Swamy Ra Ra: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review

  నిఖిల్, స్వాతి జంటగా నటించిన సినిమా ‘స్వామిరారా..!’. కొంతకాలంగా విడుదలకు ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం...     చిత్రకథ :   హైదరాబాద్ లో ఉండే సూర్య (నిఖిల్) జేబులు కొట్టడంలో ఎక్స్ పర్ట్. తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఇదే వృత్తిగా జీవిస్తుంటాడు. ఒక సందర్భంలో అతనికి  జర్నలిజం చేస్తున్న స్వాతి (స్వాతి) పరిచయం అవుతుంది. కాగా, కేరళలోని తిరువనంతపురం ఆలయంలో స్వామి వారి సంపద లెక్కిస్తున్న సమయంలో అత్యంత విలువైన వినాయక విగ్రహాం చోరీకి గురవుతుంది. ఆ విగ్రహాం అనేక మంది చేతులు మారి స్వాతి వద్దకు చేరుతుంది. స్వాతికి తెలియకుండా సూర్య గ్యాంగ్ ఆ విగ్రహాన్ని అమ్ముకుంటారు. విగ్రహాం కోసం ప్రయత్నిస్తున్న దుర్గా ప్రసాద్ (రవిబాబు) స్వాతిని బంధిస్తారు. అమ్మివేసిన విగ్రహాన్ని సూర్య ఎలా తిరిగి సంపాదిస్తాడు..., స్వాతిని ఎలా విడిపిస్తాడు..... అనే అంశాలతో సినిమా సాగుతుంది.

advertisements


నటీనటుల ప్రతిభ : నిఖిల్ తన గత సినిమాల కంటే విభిన్నంగా కనిపిస్తాడు. స్టైల్ గా కనిపిస్తూ జేబులు కొట్టే వ్యక్తిగా మెప్పించాడు. అలాగే స్వాతితో కలిసి నటించే దృశ్యాల్లోనూ ఆకట్టుకుంటాడు. స్వాతి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ చిన్న పాత్రను కూడా తన సహాజశైలీలో నటించింది. రవిబాబు నటన కామెడీ విలనీకి ఎక్కువగాను, సీరియస్ విలనీకి తక్కువగా గాను ఉంది. మిగిలిన నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ సాధారణంగా ఉంది. నేపధ్య సంగీతం బావుంది. అలాగే సినిమాల్లో పాటలు కొంచెం కొత్త తరహాలో ఉంటాయి. ప్రస్తుతం వస్తున్న ఇతర సినిమాల్లోని పాటలు మాదిరిగా ఉండవు. అలాగే పాటల చిత్రీకరణ కూడా విభన్నంగా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో సంభాషణలు చాలా తక్కువ. అవి కూడా పెద్దగా ఆకట్టుకోవు. దర్శకత్వం విషయానికి వస్తే ఈ సినిమాకు కథ-మాటలు-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం బాధ్యతలు సమకూర్చిన సుధీర్ వర్మ వీటిల్లో ముఖ్యంగా స్ర్కీన్ ప్లే పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. సినిమా మొత్తం స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగుతుంది. సినిమా మొదటి సన్నివేశాన్ని కథలోని ఎక్కడో సందర్భంలోంచి తీసుకుని రావడం బాగుంది. అలాగే సినిమాలో 2,3 ట్వీస్టులు కూడా ఉంటాయి. సినిమా అక్కడక్కడ ఆకట్టుకున్నా సినిమా మొత్తం చాలా బోర్ కొట్టిస్తుంది. స్క్రీన్ ప్లే బాగున్నట్లు అనిపించినా స్లో నేరషన్ గా సాగుతుంది. అఖరుకి కొన్ని పాటలు కూడా స్లో నేరషన్ లో చూడ్డం చాలా ఇబ్బందిగా అనిపించింది. క్లైమాక్స్ ను కామెడీతో నింపాలని చూశాడు. కానీ ఆవి సరిగ్గా కుదరలేదు.         విశ్లేషణ : ఈ ‘స్వామి రారా..!’ ఏ జోనర్ కు చెందని సినిమా. దర్శకుడు కొత్త ప్రయోగం చేశాడు. స్క్రీన్ ప్లే తోనే ఈ సినిమాను నడపాలని చూసి మిగిలిన వాటిని గాలికి వదిలేశాడు. స్క్రీన్ ప్లే తప్ప సినిమాలో ఏమీ లేదు. పైగా స్క్రీన్ ప్లే కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. దర్శకుడు తనకు నచ్చినట్లు సినిమా తీసుకోవడంలో అతని ప్రతిభ కనిపించదు. ఇతరులు మెచ్చేటట్లు సినిమా తీస్తేనే అతని అసలైన ప్రతిభ బయటకి వస్తుంది. చివరగా :   ఏముందని ‘స్వామి’ రావాలి...?

More Articles on Swamy Ra Ra || Swamy Ra Ra Wallpapers || Swamy Ra Ra Videos

 

మరింత సమాచారం తెలుసుకోండి: