Sukumarudu: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review


సాయికుమార్ తనయుడు ఆది నటించిన సుకుమారుడు సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు ఆది. దీంతో కొంత ఈ సుకుమారుడు కోసం ఆసక్తిగా ఎదురుచూసారు. మరి ‘సుకుమారుడు’ ఎలా ఉన్నాడో చూద్దాం..!

చిత్రకథ :  సుకుమార్  [ఆది] అమెరికాలో వాళ్ల నాన్న దగ్గర పెరుగుతాడు. బెస్ట్ సిఇఓ గా అవార్డు గెలుచుకుంటాడు. డబ్బే ప్రధానంగా బావిస్తుంటాడు. కంపెనీ ప్రారంభించడానికి డబ్బు అవసరమై అమ్మమ్మ [శారద] ఆస్తి కోసం 
 ఇండియాకు వస్తాడు. అయితే ఇండియాకు వచ్చిన సుకుమార్ లో అనేక మార్పులు వస్తాయి. ప్రేమ విలువను తెలుసుకుంటాడు. మారిన సుకుమార్ తన గ్రామం కోసం... తనవారి కోసం.... ఏం చేశాడనేది  వెండితెర మీద చూడాలి.

advertisements


నటీనటుల ప్రతిభ :   ఆది చాలా చలాకీగా నటించాడు. డాన్సులు, ఫైట్లల్లో ఆకట్టుకుంటాడు. కామెడీ, సెంటిమెంట్ సీన్లనూ మెప్పించాడు. ఒక సన్నివేశంలో సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ తో ఆకట్టుకుంటాడు. నిషా ఆగర్వాల్ పాత్ర కు ప్రాధాన్యం లేదు. అమాయకత్వం, ప్రేమ నిండిన అమ్మమ్మగా శారద మెప్పించింది. రావూ రమేష్ పాత్ర నిడివి తక్కువే అయినా, పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటాడు. తనికెళ్ళ భరణి, జయ ప్రకాష్ రెడ్డి పాత్రలను రోటీన్ గా సాగాయి. సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కూడా సాధారణంగా ఉంది. కామెడీ బృందం పెద్ద సంఖ్యలోనే ఉన్నా వారి ప్రదర్శన మాత్రం నామమాత్రంగా ఉంది.

సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ బావుంది. సంగీతం సాధరణంగా ఉంది. గుర్తుపెట్టుకునే పాటలు లేవు. మాటలు ఆకట్టుకోవు. దర్శకత్వం విషయానికి వస్తే కుటుంబ విలువలు, అనుబంధాలను ప్రేక్షకులకు మరోసారి గుర్తు చెయ్యాలని దర్శకుడు అనుకున్నాడు. అందుకోసమే కథను, సన్నివేశాలను సృష్టించుకున్నాడు. అయితే ఎక్కడో తడబడ్డాడు. తాను చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా చెప్పలేకపోయాడు. దాదాపు మూడు గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టినా ప్రేక్షకులను తన సినిమాలో పాత్రలతో కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో చూసేవారికి బోర్ కొట్టింది. సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందా అని ఎదురుచూసే పరిస్థితి వచ్చింది.

విశ్లేషణ : యువహీరో ఆది-‘పిల్ల జమీందార్’ దర్శకుడు అశోక్ కలిసి పనిచేయడంతో ఈ ‘సుకుమారుడు’ కోసం కొంత మంది ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా ‘పిల్ల జమీందార్’ సినిమాలో కామెడీని, సెంటిమెంట్ ను సమపాళ్లలో కలిపి దర్శకుడుగా అశోక్ సక్సెస్ అయ్యాడు. దీంతో అతని తాజా సినిమా ‘సుకుమారుడు’ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సుకుమారుడు కూడా కుటుంబంధాలు, అప్యాయతలు అనే కథాంశంతో సాగుతుంది. సెంటిమెంట్ దృశ్యాలు, కామెడీ సీన్లు అక్కడక్కడ మెప్పించినా మొత్తం సినిమా నిరాశగా సాగుతుంది. కథ-సన్నివేశాలు బలంగా లేకపోవడంతో సినిమా బోర్ గా సాగుతుంది. పైగా దాదాపుగా ఇదే కథ, సీన్లతో గతంలో అనేక సినిమాలు వచ్చి ఉండటంతో ‘సుకుమారుడు’ సినిమా చూస్తున్నప్పుడు ఏదో పాత తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది.



చివరగా :   ‘సుకుమారుడు’ తో తలనొప్పి ఖాయం.


Review board:
 Cheruku Raja, Viswa Prasad, Shashikant.
Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Sukumarudu || Sukumarudu Wallpapers || Sukumarudu Videos

 

మరింత సమాచారం తెలుసుకోండి: