Pizza: English Full Review


‘ప్రేమిస్తే’, ‘జర్నీ’ వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటి తాజాగా ‘పిజ్జా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పైగా ఈ సినిమా గురించి అందాల నటి సమంత గొప్పగా చెప్పడంతో అంతా ఈ ‘పిజ్జా’పై ఆసక్తి కనబరిచారు. మరి ఈ ‘పిజ్జా’ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం..! చిత్రకథ :     పిజ్జా డెలవరీ బాయ్ గా పనిచేసే మైకేల్ (విజయ్ సేతుపతి), దెయ్యాల మీద పరిశోధన చేసే అనూ (రమ్య నంబీసన్) ప్రేమికులు. కలిసి జీవిస్తుంటారు.  పిజ్జా డెలవరీ చేయడానికి వెళ్లిన మైఖేల్ ఒక ఇంట్లో చిక్కుకుని పోతాడు. ఆ ఇంట్లో భయంకరమైన అనుభవాలను ఎదుర్కొంటాడు. తరువాత ప్రేమించిన అను కూడా అతనికి దూరమవుతుంది. అందరూ అతన్ని చూసి జాలి పడుతుంటారు. అసలు ఆ ఇంట్లో ఎలాంటి అనుభవాలను మైకేల్ ఎదుర్కొన్నాడు. అతనికి అనూ ఎందుకు దూరమవుతుంది అనేది వెండితెర మీద చూడాలి. నటీనటుల ప్రతిభ :   విజయ్ సేతుపతి తొలి చిత్రంతోనే ఆకట్టుకుంటాడు. తను ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించాడు. అమాయకత్వం, నెగటివ్ ఛాయలను ఉన్న పాత్రను మెప్పించాడు. రమ్య ది కీలక పాత్ర. పాత్ర చిన్నదే అయినా గుర్తుంటుంది. మిగిలిన వారు తమపాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫి బావుంది. కెమెరామెన్ పనితనంతో హర్రర్ దృశ్యాలు చక్కగా వచ్చాయి. ముఖ్యంగా చీకట్లో దృశ్యాలు బాగున్నాయి. నేపధ్య సంగీతం చక్కగా కుదరడంతో హర్రర్ దృశ్యాలకు నిండుదనం వచ్చింది. పాటలు ఉన్నా గుర్తుంచుకునే విధంగా లేవు. మాటలు సాధారణంగా ఉన్నాయి.  ఈ సినిమా మొదటి నుంచి దెయ్యల నేపధ్యంలో సాగే హర్రర్ సినిమాలా అనిపిస్తుంది. దర్శకుడు ఆ తరహాలోనే ప్రేక్షకులను భయపెడుతూ సినిమా ను ముందుకు తీసుకుని వెళుతుంటాడు. అయితే ముగింపు నకు వచ్చేసరికి ఈ సినిమా ఒక నేరగాళ్ళ కథగా ముగిసింది. హర్రర్ మూవీ తీసుకుని వెళ్లి క్రైమ్ స్టోరీకి ముడివేశాడు. అయితే కెమెరా పనితనం, నేపధ్య సంగీతంతో ప్రేక్షకులను భయపెట్టడంతో సఫలీకృతుడయ్యాడు.  హైలెట్స్ :   స్ర్కీన్ ప్లే, ఫోటోగ్రఫీ, మ్యూజిక్ డ్రాబ్యాక్స్ :   కథ, అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రం కాకపోవడం, వినోదం లేకపోవడం చివరగా :   ‘పిజ్జా’ చూడ్డం కంటే, ఆ డబ్బులతో ‘పిజ్జా’ తినడం బెస్ట్

More Articles on Pizza || Pizza Wallpapers || Pizza Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: