రాజేంద్రప్రసాద్, దివ్యవాణి లతో దర్శకుడు బాపు రూపొందించిన పెళ్లి పుస్తకం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో  మళ్లీ ఒక సినిమా రూపొందనుంది. ఈ కొత్త పెళ్లి పుస్తకం లో రాహుల్, రీతూ టైలర్ నటిస్తున్నారు. ఈ సినిమాకు రామకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ పెళ్లి పుస్తకం పాటలు తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చాయి. ఈ పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం...!

1) లైఫ్ ఈజ్ ఆల్ ఎబౌంట్..
రచన : కృష్ణ గీత
గానం : శేఖర్ చంద్ర

ఈ అల్బమ్ చిన్న బిట్ సాంగ్ తో ప్రారంభం అయ్యింది. ఈ బిట్ సాంగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. చిత్రంలో సందర్భనుసారం వచ్చే పాటగా అనిపిస్తుంది.

2) మమతే కురిసే....
రచన : వనమాలి
గానం : వేణు శ్రీరంగం
సంగీతం, సాహిత్యాలు ఆహ్లదంగా సాగుతూ ఈ పాట మెప్పిస్తుంది. గుర్తుంచుకోదగ్గ  మెలోడీ గా పాట ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పాటలో సంగీతం వీనుల విందుగా సాగుతుంది.

3) పిల్లా నీ సోకు...
రచన : కాశర్ల శ్యామ్
గానం : వడ్లకొండ అనిల్ కుమార్
ఈ అల్బమ్ లో హుషారైన పాట ఇది. సంగీతం, సాహిత్యం చాలా ఉషారుగా సాగాయి. జానపద గీతం తరహాలో సాగుతూ ఈ పాట మెప్పిస్తుంది. చిత్రీకరణతో ఈ పాట ఇంకా ఆకట్టుకోవడం ఖాయం.

4)  చెలి చెలి ఈ వేడి...
రచన : శ్రీమణి
గానం : సందీప్, శ్రీ సౌమ్య
ఈ అల్బమ్ ఉన్నలో ఏకైక యుగళగీతమిది. సాహిత్యం సాదారణంగా, గాయకుల గాత్రం, సంగీతంతో ఈ గీతం వినేవారిని ఆకట్టుకుంటుంది. తెలుగు, ఇంగ్లీష్ పదాలతో ఈ పాట వైరటీగా సాగుతుంది.

5) మేమే గార్ల్స్  ఆఫ్ ఎక్స్ జెన్...
రచన : దీప్తి సయనోర
గానం : దీప్తి సయనోర

ఈ పాట వెస్ర్టన్ స్టైల్ లో సాగింది. హీరోయిన్ పరిచయం గీతం లా అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఈ పాట ‘మంత్ర’లోని మహా.. మహా.. పాటను గుర్తుకుతెస్తుంది. కానీ, ఆకట్టుకునేవిధంగా ఈ గీతం సాగుతుంది.

తమ చిత్రానికి పెళ్లి పుస్తకం అనే అభిరుచి గల టైటిల్ పెట్టిన చిత్రయూనిట్ అంతే అభిరుచితో ఈ ఆల్బమ్ ను విడుదల చేసింది. ఆహ్లదంగా, వినిసొంపుగా సాగే పాటలు చిత్రకరణతో మరింతగా ఆదరణ పొందేటట్లుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: