మోహన్ లాల్ నటన, ఫైట్స్ , సినిమాటోగ్రఫీమోహన్ లాల్ నటన, ఫైట్స్ , సినిమాటోగ్రఫీ స్లో సెకండ్ హాఫ్ , స్క్రీన్ ప్లే

కుమార్ (మోహన్ లాల్) తన గ్రామ ప్రజలను పులి బారి నుండి కాపడుతూ ఉంటాడు. చిన్నప్పుడే తండ్రిని పొట్టన పెట్టుకున్న పులిని చంపి మన్యం పులిగా పేరు తెచ్చుకుంటాడు కుమార్. ఈ క్రమంలో లారి డ్రైవర్ గా ఉన్న కుమార్ అనుకోకుండా ఓ డ్రగ్ కేసులో ఇరుక్కుంటాడు. అతను గ్రామం వదిలి సిటీకి చేరుకుంటాడు. డాడి గిరిజ (జగపతి బాబు) దగ్గర పనికి కుదిరిన కుమార్ అతనితో శతృత్వం పెంచుకుంటాడు. అసలు గిరిజ ఎవరు..? కుమార్ గిరిజతో ఎందుకు శతృత్వం పెరుగుతుంది. చివరకు కుమార్ తన సొంత ఊరు చేరుకుంటాడా అన్నది అసలు కథ.    

మన్యం పులిగా వచ్చిన మోహన్ లాల్ తన మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చాడు. ఇక గ్రామాన్ని కాపాడే మన్యం పులిగా మోహన్ లాల్ అదరగొట్టాడు. సినిమా మోహన్ లాల్ ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ అందిస్తుంది. కమిలిని ముఖర్జి డీ గ్లామరస్ రోల్ లో నటించి మెప్పించింది. విలన్ గా జగపతి బాబు పర్వాలేదు. కిశోర్ కూడా తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.  

వైశాఖ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మోహన్ లాల్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే మలయాళంలో 100 కోట్లు ప్రభంజనం సృష్టించాడేమో కాని తెలుగులో మాత్రం ఈ కథ చాలా సినిమాల్లో చూశామని అనిపిస్తుంది. దర్శకుడు కేవలం మోహన్ లాల్ కమర్షియల్ బిల్డప్ కోసమే తీసినట్టు అనిపిస్తుంది. ప్రతి సీన్ లో మోహన్ లాల్ ను చాలా ప్రత్యేకంగా చూపించాడు. దర్శకుడు సినిమా రాసుకున్న కథనంలో కాస్త ల్యాగ్ అయినట్టు తెలుస్తుంది. సినిమాలో కెమెరా వర్క్ చాలా బాగుంది. సినిమాను అంత అందంగా చిత్రీకరించడంలో దర్శకుడికి కెమెరామన్ చాలా సపోర్ట్ అందించాడు. గోపిసుందరం మ్యూజిక్ కూడా బాగుంది ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తన ప్రతిభ కనబరిచాడు. ఎడిటింగ్ ఓకే.. ప్రత్యేకంగా మాట్లాడాల్సిన వ్యక్తీ ఫైట్స్ చేసిన పీటర్ హెయిన్స్ గురించి సినిమాలో ప్రతి ఫైట్ చాలా బాగుంటుంది. పులితో ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ అయ్యేలా చేశారు. ఇక సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ గానే అవసరానికి తగ్గట్టు ఉన్నాయని చెప్పొచ్చు.      

మనమంతా, జనతా గ్యారేజ్ తో క్రేజ్ సంపాదించిన మోహన్ లాల్ మలయాళంలో సూపర్ హిట్ అయిన మన్యంపులిగా తెలుగులో వచ్చారు. అక్కడ మొదటి 100 కోట్ల సినిమాగా చరిత్ర సృష్టించిన ఈ మూవీ తెలుగులో మాత్రం రొటీన్ కథ కథనాలతో సాగినట్టే అనిపిస్తుంది. అక్కడ మోహన్ లాల్ స్టార్ హీరో కాబట్టి ఆయన్ను చూపించిన బల్డప్ సీన్స్ కు అక్కడ ప్రేక్షకులు వారెవా అని ఉండొచ్చు. అయితే ఇక్కడ ఆడియెన్స్ ఆ సీన్స్ కు అంతగా కనెక్ట్ అవలేరు.  

ఇక సినిమా మొత్తం తెలిసిన కథ కథనాలతోనే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అందులోనూ మొదటి భాగం కాస్త పర్వాలేదు అన్నట్టు ఉన్నా సెకండ్ హాఫ్ లో సినిమా మరి స్లో అవుతుంది. మళ్లీ క్లైమాక్స్ లో సినిమా మీద గ్రిప్ వచ్చేలా చేశాడు. ప్రతి సినిమాకు విలక్షణతో చేసే మోహన్ లాల్ ఈ సినిమా పక్కా కమర్షియల్ ఫార్ములాతో కనిపించినట్టు అనిపిస్తుంది.

కథ కథనాలు కూడా కొత్తగా ఏమి ఉండదు. తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు ఇలాంటి సినిమాలు చూసేసి ఉన్నారు. మోహన్ లాల్ నటన మీద ఉన్న ఇష్టంతో.. అడవిలో అద్భుతమైన లొకేషన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు.    
Mohanlal,Kamalini Mukherjee,Vysakh,Tomichan Mulakuppadam,Gopi Sunderమన్యం పులి వేట రొటీన్ గానే నడిచింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: