టోటల్ కాస్టింగ్, డైరక్షన్ , మ్యూజిక్టోటల్ కాస్టింగ్, డైరక్షన్ , మ్యూజిక్కొద్దిగా స్లో అనిపించడం

అచ్యుత రామారావు (నారా రోహిత్), ఆనంద వర్ధనరావు (నాగ శౌర్య) ఇద్దరు అన్నదమ్ములు.. ఇంటి టెర్రస్ మీదకు అద్దెకు వచ్చిన జ్యోత్స్న (రెజినా)ను ఇద్దరు ఇష్టపడతారు. ముగ్గురు కలిసి ఉంటూనే రోహిత్, శౌర్యలు విడివిడిగా ఆమెను ట్రై చేస్తుంటారు. ఇక ఇద్దరు ఇష్టపడుతున్న విషయం ఒకరికి ఒకరు చెప్పకుండా ఇద్దరు ఒకేసారి జ్యోకి ప్రపోజ్ చేస్తారు. అయితే ఆమె మనసులో మరొకరు ఉన్నారని చెబుతుంది. జ్యో అమెరికా వెళ్లి అక్కడ కోర్స్ చేయాలనే ఆలోచనలో ఉంటుంది. తన ప్రేమను కాదన్న ఆమె పాస్ పోర్ట్ తగలబెడతాడు అచ్యుత్.. ఇక ఆ విషయం తన పేరేంట్స్ కు చెప్పే క్రమంలో అచ్యుత్, ఆనంద్ లు తమ తండ్రిని పోగోట్టుకుంటారు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య గొడవలవుతాయి. ఇద్దరు పైకి మాట్లాడుకుంటున్నట్టు కనిపించినా మనసుల్లో దూరం బాగా పెరిగిపోతుంది. అయితే ఈ ఇద్దరు ఎలా కలిశారు..? జ్యో ఇద్దరిలో ఎవరినినైనా ప్రేమించిందా..? అన్నది అసలు కథ.

జ్యో అచ్యుతానంద సినిమాలో అచ్యుత్ పాత్ర చేసిన నారా రోహిత్ తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. పెళ్లి తర్వాత స్వార్ధంతో కూడిన మనస్థత్వం తన పాత్రతో బాగా పలికించాడు. లోపల ప్రేమ ఉన్న పైకి మాత్రం కచ్చితంగా ఉండే అచ్యుత్ పాత్రలో రోహిత్ అదరగొట్టేశాడు. ఇక ఆనంద్ గా నటించిన నాగ శౌర్య మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ చూపించాడు. జీవితం విలువ చాలా లోతుగా చూసిన ఆనంద్ పాత్రలో నాగ శౌర్య తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. అన్నదమ్ములుగా నారా రోహిత్, నాగశౌర్య సినిమాకు ప్రాణం పోశారు. ఇక జ్యోగా నటించిన రెజినా కచ్చితంగా సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం గ్లామర్ పాత్రలతోనే ఇన్నాళ్లు సరిపెట్టిన రెజినా యాక్టింగ్ లో కూడా ఇరగ్గొట్టేసింది. జ్యో పాత్ర తీరు తెన్నులు బాగా అవలంభించుకుంది రెజినా. సినిమాలో ఈ మూడు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక నారా రోహిత్ భార్యగా నటించిన పావని, నాగ శౌర్య భార్యగా నటించిన అమ్మాయి కూడా బాగానే చేశారు. సీత, తణికెళ్ల భరణిల గెస్ట్ రోల్స్ పాత్రల పరిధి మేరకు నటించారు.

సినిమాకు కథ కథనం మాటలు అన్ని తానై నడిపించిన అవసరాల శ్రీనివాస్ మరోసారి తన ప్రతిభను చక్కగా ప్రదర్శించాడు. తనవరకే కాదు సినిమాకు మెలోడి మ్యూజిక్ తో మంచి ఫీల్ వచ్చేలా కళ్యాణ్ రమణి మ్యూజిక్ బాగా హెల్ప్ అయ్యింది. ఇక వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు తగినట్టుగా ఉంది. ముఖ్యంగా రెజినా ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించింది. ఇక ఎడిటర్ కిరణ్ గంటి ఎడిటింగ్ కూడా షార్ప్ గానే ఉంది. అక్కడక్కడ కాస్త స్లో అవుతున్నట్టు కనిపించింది. సాయి కొర్రపాటి వారాహి చలనచిత్ర ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాకు ఎంత అవసరం ఉందో అది రిచ్ గా వచ్చేలా చేశారు.

ఓ మధ్యతరగతి కుటుంబం అందులోని ఎమోషన్స్ ఇలా తను అనుకున్న కథకు ఈ టచ్ ఇచ్చుకుంటూ జ్యో అచ్యుతానంద ఓ ఎమోషన్స్ ఫీల్ క్యారీ అయ్యేలా చేశాడు దర్శకుడు అవసరాల శ్రీనివాస్. నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటూనే దర్శకుడిగా పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. మొదటి సినిమా ఊహలు గుసగుసలాడేతోనే తన టేస్ట్ ఏంటో ఆడియెన్స్ కు పరిచయం చేసిన శ్రీనివాస్ ఈ జ్యో అచ్యుతానందతో మరింత దగ్గరయ్యాడు. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరికి ఇద్దరంటే అభిమానం, ప్రేమ. కాని బయటపడే అవకాశం లేదు.

 

అచ్యుత్ రామారావు తన స్వార్ధం కోసం తాను బ్రతికే వ్యక్తి.. ఆఖరికి తమ్ముడికే రూయన్నర వడ్డీకి అప్పు ఇస్తాడు. అయితే ఈ పాత్ర తీరుతెన్నుల్లో రోహిత్ పలికిన హావభావాలు సినిమాకే హైలెట్.. ఇక తనకంటే పవర్ ఫుల్ రోల్ ఆనంద వర్ధనరావుగా నాగ శౌర్య మరోసారి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఈ ఇద్దరి క్యారక్టర్స్ మీద ఏదైతే పేపర్ మీద రాసుకున్న ఫీల్ ఉందో అదే తెర మీద కనిపించేలా చేసుకున్నాడు అవసరాల శ్రీనివాస్. ఇంటర్వల్ సీన్ చాలా ఎమోషనల్ గా బాగుంటుంది.. ఇక క్లైమాక్స్ లో అచ్యుత్ ఆనంద్ ల మధ్య డైలాగ్స్ మనసుని తాకుతాయి.. మనం పిరికివాళ్లం కాబట్టే చుట్టు గోడకట్టుకుంటాం.. నాన్న చాలా ఇచ్చారు.. కాని నాన్న స్థానంకు వచ్చి నువ్విచ్చిన మొదటి గిఫ్ట్ వదులుకోను అనే డైలాగ్స్ టచ్ అవుతాయి.

 

రాసుకున్న కథకు ఎలాంటి సోకులు అద్దకుండా కథ ఏ మేరకు ప్రభావితం చూపుతుందో అదే విధంగా కథనం సాగించాడు దర్శకుడు. అందుకే సినిమాలో ఎంటర్టైన్ మెంట్ అనేది ఆ క్యారక్టర్ మధ్య వచ్చేలా చేసుకున్నాడు. రోహిత్, శౌర్య పాత్రల్లో ఆడియెన్ తమని తాము చూసుకునేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇక ముందునుండి సినిమా మీద నమ్మకంగా ఉన్న అవసరాల అనుకున్నట్టుగానే మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

 

మంచి సినిమా చూడాలనుకునే వారికి జ్యో అచ్యుతానంద తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది. అయితే బి,సి క్లాస్ ఆడియెన్స్ మాత్రం కాస్త నిరాశ పడొచ్చు. రెగ్యులర్ సిని లవర్స్ కు ఇదో మంచి ఫీల్ గుడ్ మూవీ అవుతుంది.

Nara Rohit,Naga Shourya,Regina Cassandra,Srinivas Avasarala,Sai Korrapati,Kalyan Koduri'జ్యో అచ్యుతానంద' ఓ అన్నదమ్ముల ప్రేమకథ..!

మరింత సమాచారం తెలుసుకోండి: