Star cast: SiddharthHansika Motwani.
Producer: SubrahmanyamSuresh, Director: Sathya.

English Full Review

చిత్రకథ :

సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుమార్(హీరో సిద్దార్థ్) చిన్నప్పటి నుంచి మూడు సార్లు ప్రేమ విషయంలో ఫెయిల్ అయి, ప్రేమ, పెళ్లి అన్నా విముఖతతో ఉంటాడు. ఇంతలో కుమార్ పనిచేస్థున్న కంపెనీకే సంజన (హీరోయిన్ హన్సిక) ఉద్యోగిగా వస్థుంది. మొదటి చూపులోనే కుమార్ ఆమె ప్రేమలో పడతాడు, అంతలోనే సంజనను అదే కంపనీలో ఉన్న మరొకరు ప్రేమిస్థారు. కుమార్ సంజనను ప్రేమలో పడేయడం కోసం ప్రయత్నించే కథనంతో సినిమా సాగుతుంది. ఇంతకీ కుమార్ తన ప్రేమలో సక్సెస్ అయ్యాడా..? సంజనతో  తన సహఉద్యోగి ప్రేమాయణం ఏమైంది.. ? అనేది వెండితెరపై చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ :

హీరో సిద్దార్థ్ నటన ఫరవాలేదు, కాని అతని ఇమేజికి తగ్గ పాత్ర, నటనను నిరూపించుకునేందుకు సినిమా కథ, సన్నివేశాలు అవకాశం కల్పించలేదు. హీరోయిన్ హన్సిక కూడా పాత్రకు తగ్గట్టుగా నటించినా ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం ఇచ్చే సీన్లు లేకపోవడంతో పూర్థిస్థాయి హన్సిక అని నటనలో అనిపించుకోలేకపోయింది. మరో ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మానందం ఈసినిమాలో హైలెట్. హీరోయిన్, హీరోలకంటే కూడా ఎక్కువ పాత్ర బ్రహ్మిదే, బ్రహ్మానందం వచ్చినప్పటినుంచి సినిమా చివరిదాక ఉండి తనదైన శైలిలో నవ్వించడంతోనే సినిమాకు ప్రాణం వచ్చింది. ఈసినిమాలో రాణా, సమంతలను అతిథి పాత్రల్లో చూపించినా రాణా ది ఎఫెక్ట్ గా లేదు, సమంత సీన్ మాత్రం ఫరవాలేదు.

సాంకేతిక వర్గం పనితీరు :

డైరెక్షన్ చెత్తగా ఉంది అని మాత్రం అనలేమన్న మాట. అలా అని సినిమాను కరెక్టుగా డైరెక్ట్ చేసాడని మాత్రం చెప్పలేని పరిస్థితి. సినిమాను మొదలు పెట్టి కథనంతా నడిపించి ముగించాడు తప్ప డైరెక్షన్ ప్రత్యేకతలేమి లేవు. పాటలు రెండు వినడానికి బాగున్నా సినిమాలో చూడడానికి బాగాలేవు, డ్యాన్స్, సంగీతం గూర్చి ఎంత మాట్లాడకపోతే అంత మంచిది. స్ర్కీన్ ప్లే, ఫోటొగ్రఫి కూడా సేమ్ టు సేమ్. ఫైట్స్ లేనే లేవు.

హైలెట్స్ : 

హీరో హీరోయిన్ ను ప్రేమించాను అని డైరెక్టుగా చెప్పకపోవడం సీన్, అలాగే హీరోయిన్ కూడా హీరో తో ప్రేమించానని నేరుగా చెప్పకనే చెప్పిన సీన్,  బ్రహ్మానందం, సిద్దార్థ్ మద్య నడిచిన కామెడి సీన్స్.

విశ్లేషణ : 

సినిమా కథ అందరు ఊహించే ప్రేమకథ, అమ్మాయిని అబ్బాయి ప్రేమలో పడేయడానికి ట్రిక్కులు తప్ప మరొక దారిలేదని చూపించిన కథ. హీరో హీరోయిన్ మొదటిచూపులో ప్రేమలో పడతాడే కాని, ప్రేమంటేనే గిట్టని హీరో ఎందుకు, ఎలా ప్రేమలో పడ్డాడు అన్నది చూపించకపోవడంతో కథ దెబ్బ తింది. బ్రహ్మానందం, సిద్దార్థ్ మద్య నడిచిన కామెడి సీన్లు తప్ప మరో ఎంటర్ టైన్ మెంట్ లేదు. పోని ఏదైనా నీతిని చెప్పాడా అంటే అదీలేదు. సినిమా మొదలుపెట్టాం, ముగించాం అనిపించినా కాస్థా కామెడి వల్ల సినిమా గుడ్ అనిపించుకోక పోయినా చెత్త అనిపించుకోకపోవడం కొసమెరుపు.

చివరగా : 

ప్రేమ అనే గొప్ప అంశమే ప్రధానంగా తీసుకుని దాని గొప్పదనాన్ని చూపించక పోయినా, కేవలం ట్రిక్కులతో ప్రేమను పొందవచ్చు అని చెప్పడం నేటి యువతరానికి మంచిది కాదేమో అనిపించింది.

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Something Something | Something Something Wallpapers | Something Something Videos

మరింత సమాచారం తెలుసుకోండి: