కాస్టింగ్ ,మ్యూజిక్ , ఎంటర్టైన్మెంట్కాస్టింగ్ ,మ్యూజిక్ , ఎంటర్టైన్మెంట్స్లో నేరేషన్ , రొటీన్ క్లైమాక్స్

అర్జున్ (నిఖిల్) ఓ గ్రాఫిక్స్ కంపెనీలో పనిచేస్తుంటాడు.. తన స్నేహితుడు అన్న వెన్నెల కిశోర్ కు ట్రీట్మెంట్ కోసమని కేరళ మహిశాసుర మర్ధిని ఆలయానికి తీసుకెళ్తాడు. కిశోర్ కు ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో అక్కడే మూడు రోజులు స్టే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక అక్కడ అమలాగా హెబ్భా పటేల్ పరిచయమవుతుంది. అక్కడ ఉన్న త్రీ డేస్ ఆమెతో సరదాగా గడుపుతాడు. అయితే ఓ రోజు సడెన్ గా తనకు చెప్పకుండా వెళ్లిపోతుంది అమలా. ఇక అక్కడ నుండి హైదరాబాద్ వచ్చిన నిఖిల్ అమలా లానే ఉన్న నిత్యను చూసి షాక్ అవుతాడు. నిత్య అర్జున్ ఎవరో తెలియదన్నట్టు ప్రవర్తిస్తుంది. ఇక అసలు విషయం నిత్య అక్క ద్వారా విషయం తెలుస్తుంది. తనలోని ప్రవేశించిన ఆత్మను బయటకు పంపించేందుకే నిత్య కేరళ వెళ్తుంది. అంటే అమలాలా అర్జున్ ను ప్రేమించేది ఆత్మ అన్నమాట. ఇక ఆమెను వదిలి సావిత్రి (నందిత శ్వేత) రూపంలో అమలా అర్జున్ కు దగ్గరవుతుంది. ఈ క్రమంలో అమలా తనను ఎందుకింత ప్రేమిస్తుంది అన్న విషయం తెలియక సతమవుతాడు అర్జున్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు అమలాగా తన ప్రేమను వెత్తుకుంటూ వచ్చింది అమలా కాదు అర్జున్ ఒకప్పటి ప్రేమికురాలు అయేషా (అవికా గోర్) అని తెలుస్తుంది. అసలు అయెషా అర్జున్ కు ఎలా దూరమయ్యింది..? తన ఆత్మ అర్జున్ ను ఎందుకు కావాలనుకుంటుంది..? అనేది అసలు కథ.  

స్వామిరారా, కార్తికేయ సినిమాల విజయాన్ని అందుకున్న నిఖిల్ ఆ తర్వాత వచ్చిన శరంకరాభరంతో కాస్త నిరాశ పరచాడు. అయితే ఎక్కడికి పోతావు చిన్నవాడాలో మాత్రం నిఖిల్ వన్ మ్యాన్ షో చేశాడు. అర్జున్ గా నిఖిల్ సింప్లీ సూపర్బ్.. సినిమా సినిమాకు తన మెచ్యురిటీ పెరుగుతుందని చెప్పొచ్చు. సినిమాకు  ప్రతి సందర్భంలో నిఖిల్ మూడ్, తన యాక్టింగ్ అద్భుతం. ఇక హీరోయిన్ గా నటించిన హెబ్బా ఈసారి గ్లామర్ తోనే కాదు యాక్టింగ్ తో కూడా ఆకట్టుకుంది. అమలలా ఉన్నప్పుడు ఒకళా.. నిత్యాగా ఉన్నప్పుడు మరోలా హెబ్బా మంచి మార్కులు కొట్టేసింది. కేరళలో షూట్ చేసిన ఎపిసోడ్ లో హెబ్బా అందాలు హైలెట్ గా నిలుస్తాయి. ఇక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన నందిత శ్వేత కూడా అదరగొట్టింది. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే అవికా గోర్ అయితే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆమె పాత్ర చిన్నదే అయినా సినిమాలో అసలు హీరోయిన్ ఆమె అని చెప్పాలి. నిఖిల్ తో పాటుగా సత్య, వెన్నెల కిశోర్, సుదర్శన్ భాగానే నవ్వులు పండించారు.   

హర్రర్, కామెడీ, థ్రిల్లింగ్ ఇన్ని అంశాలను ఒకే సినిమాలో చూపించిన దర్శకుడు విఐ ఆనంద్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఓ లవ్ స్టోరీని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన విధానం బాగుంది. అయితే క్లైమాక్స్ మాత్రం కాస్త నిరాశ పరచేలా ఉంటుంది. ఇక సినిమాలో మరో ముఖ్య పాత్ర పోశించింది సినిమాటోగ్రఫీ. సాయి శ్రీ రామ్ కెమెరా వర్క్ బాగుంది.. కేరళలోని రొమాంటిక్ సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్ సినిమా ఫీల్ ను కంటిన్యూ అయ్యేలా చేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా రిచ్ గానే ఉన్నాయి. 

ఎక్కడికి పోతావు చిన్నవాడా అని వచ్చిన నిఖిల్. కథ కథనాల పరంగా ఒకే అనిపించాడు. అయితే దర్శకుడు ఆనంద్ ఈ కథకు ఎలాంటి ముగింపు ఇవ్వాలో కాస్త తడబడ్డట్టు అనిపిస్తుంది. సినిమా మొత్తం ఓ పక్క సస్పెస్ రన్ చేస్తూ కామెడీని బాగా పండించారు. సత్య వేసే పంచ్ లు ఆడియెన్స్ భలే ఎంజాయ్ చేస్తున్నారు. 

నిఖిల్ కొత్తగా కనిపించాడు.. క్యారక్టరైజేషన్ కూడా బాగుంది.. ముఖ్యంగా డైరక్టర్ సినిమా ట్రీట్ చేసిన విధానం కలరింగ్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. హెబ్బా అందాలు హైలెట్ అవగా మరోసారి యూత్ ను తన చూపూల్తో గాలెం వేసింది. ఇక నందిత శ్వేత సెకండ్ హాఫ్ లో తన విశ్వరూపం చూపించింది. తన ఫేస్ లో కళ్లు పెద్దవి కావడం చేత దెయ్యం పట్టిన పాత్రలో బాగా నటించింది.

ఓవరాల్ గా సినిమా అటు హర్రర్, థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ తో పాటుగా మంచి కామెడీని కూడా పడిస్తుంది. డిఫరెంట్ ప్రయత్నాలు చేస్తున్న కుర్ర హీరో నిఖిల్ చేసిన ఈ ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా మంచి ఫలితాన్నే ఇస్తుందని చెప్పొచ్చు.


Nikhil Siddharth,Nandita Swetha,Heebah Patel,VI Anand,P.V.Rao,Sekhar Chandraఎక్కడికి పోతావు చిన్నవాడా.. థ్రిల్లింగ్ సస్పెన్స్ లవ్ స్టోరీ

మరింత సమాచారం తెలుసుకోండి: