బాలకృష్ణ, శ్రీయ నటన ,మ్యూజిక్, సినిమాటోగ్రఫీబాలకృష్ణ, శ్రీయ నటన ,మ్యూజిక్, సినిమాటోగ్రఫీఎడిటింగ్ , అక్కడక్కడ స్లో అవడం
భరత ఖండం అంతా ఒకే రాజ్యం.. ఒకే రాజు పరిపాలిస్తే అంటూ ఐదేళ్లప్పుడే అమ్మ మీద ఒట్టు పెట్టిన శాతకర్ణి పద్దెనిమిదేళ్లకే పట్టాభిషేకుడై దక్షిణ భారత దేశమంతా తన ఏలుతుంటాడు. ఇక ఉత్తర భారతం మీదకు దండయాత్ర చేసే క్రమంలో తన కొడుకుని ప్రాణం సైతం లెక్క చేయకుండా యుద్ధానికి వెళ్తాడు. భరత ఖండం మొత్తం తన ఆదీనంలోకి రాగా పరాయి దేశపు శత్రువులను కూడా తరిమికొడతాడు. శాలివాహన శఖం నాటి ఈ కథతోనే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తెరకెక్కించబడింది. 

శాతకర్ణిగా బాలయ్య నటన అద్భుతం. తను మాత్రమే చేయగల పాత్ర అని చెప్పేయొచ్చు. శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చేశాడు. చరిత్ర కథే అయినా సరే బాలయ్య చేత పలికించిన డైలాగులు మాత్రం చాలా గొప్పగా ఉన్నాయి. ఇక వశిష్ట దేవిగా శ్రీయా తన మార్క్ నటనతో ఆకట్టుకుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో సీనియర్ నటిగా శ్రీయనే ఈ పాత్రకు ఎందుకు తీసుకున్నారో తెలుస్తుంది. గౌతమిగా చేసిన హేమమాలిని క్యారక్టర్ కూడా సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. పాత్ర నిడివి తక్కువే అయినా ఆమె పలికించిన అభినయం అద్భుతం. శివ రాజ్ కుమార్ గెస్ట్ రోల్ లో అలరించారు.  

శాతకర్ణి సినిమాకు హండ్రెడ్ పర్సెంట్ క్రిష్ కష్టం కనిపిస్తుంది. చరిత్ర సినిమాగా చెప్పే సాహసం చేసినప్పుడు దానికి ఎన్నో పరిమితులు ఉంటాయి. కథ కథనాల విషయంలో దర్శకుడు క్రిష్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పిరియాడికల్ మూవీస్ అంటే అంతే కాని అక్కడక్కడ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. శాతకర్ణి మ్యూజిక్ అందించిన చిరంతన్ భట్ తన బెస్ట్ మ్యూజిక్ అందించాడు. బహుపరాక్ సాంగ్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. జ్ఞానశేఖర్ కెమెరా వర్క్ బాగుంది. శాతకర్ణి సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్ గురించి. సాయి మాధవ్ బుర్రా కథకు తగ్గ మాటలను అద్భుతంగా రాశారు. రాజీవ్ రెడ్డి, సాయి బాబుల ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కనిపించలేదు.   

గౌతమిపుత్ర శాతకర్ణి.. కథ అనుకోగానే బాలయ్యకు చెప్పడం ఆయన వందవ సినిమాగా ఈ కథ ఓకే చేయడం జరిగింది. అసలు ఈ కథని తెరకెక్కించాలని క్రిష్ కు ఎందుకు అనిపించిందో కాని ముందునుండి చెప్పుకొస్తున్న ప్రతి తెలుగువాడు తెలుసుకోవాల్సిన గర్వపడే కథ ఇది. సినిమాలో శాతకర్ణి వీరత్వం చూపించడమే కాదు అమ్మ మీద ఉన్న ప్రేమను చూపించాడు క్రిష్. తను అనుకున్న కథ దానికి అనుగుణంగా కథనం.. వేసుకున్న బడ్జెట్ ఇలా బేరూజు వేసుకుని అనుకున్న విధంగా కాంప్రమైజ్ కాకుండా చేశాడు క్రిష్.

సినిమాలో ముఖ్యంగా శాతకర్ణి ఇంటెన్షన్ ను డైలాగుల పరంగా ఆడియెన్స్ కు చేరవేయడం.. తాను కన్న కల అంటూ ఐదేళ్ల నాటి కలను తల్లికిచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు శాతకర్ణి దక్షిణ భారత దేశాన్ని కాదు.. అఖండ భారతాన్ని జయిస్తాడు. తెలుగు జాతి గొప్పదనం చెప్పదలచుకున్న క్రిష్ ఈ కథ ఎంచుకోవడానికి గట్స్ ఉండాలి. అయితే కథ కథనాలన్ని ఆలోచించి రిసీవ్ చేసుకుంటే ఓకే కాని రెగ్యులర్ మాస్ మసాల సినిమాలు చూసే ఆడియెన్స్ కు ఇది నచ్చకపోవచ్చు.

క్రిష్ ప్రమోషన్స్ లో కూడా ఆడియెన్స్ మైండ్ సెట్ చేసే ప్రయత్నం చేసినా కాస్త కథనం మందగించినట్టు అనిపించి ఓ వర్గం ప్రేక్షకులకు బోర్ అనిపిస్తుంది. సినిమా ఓపెనింగ్ ఇంటర్వెల్.. క్లైమాక్స్ మాత్రం అందరికి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. భారీ యుద్ధ సన్నివేశాలతో తెలుగు సినిమా స్థాయి మరోసారి ప్రపంచ సినిమాకు ఏమాత్రం తక్కువ కాదు అని చెప్పాడు క్రిష్. 


ఇక శాతకర్ణి ఎండ్ కార్డ్ లో ముని ముని ముని ముత్తాతల కథ అని తెలుగు జాతి కథ అయిన శాతకర్ణి కథ.. మన కథ.. ప్రతి తెలుగువాడి కథ అని చెప్పే క్రిష్ వాయిస్ ఓవర్ తన ఇంటెన్సిటీ ఏంటో తెలియచేస్తుంది. మొత్తానికి ఓ శాతకర్ణి ఓ గొప్ప ప్రయత్నం అని ప్రత్యేకంగా చెప్పాల్సిందే. కమర్షియల్ గా ఎంత సక్సెస్ అవుతుంది అన్నది చెప్పలేం. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ఆలోచన థోరణి మారుతుంది.. కథను కథనాన్ని చరిత్రను తెలుసుకునేందుకు ఉరకలు వేస్తున్నారు. మరి ఈ ప్రయత్నంలో మన ముందుకు వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.





Nandamuri Balakrishna,Shriya Saran,Krish,Saibabu Jagarlamudi,Y. Rajeev Reddy,Suhasini Panguluri,Chirantan Bhattసాహో.. గౌతమిపుత్ర శాతకర్ణి సాహో..!

మరింత సమాచారం తెలుసుకోండి: