో చూడాలనుకుని.. కాసిన్ని నవ్వులు నవ్వుకునేందుకు ఈ సినిమా చూసేయొచ్చు. క్లైమాక్స్ లో బొబ్బిలి రాజా మ్యూజిక్ తో వెంకటేష్ చేసే కామెడీ ఫైట్ సినిమాకు హైలెట్. ఒక్కసారి చూసే టైం పాస్ మూవీగా బాబు కచ్చితంగా బంగారం అనిపిస్తాడు అంతే. 


Venkatesh,Nayanthara,Maruthi,S. Radha Krishna,S. Naga Vamshi,PDV Prasad,Ghibran'బాబు బంగారం' సినిమా సగం బంగారం..!

మరింత సమాచారం తెలుసుకోండి: