హెబ్భా పటేల్, మ్యూజిక్ ,సినిమాటోగ్రఫీహెబ్భా పటేల్, మ్యూజిక్ ,సినిమాటోగ్రఫీలాజిక్ లేకపోవడం, రొటీన్ కామెడీ

పెళ్లైన ఐదు సంవత్సరాలకు లేక లేక పుట్టిందని రాఘవరావు (రావు రమేష్) కూతురు పద్మావతి (హెబ్భా పటేల్) ను అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఆమె పుట్టిన వేళా విశేషం మంచిది కాదని ఆమె తనకి దూరం అవుతుందని కూతురికి తనకు అసలు పడదని అయ్యగారు చెబుతాడు. అయితే అప్పటి నుండి కూతురు ఏం చెప్పినా సరే అడ్డుచెప్పకుండా ఆమెకు నచ్చినట్టు ఉంటాడు రాఘవరావు. ఇంజినీరింగ్ ఫెయిల్ అయినా ఆమె కోసం జాబ్ సెట్ చేస్తాడు. పెళ్లి కోసం అమ్మ నాన్నల ఇబ్బందిని తప్పించుకునేందుకు ప్రేమిస్తున్నానని అబద్ధం చెబుతుంది పద్దు. ఇక లవర్ ను వెతికే వేటలో నాని (అశ్విన్), గోకుల్ (నోయెల్), నమో (పార్వతీశం) ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేసుకునే క్రమంలో ముగ్గురు చెప్పిన లవ్ ప్రపోజల్స్ ను ఓకే అంటుంది. పద్మావతి ఆ ముగ్గురిలో చివరకు ఎవరిని పెళ్లి చేసుకుంటుంది..? రాఘవరావుకి పద్దు ప్రేమ మ్యాటర్ తెలిసిందా..? అన్నది అసలు కథ.  

టైటిల్ లోనే నాన్నగా చేసిన రావు రమేష్ పాత్ర చాలా గొప్పగా ఉంటుందని చెప్పేశారు. అలానే తన మార్క్ నటంతో నాన్నగా అదరగొట్టాడు రావు రమేష్. కూతురిని అమితంగా ప్రేమించే తండ్రిగా రావు రమేష్ నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక ఆమె ప్రేమించిన ప్రియుళుగా నటించిన అశ్విన్, నియోల్, పార్వతీశం కూడా బాగానే చేశారు. సీరియస్ మోడ్ నుండి కామెడీ లోకి వచ్చే ప్రయత్నంలో అశ్విన్ చేసిన ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుంది. ఇక పార్వతీశం పంతులు గెటప్ థియేటర్లో నవ్వులు పండిస్తుంది. బాస్కెట్ బాల్ ప్లేయర్ గా నోయెల్ కూడా లీడ్ రోల్ లో మంచి నటన కనబరిచాడు. ఇక సినిమా అంతా తన మీద వేసుకుని చేసింది హెబ్భా పటేల్. ఓ కన్ ఫ్యూజ్డ్ క్యారక్టర్ లో ఆమె చూపించిన అభినయం బాగుంది. సినిమా మొత్తం తన భుజాన వేసుకుని అందానికి అందం.. అభినయానికి అభినయం అన్నట్టుగా హెబ్భా తన విశ్వరూపాన్ని చూపించింది.ఇక తేజశ్వి మడివాడా కూడా హెబ్భా ఫ్రెండ్ గా అదరగొట్టింది. ముఖ్యంగా ఆమె చేసిన కామెడీ బాగుంది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించాయి. 

సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే ముందుగా దర్శకుడు బండి భాస్కర్ గురించి మాట్లాడాలి. సినిమా కథ కథనాలన్ని పర్ఫెక్ట్ గా రావడంలో దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినదే అయితే ఇలాంటి సినిమాలు ఇదవరకు చూశాం అన్నట్టుగా స్క్రీన్ ప్లే ఉంటుంది. దర్శకుడు అన్ని విధాలుగా సక్సెస్ అయినట్టే అనిపించినా సినిమాలో కథ అనేది మాములుగా ఉంటుంది. ఇక సినిమాకు పనిచేసిన కెమెరామన్ చోటా కె నాయుడు తన పనితనంతో సినిమాను మరో స్టేజ్ కు తీసుకెళ్లారు. మ్యూజిక్ డైరక్టర్ శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన అన్ని పాటలు బాగున్నాయి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటింగ్ అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది అది ట్రిం చేసి ఉంటే బాగుండేది. బెక్కం వేణు గోపాల్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.  

కూతురి మీద అమితంగా ప్రేమ ఉండి ఆమె కోసం జీవితాలను పదవులను త్యాగం చేసి ఆమె ఎక్కడికెళ్లినా అక్కడ కూడా ఆమె క్షేమంగా ఉండేలా చూసుకునే తండ్రి.. ఇక తన లైఫ్ లో లవ్ మ్యారేజ్ అది తనకు నచ్చిన వాడితో జరగాలనుకునే అమ్మాయి.. అయితే స్వతహాగా ఆలోచించే అమ్మాయి తను తప్పు చేస్తే తండ్రి దగ్గర దాచేస్తుంది. అయినా సరే అది కనిపెట్టి ఆమెను బుజ్జగించుతాడు. చిన్నప్పుడు కాలికి దెబ్బ తగిలినప్పుడు చూపించే సీన్ కట్ చేస్తే ఆమె హైదరాబాద్ లో అన్ని వ్యవహారాలు నడిపించి మళ్లీ ఏం చేయనట్టు ఉంటుంది. చివరకు నాన్న మీకో విషయం చెప్పాలి నేనో తప్పు చేశా అని అంటే ఒకటి కాదు మూడు తప్పులు చేశావని అంటాడు. సో ఈ కంటిన్యూటీ అంతా బాగా మెయింటైన్ చేసిన దర్శకుడు సినిమా రొటీన్ కామెడీగా నడిపించాడు. 


కథ కథనం మీద గ్రిప్పింగ్ గానే నడిపించినా సినిమా అంతా రొటీన్ గానే నడుస్తుంది. క్యారక్టరైజేషన్ లో ఇంకాస్త క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అమ్మాయి ప్రేమించిన ముగ్గురు లవర్స్ ను తెచ్చి వారి ముందే తన కూతురి పెళ్లి జరిపించడం కొత్తగా ఉంది. భాస్కర్ అనుకున్న కథని అనుకున్నట్టుగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. కాకపోతే కథనం అంతా ఇదవరకు చూసిన సినిమాల్లానే అనిపిస్తుంది. అయితే అదేమి బోర్ కొట్టించదు కాని చూసిన సీన్స్ చూస్తున్నట్టుగానే ఉంటుంది.


ఇక చివర్లో రాజ్ తరుణ్ వచ్చి చెప్పిన డైలాగులు కాస్త బాగుంటాయి. ముగ్గురిని ప్రేమించిన అమ్మాయిని తను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పడం కన్నా ముగ్గురు జెన్యూన్ లవర్స్ ను దాటుకుని వచ్చిన అమ్మాయిని తను పెళ్లి చేసుకుంటున్నా అనే కిక్ బాగుంది అని చెప్పడం సినిమా మూల కథ చెప్పడం జరిగింది. తనలా కూతురిని ప్రేమగా చూసుకునే వరుడిని 25 సంవత్సరాల క్రితమే చూశానని చెప్పడం.. రాజ్ తరుణ్ కూడా నాకు పాతికేళ్ల క్రితమే క్లారిటీ వచ్చేసింది అని చెప్పే డైలాగులు బాగున్నాయి.


ఓవరాల్ గా సరదాగా సినిమాకు వెళ్దాం అనుకున్న వారికి ముఖ్యంగా యూత్ కు బాగా నచ్చే సినిమా అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు కాస్త కష్టమే.
Hebah Patel,Tejaswi Madivada,Noel Sean,Ashwin,Bhaskar Bandi,Bekkam Venugopal,Manasa,Mahalakshmi,Sekhar Chandraనాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్.. రొటీన్ కొట్టుడే బాసు..!

మరింత సమాచారం తెలుసుకోండి: