రామ్ ఎనర్జీ ,రావు రమేష్, మురళి శర్మ, సత్య రాజ్ ల నటన, సినిమాటోగ్రఫీరామ్ ఎనర్జీ ,రావు రమేష్, మురళి శర్మ, సత్య రాజ్ ల నటన, సినిమాటోగ్రఫీస్క్రీన్ ప్లే ,సెకండ్ హాఫ్ ల్యాగ్

నారాయణ మూర్తి (సత్యరాజ్) ఓ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్.. ఇక అతని కొడుకు సూర్య (రామ్)కు తండ్రంటే ప్రాణం.. తన తండ్రికి మేలు చేసిన వారికి కూడా మేలు చేసే సూర్య అనుకోకుండా గణ అనే రౌడీ షీటర్ కు దగ్గరవుతాడు. తండ్రికి నచ్చిందని భానుమతిని (రాశి ఖన్నా)ను ఇష్టపడతాడు సూర్య. ఇక మినిస్టర్ అయిన రాజప్ప ఓ బిల్డింగ్ కు క్లియరెన్స్ ఫైల్ పని మీద నారాయణ మూర్తికి వార్నింగ్ ఇస్తాడు. తన 30 సంవత్సరాల సర్వీస్ లో నిజాయితీగా ఉన్న నారాయణ మూర్తి ఆ ఫైల్ మీద సైన్ చేయనంటాడు. ఇక అప్పటి నుండి కథ స్టార్ట్ అవుతుంది. రాజప్ప చెప్పాడని గజ నారాయణ మూర్తిని ఎటాక్ చేస్తాడు. దానికి సూర్య సహాయం అందిస్తాడు.. ఈ కారణాలు తెలుసుకున్న నారాయణ మూర్తి సూర్యను ఇంట్లోంచి వెళ్లగొడతాడు. చివరకు రాజప్ప అనుకున్న సంతకం నారాయణ మూర్తితో పెట్టించాడా..? సూర్యను మళ్లీ మళ్లీ తన తండ్రి క్షమించాడా అన్నది అసలు కథ.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫుల్ లెంత్ ఎనర్జీతో వచ్చిన హైపర్ లో రామ్ ఎనర్జీ సూపర్ అని చెప్పాలి.. సూరి క్యారక్టర్ లో రామ్ అదరగొట్టేశాడు. తనకు ఈజీ అయిన పవర్ఫుల్ మాస్ రోల్ లో రామ్ మెప్పించాడు. ఇక హీరోయిన్ రాశి ఖన్నా ఈ సినిమాలో గ్లామర్ గా కనిపించింది. సినిమా కథకు అవసరం లేకున్నా గ్లామర్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసే ప్రయత్నం చేసింది అమ్మడు. ఇక విలన్ రాజప్పగా చేసిన రావు రమేష్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి.. సినిమాలో తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు రావు రమేష్. ఆయన మార్క్ నటనతో రాజప్పగా రావు రమేష్ అదరగొట్టాడు. ఇక గజగా మురళి శర్మ ముందు విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సూరి ఫ్రెండ్ గా మంచి పాత్రే చేశాడు. సినిమాలో తండ్రి పాత్ర చాలా కీలకం సత్యరాజ్ దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. ఓ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ గా కట్టప్ప తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక పోసాని కృష్ణమురళి కేవలం ఒకటి రెండు సీన్స్ లోనే ఉన్నా ఆకట్టుకున్నాడు. 

హైపర్ అంటూ ఓ పవర్ ఫుల్ టైటిల్ తో వచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తండ్రిని అమితంగా ప్రేమించే కుర్రాడి పాత్ర అంటూ కాస్త కొత్తగా అనిపించినా మిగతా అంతా రొటీన్ గా నడిపించేశాడు. జిబ్రాన్ సంగీతం అంతగా ఇంప్రెస్ చేయలేదు. అయితే మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. ఇక సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. అబ్బూరి రవి మాటలు కొన్నిచోట్ల క్లాప్స్ కొట్టేలా ఉన్నాయి. గౌతం రాజు ఎడిటింగ్ కూడా ఓకే అనిపించింది. ఇక 14 రీల్స్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా అనిపించాయి.

హైపర్ అంటూ రామ్ లోని ఎనర్జీని బయటపెట్టే ప్రయత్నం చేసిన సంతోష్ శ్రీనివాస్ రామ్ లోని ఎనర్జీని ఎలివేట్ చేయడానికి బాగా ప్రయత్నించాడు కాని కథలో అంత దమ్ములేకుండా చేశాడు. ఓ సిన్సియర్ ఆఫీసర్ మినిస్టర్ వచ్చి చెప్పినా సంతకం పెట్టకపోవడం వరకు ఓకే కాని ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు మినిస్టర్ ను ఆడుకోవడం అంతా సినిమాటిక్ గానే ఉంటుంది.

రామ్ లోని ఎనర్జీని పర్ఫెక్ట్ గా ప్రెజెన్స్ చేసిన సంతోష్ మిగతా విషయాల పట్ల లాజిక్ లేకుండా చేశాడు. తండ్రి మీద అమితంగా ప్రేమించే కుర్రాడు తండ్రికి సహయాం చేశాడని ఓ రౌడి షీటర్ తో స్నేహం చేయడం అతనే మళ్లీ తన తండ్రిని టార్గెట్ చేశాడని తెలియడం అంతా కాస్త కొత్త ప్రయత్నంగా అనిపించినా సినిమా సెకండ్ హాఫ్ కు వచ్చే సరికి మళ్లీ రొటీన్ బాటే పట్టినట్టు అనిపిస్తుంది.


మినిస్టర్ పదవిలో ఉన్న విలన్ ను ఏదో ఒకటి చేసి రాజీనామా చేయించడం.. ఎలాగోలా చేసి అతన్ని రాజీనామా చేయిస్తాడని తెలియడంతో ఆ స్క్రీన్ ప్లే కూడా ఆడియెన్స్ కు అంత కిక్ ఇచ్చేదిలా ఉండదు. సినిమా చూస్తున్నంత సేపు ఎనర్జీ పాస్ అయినట్టు అనిపించినా తీరా భయటకు వస్తే మాత్రం నీరసపడే అవకాశాలు ఉన్నాయి. 


నేను శైలజ తర్వాత మళ్లీ తన పాత ట్రాక్ లోనే రామ్ వచ్చినట్టు కనిపిస్తుంది. తన వయసుకి తగ్గ పాత్రలక కన్నా ఓవర్ డోస్ కథలంటూ అప్పట్లో కామెంట్స్ కు ఓ లవ్ స్టోరీ తీసిన రామ్ మళ్లీ తన రొటీన్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి కోసం మిగతా డిపార్ట్మెంట్ వారందరు పెన్ డౌన్ చేసే సీన్స్.. ఆ టైంలో వచ్చే సాంగ్ బాగుంటుంది.  ఓవరాల్ గా సినిమా రామ్ ఫ్యాన్స్ కు ఫుల్ పాక్డ్ మూవీగా అనిపిస్తే సగటు సిని అభిమానిని ఓసారి చూసే సినిమా అనుకోవచ్చు. 
Ram Pothineni,Rashi Khanna,Santosh Srinivas,Achanta Ramu,Achanta Gopinath,Anil Sunkara,Ghibranరామ్ హైపర్ పేరులోనే కాదు సినిమాలో కూడా..!

మరింత సమాచారం తెలుసుకోండి: