సాయి ధరం తేజ్ లుక్ , కెమెరా వర్క్ , కొన్ని కామెడీ సీన్స్ సాయి ధరం తేజ్ లుక్ , కెమెరా వర్క్ , కొన్ని కామెడీ సీన్స్ కథ, కథనం, డైరక్షన్

ఓ కంపెనీలో జాబ్ చేస్తున్న ఆదిత్య (సాయి ధరం తేజ్) యాక్సిడెంట్ తో మీట్ అయిన అంజలి (లారిసా)ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. కొద్ది టైంలోనే అంజలిని ఇంప్రెస్ చేసిన ఆదిత్య ఆమె కోసం తన అలవాట్లను మార్చుకుంటాడు. ఆ క్రమంలో తన తండ్రి (రాజేంద్ర ప్రసాద్) ని, స్నేహితులను దూరం చేసుకుంటాడు. ఇంతలోనే ఆదిత్య అంజలిల లవ్ బ్రేక్ అప్ అవుతుంది. లవ్ బ్రేక్ అప్ అయిన బాధలో ఆదిత్య ఏం చేస్తాడో తనకే అర్ధం కాకుండా అన్ని చేస్తుంటాడు. ఆ గొడవలో ఓ బార్, వైన్ షాప్, పెళ్లి మండపం, పెట్రోల్ బంక్  నాశనం అవుతాయి. ఇక ఈ క్రమంలోనే సిటీలో పెద్ద రౌడి అయిన సాధు, అమ్మాయిల బ్రోకర్ నర్సింహాలకు ఆదిత్య శత్రువవుతాడు. అసలు ఆదిత్య ఇదంతా ఎందుకు చేస్తున్నాడు..? అంజలి వెంట పడుతున్న ఆదిత్యను చంపాలని చూసేది ఎవరు..? చివరు ఆదిత్య అంజలి ఎలా కలిశారు..? అన్నది అసలు కథ.     

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న సాయి ధరం తేజ్ తిక్క సినిమాలో ఆదిత్యగా అల్లరి చిల్లరగా ఆకట్టుకున్నాడు. అయితే క్యారక్టరైజేషన్ కొత్తగా ట్రై చేసినా అది ఆడియెన్స్ కు అంతగా నచ్చే అవకాశం ఉండదు. ఇక అంజలిగా నటించిన లారిసా పర్వాలేదు అయితే కొన్ని సీన్స్ లో హీరోయిన్ గా ఆమె రాంగ్ సెలక్షన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆదిత్యను ప్రేమిస్తున్న క్యారక్టర్ లో మన్నారా చోప్రా కనిపించిన ప్రతిసారి అలరించింది. కాని ఆమె పాత్రకే ఓ క్లారిటీ లేకుండా చేశాడు. పోలీస్ పాత్రలో పోసాని కామెడీ పంచాలని చూసినా అంతగా పండలేదు. సాధుగా అజయ్ ఓకే అనిపించగా.. కమెడియన్స్ గా ఆలి, సప్తగిరి, సత్య, తాగుబోతు రమేష్ ఇలా ప్రతి కమెడియన్ నవ్వించే ప్రయత్నం చేశారు. కాని కన్ ఫ్యూజ్ కథనంతో ఆ కామెడీ ప్రేక్షకులకు ఎక్కలేదు. రాజేంద్ర ప్రసాద్ రోల్ అంత ప్రాముఖ్యత అనిపించలేదు. కొడుకుని పద్ధతిగా పెంచాల్సిన తండ్రే తప్పుదారిలో నడవడం అంతగా నప్పదు. దేవరాజ్ కూతురుగా నటించిన కమల చేసిన నాలుగు సీన్స్ పర్ఫెక్ట్ గా ఉంది. కాని ఆ క్యారక్టర్ ముందు చూపించిన బిల్డప్ మెంట్ తర్వాత ఉండదు.    

ముందుగా తిక్క అంటూ మంచి ఫాంలో ఉన్న తేజ్ తో ఈ సినిమా తీసిన దర్శకుడు సునీల్ రెడ్డి గురించి చెప్పాలి. ఆకట్టుకోని కథ కథనాలతో తిక్క ఏమాత్రం ఆడియెన్స్ కు ఎక్కించడంలో విఫలమయ్యాడు సునీల్ రెడ్డి. సినిమాలో సాంగ్స్ తేజుకి కొత్త ఇమేజ్ వచ్చేలా చేశాయి. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు. ఇక సినిమా మిగతా యాస్పెక్ట్ అన్నిటిలో ఫెయిల్ అయ్యింది. కెమెరామన్ గుహన్ పనితనం మెచ్చుకోవచ్చు. ఇక ఎడిటింగ్ లో కూడా ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంటే బాగుండేది. రోహిణ్ రెడ్డి సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ వరకు సినిమా రిచ్ గానే ఉంది.

సుప్రీం హీరోగా సూపర్ ఫాంలో ఉన్న సాయి ధరం తేజ్ తిక్కగా మామ తిక్క కొనసాగిస్తాడు అనుకుంటే పైత్యం చూపించాడని చెప్పొచ్చు. ఏమాత్రం ఆకట్టుకోని కథ కథనాలతో దర్శకుడు సునీల్ రెడ్డి అన్ని కోణాల్లో సినిమా ప్రేక్షకులకు రీచ్ చేయలేకపోయాడు. కొన్ని కామెడీ సీన్స్ తప్పించి సినిమాలో చెప్పుకోదగ్గ మ్యాటర్ ఏం లేదు.


హీరో చేసే గొడవ వల్ల ఓ కళ్యాణ మండపం, ఓ పెట్రోల్ బంక్, ఓ బార్ ఇలా పబ్లిక్ ప్రాపొర్టీ వేస్ట్ చేస్తే అతన్ని పోలీసులు ఎలా విడిచి పెడతారు అన్నది లాజిక్ లేని పాయింట్. ఇక పోలీస్ అంటే కమెడియన్ అనేలా దర్శకుడు అంత అల్ల కల్లోలం చేసిన హీరో అండ్ గ్యాంగ్ ను ఎలా విడిచిపెడతారనన్నది సెకండ్ పాయింట్. లాజిక్ చూడకపోయినా అవేవి ఆడియెన్స్ యాక్సెప్ట్ చేసేలా ఉండవు.  


ఇక సినిమా మొదలు పెట్టిన కొద్దిసేపు పర్వాలేదనిపించినా తర్వాత తర్వాత సోదిలా మారుతుంది. ఇక అయినా మారుతుందా అని ఎదురుచూసే ఆడియెన్స్ మధ్యలో ఇంటర్వల్ తప్పించి చివరి దాకా ఆడియెన్స్ సహనాన్ని పరిక్షించడమే దర్శకుడి పని అయ్యింది. తన మాస్ ఇమేజ్ తగ్గట్టు సినిమాలు తీయకుండా తిక్క అంటూ వచ్చిన తేజు ఓ ఇమేజ్ వచ్చాక ఫేజ్ చేసిన మొదటి ఫ్లాప్ ఇదని చెప్పాలి. 


ఆల్రెడీ ఓ 3డి సినిమా ఫ్లాప్ అయినా అదే కన్ ఫ్యూజ్ స్క్రీన్ ప్లేతో సినిమా మొత్తం గజిబిజి చేసి తిక్క నిజంగా తిక్క లేపేలా చేశాడు డైరక్టర్ సునీల్ రెడ్డి. మెగా అభిమానుల్లో ఇప్పుడిప్పుడే ఓ స్టార్ క్రేజ్ దక్కించుకుంటున్న తేజు ఇలాంటి సినిమాలు చేస్తే కనుక కష్టమే అంటున్నారు. ఏ యాంగిల్ లో చూసినా సినిమా ప్రేక్షకులకు నచ్చడం అటుంచితే తలనొప్పి తెస్తుందని చెప్పొచ్చు. చివరగా సినిమాలో తేజు లుక్ విషయంలో అందరు ఇంప్రెస్ అయ్యారు. 
Sai Dharam Tej,Larissa Bonesi,Mannara,Sunil Redy,Dr.Rohin Kumar Reddy,S.S.Thamanఈ 'తిక్క' నిజంగానే తిక్క ఎక్కిస్తుంది బాబోయ్..!

మరింత సమాచారం తెలుసుకోండి: