Chammak Challo:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review


11:05am : APHerald ‘చమక్ చల్లో’ తెలుగు ట్వీట్ రివ్వూ viewers కు స్వాగతం
11:10am : అవసరాల శీను మీటింగ్ తో  చిత్రం ప్రారంభమైంది. స్ర్కిప్ట్ బాగుంది.           
11:15am : గతంలో లవ్ స్టోరి నేపధ్యంలో వచ్చిన సినిమాల సీన్స్  చూపిస్తూ టైటిల్స్ పడుతున్నాయి.                       
11:18am : వరుణ్ సందేశ్ పరిచయ సన్నివేశం సాధారణ కాలేజ్ స్టూడెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. శ్యాం బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు.
11:22am : వరుణ్ సందేశ్- సంచిత పరిచయాలు ఫన్నీగా ఉన్నాయి.
11:26am : అప్పారావు [షియాజీషిండే] కాలేజ్ ప్రొఫెసర్ గా కామెడీ చేస్తూ తనదైన శైలీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
11:30am : చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ‘బూమ్ భూమ్’ వస్తుంది. వరుణ్ సందేశ్- సంచితల మధ్య కెమిష్ట్రి బాగుంది.
11:35am : శ్యాం[వరుణ్ సందేశ్]- సంచిత [అనూష్] లు ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమను అప్పారావు ప్రొత్సాహిస్తున్నాడు.                            
11:38am : శ్యాం- సంచితలు ప్రేమించుకునే సన్నివేశాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి.
11:46am : శివాజీరాజా ప్రేమ గురించి తన అభిప్రాయం చెపుతున్నాడు.       
11:50am :వరుణ్ సందేశ్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో మీసంతో కనిపిస్తున్నాడు. తెరపై అంతగా బాగలేదు. శ్యాం - సంచితల మధ్య ప్రేమ సన్నివేశాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రేక్షకులకు ఉత్సాహాం లేకుండాఉంది.
11:53am : చిత్రంలోని సెకండ్ సాంగ్ ‘నా కళ్ళలో...నా.. కురెసే..’  వరంగల్ ట్రిప్ లో శ్యాం, సంచితల మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలతో ఈ సాంగ్ వస్తుంది.
12:01pm : బ్రహ్మజీ వరుణ్ సందేశ్ తండ్రిగా ప్రేక్షకులకు పీల్ రావడంలేదు.        
12:10pm : శ్యాం- సంచితలు ఒకరినొకరు అర్థం చేసుకోలేక విబేదాలు తలెత్తాయి, దీంతో ఇద్దరు గొడవపడడం వల్ల ప్రేక్షకులకు సిల్లీగా. ఫన్నీగా ఉంది.
12:12pm : ‘సింపుల్ గా చెప్పాలా... సిల్లీగా చెప్పాలా’ సాంగ్ వస్తుంది. మొత్తానికి వరుణ్ ప్రేమను సంచిత అంగీకరిస్తుంది. నెమ్మదిగాసాగే ప్రేమ సన్నివేశాలతో ప్రేక్షకులకు నిద్రవచ్చేలా ఉంది.                    
12:21pm : ఈ సినిమా డెరక్టర్ నెమ్మదిగాసాగే ఒక చిన్న లవ్ స్టోరిని ప్రేక్షకులకు అందిస్తున్నాడు.      
విశ్రాంతి
12:29pm : డైరెక్టర్  ప్రేమ సన్నివేశాలను  విభజించి... కథను మరో మలుపుకు తీసుకెళుతున్నాడు
12:41pm : ‘ఓ మెరి మెహభూబా’ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ లో వరుణ్ సందేశ్ ఓవర్ యాక్షన్ ప్రేక్షకులకు చిరాకెత్తిస్తుంది.            
12:43pm : వరుణ్ సందేశ్ జాబ్ రావడంతో కథ బెంగుళూర్ కు మారుతుంది. దీంతో ప్రేక్షకులకు కొంచెం ఉత్సాహం కనబడుతుంది.
12:50pm : క్యాథరిన్ పరిచయం ఆశ్ఛర్యకరంగా, చూడ్డానికి బాగుంది.                                          
12:56pm : వరుణ్ సందేశ్ క్యాథరిన్ కు దగ్గరవ్వడానికి చేసే ప్రయత్నసన్నివేశాలు చీప్ గా అనిపిస్తున్నాయి.           
01:07pm : ‘చందమామ పైకుందేలా...’ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ లో క్యాథరిన్ అందంగా కనబడుతుంది.    
01:08pm : సంచిత అనుకోకుండా వరుణ్ సందేశ్  ఇంటికి వెళ్ళింది. క్యాథరిన్, సంచితల మధ్య ఫన్నీ ఫైట్ జరిగే అవకాశాలున్నాయి.
01:15pm : వరుణ్ సందేశ్, సంచితలు విడిపోయే సన్నివేశం ప్రేక్షకులకు పిల్లచెష్టలు చేసినట్లుగా అనిపిస్తుంది.    
01:19pm : గతంలో నేషనల్ అవార్డును అందుకున్న డైరెక్టర్ ఇలాంటి నెమ్మదిగిసాగే చిత్రాన్ని తీయాడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
01:24pm : వరుణ్ సందేశ్- సంచితలు విడిపోయిన తీరును శీనివాస్ కు తెలుజేయస్తున్నాడు. శీనివాస్ ఎలా స్పందిస్తాడో చూద్దాం. ఇక్కడ మనుసుకు హత్తుకునే సెంటిమెంట్ సీన్ బాగుంది.                
01:35pm :శీనివాస్ ఇచ్చిన అద్భుతమైన ఆలోచనతో వారిద్దరి మధ్య విభేదాలు తొలగిపోయి వరుణ్- సంచితలు ఒక్కటయ్యారు. దీంతో అందరు సంతోషంగా ఉండటాన్ని చూపిస్తూ సినిమా శుభంకార్డు పడింది.        
శుభం

Chammak Challo Review: Cast & Crew

   

More Articles on Chammak Challo || Chammak Challo Wallpapers || Chammak Challo Videos


     

మరింత సమాచారం తెలుసుకోండి: