కామెడీ, మ్యూజిక్కామెడీ, మ్యూజిక్రొటీన్ స్టోరీ , స్క్రీన్ ప్లే , సెకండ్ హాఫ్ ల్యాగ్

బ్యాండ్ మేళం ట్రూప్ ఓనర్ అయిన నరేష్ (అల్లరి నరేష్) తన స్నేహితులు షకలక శంకర్, చమ్మక్ చంద్రలతో పెళ్లిల్లకు మేళం వాయిస్తుంటారు. ఈ క్రమంలో మొదటి చూపులోనే ఇందుమతి (కృతిక జయకుమార్)ను ఇష్టపడతాడు నరేష్. ఆమె కష్టాల్లో ఉన్నదని తెలిసి ఆమె కోసం రిస్క్ తీసుకునే క్రమంలో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో దెయ్యం ఉందని దాన్ని వదిలిస్తే 10 లక్షలు వస్తాయని అక్కడికి చేరుకుంటాడు. అక్కడ దెయ్యంతో నానా తిప్పలు పడ్డ నరేష్ అండ్ గ్యాంగ్ ఆ దెయ్యం ఎవరో కాదు తన మరదలు స్వప్న అని తెలుసుకుంటాడు. అసలు స్వప్న అలా ఎందుకు మారింది..? స్వప్న ఎందుకు ఆ ఇంట్లో జరగాల్సిన పెళ్లిని ఆపేస్తుంది..? అన్నది అసలు కథ.     

బ్యాండ్ మేళం నుండి భూత వైద్యునిగా నరేష్ నటన బాగుంది. తన మార్క్ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన నరేష్ తన రొటీన్ యాక్టింగ్ అనిపించినా సినిమాకు ఎంతకావాలో అలా చేశాడు. ఇక ఇందుమతిగా నటించిన కృతిక గ్లామర్ గా ఉంటూనే హీరోయిన్ గా పర్వాలేదు అన్నట్టు చేసింది. ఇక మౌర్యాని కూడా స్వప్న పాత్రలో ఆకట్టుకుంది. ముఖ్యంగా దెయ్యం పాత్రలో మౌర్యాని అదరగొట్టింది. రాజేంద్ర ప్రసాద్ కామెడీ కూడా వర్క్ అవుట్ అయ్యింది. చలపతి రావు, బ్రహ్మానందం కూడా నవ్వించే ప్రయత్నం చేశారు. హీరో పక్కన ఉంటూ కామెడీ పంచారు షకలక శంకర్, చమ్మక్ చంద్ర. ఇక మితగా వారంతా పాత్ర పరిధి మేరకు నటించారు.    

ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే ముందుగా డైరక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి తన డైరక్షన్ టాలెంట్ చూపించాడని చెప్పొచ్చు. అయితే కథ మరీ రొటీన్ గా అనిపించక మానదు. సినిమాలో సాయి కార్తిక్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ కొరియోగ్రఫీ కూడా బాగున్నాయి. కెమెరా మెన్ పనితనం పర్వాలేదు. డైమండ్ రత్నం డైలాగులు బాగున్నాయి. ఇక బోగవల్లి ప్రసాద్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నరేష్ సినిమాల్లో ఈ సినిమా కచ్చితంగా రిచ్ గా అనిపిస్తుంది. 

కొద్దిరోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ ఇంట్లో దెయ్యం నాకేం భయం మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇక నాగేశ్వర్ రెడ్డి ఆల్రెడీ ఈ ఇయర్ ఈడోరకం ఆడోరకంతో హిట్ కొట్టాడు ఆ హిట్ మేనియా కంటిన్యూ చేస్తాడు అనుకుంటే రొటీన్ కథతోనే వచ్చారు. హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ జానర్ లో రెండు వారాలకో సినిమా రిలీజ్ అవుతున్న ఈ సందర్భంలో సేం అదే కాన్సెప్ట్ తో వచ్చారు.  

సరే ఆ జానర్ అయినా పర్ఫెక్ట్ గా చేశారా అంటే అది లేదు. అది కూడా చాలా కామెడీగా అనిపిస్తుంది. రొటీన్ గా నడిపించే కథాంశాలతో నాగేశ్వర్ రెడ్డి తన పట్టు తప్పాడని చెప్పొచ్చు. సినిమా ఏమాత్రం లాజికల్ గా అనిపించదు. నరేష్, రాజేంద్ర ప్రసాద్ టైమింగ్ ను కూడా సినిమాలో సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. ఓ బంగ్లా చుట్టూ తిరిగే ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాలో హీరో హీరోయిన్ పాత్రలు చాలా వీక్ అయ్యాయని అనిపిస్తుంది.

పెళ్లికి రెడీ అయిన హీరోయిన్ ను రౌడిలు చంపడం దానికి ఆమె ప్రతీకారం తీర్చుకోవడం ఇలా చాలా సినిమాల్లో చూశాం. అయితే కొద్దిగా త్రిపుర సినిమాలా అనిపించక మానదు. ఇంట్లో దెయ్యం ఉండటం ఆ ఇళ్లు తెలియని వారు కొనుక్కుని ఇబ్బందులు పడటం లాంటి సినిమాలు చాలానే చూశాం కాబట్టి అంత పెద్దగా కిక్ అనిపించదు.   

ఉన్నంతలో నాగేశ్వర్ రెడ్డి కాస్త నవ్వులు పండించే ప్రయత్నం చేశాడు. స్క్రీన్ పై ఇంకాస్త గ్రిప్పింగ్ ఉండుంటే బాగుండేది. ఒక్కమాటలో చెప్పాలంటే కాస్త నవ్వుకుని వచ్చే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది కాని ఏదో ఉంది అనుకుని వెళ్తే మాత్రం నిరాశ తప్పదు.
Allari Naresh,Kruthika,G Nageswara Reddy,BVSN Prasad,Sai Karthikఇంట్లో దెయ్యం నాకేం భయం.. పాత సరుకుతో నవ్వించే ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: