సూర్య నటన ,డైలాగ్స్ , సినిమాటోగ్రఫీ సూర్య నటన ,డైలాగ్స్ , సినిమాటోగ్రఫీ సాంగ్స్ , రొటీన్ స్టోరీ

ఆంధ్ర ప్రదేశ్ లో పవర్ ఫుల్ పోలీస్ గా ఉన్న నరసింహం (సూర్య)కర్ణాటక హోం మంత్రి కావాలని డిప్యుటేషన్ మీద మంగుళూరికి రప్పిస్తాడు. అక్కడకు ఓ కమీషనర్ మర్డర్ కేస్ విచారిస్తున్న నరసింహంకు ఊహించని విషయాలు తెలుస్తాయి. ఆ కేస్ కు విఠల్ (అనూప్ సింగ్) అనే ఓ బడా బిజినెస్ మ్యాన్ హస్తం ఉందని తెలుసుకుంటాడు. అసలు విఠల్ ఎవరు..? అతను ఎక్కడి నుండి తన హవా నడిపిస్తున్నాడు..? నర సింహం ఎలా అతన్ని పట్టుకున్నాడు అన్నది అసలు కథ.    

సూర్య సింగం సీరీస్ లు కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి హిట్ సాధించాయి. సింగం మొదటి పార్ట్ తెలుగులో యముడిగా మంచి కలక్షన్ సాధించాయి. సూర్య నటనే హైలెట్ గా నిలిచిన ఈ సినిమాలో మరోసారి మాస్ మసాలా హీరోగా కనిపించి అలరించాడు సూర్య. ఇక సింగం-3 లో స్పెషల్ గా శృతి హాసన్ గురించి చెప్పాలి. అందం అభినయం రెండింటితో అదరగొట్టింది శృతి హాసన్. అనుష్క పాత్ర చాలా చిన్నదే.. అయినా సరే స్వీటీ కూడా బాగానే ఉంది. కాని ఆమె అభిమానులను మాత్రం నిరాశ పరచింది. సినిమాలో హీరో ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాడో విలన్ గా నటించిన అనూప్ సింగ్ కూడా బాగా నటించాడు.   

హరి డైరెక్ట్ చేసిన యముడు 1-2 ల్లానే ఇది కూడా స్క్రీన్ ప్లే పరుగెడుతూనే ఉంటుంది. ఒక్క సీన్ ఒక్క చోట ఉండదంటే నమ్మాలి. రేసీ స్క్రీన్ ప్లే ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసింది. అయితే కథలో ఏమాత్రం కొత్తదనం అనిపించదు. దర్శకుడు హరి ఆ విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సింది. హారీస్ జైరాజ్ మ్యూజిక్ ఓకే.. కెమెరా మెన్ పనితనం బాగుంది.. ఎడిటింగ్ బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గానే ఉన్నాయి.

యముడు, యముడు-2 గా వచ్చి సక్సెస్ అందుకున్న సూర్య మరోసారి సింగం-3 గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాలో సూర్య ఎగ్రెసివ్ నెస్ అందరికి నచ్చుతుంది. ఓ పోలీస్ ఇలా పనిచేస్తే అసలు జనాలకు ఎలాంటి హాని ఉండదు అనిపిస్తుంది. అయితే స్క్రీన్ ప్లే రేసీగా పరుగెడుతున్నా కథలో కొత్తదనం కనిపించలేదు.


యముడు-2 లో లానే ఫారిన్ విలన్ తో హీరో చేసే యుద్ధమే ఈ సినిమా అనిపిస్తుంది. అయితే కొన్ని కొన్ని సీన్స్ మాత్రం సినిమాకు ఎక్కడికో తీసుకెళ్లాయి. ముఖ్యంగా హీరో సూర్య నటన సినిమాకే హైలెట్. దేవి కాకుండా హారీస్ జైరాజ్ మ్యూజిక్ కాస్త తేడా వచ్చినట్టు అనిపిస్తుంది. 


ఇక సినిమాలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేద్దామని వచ్చే కామెడీ సీన్స్ కూడా అంతగా నవ్వించవు.. కావాలని పెట్టినట్టుగా కామెడీ సీన్స్ అనిపిస్తాయి. శృతి హాసన్ అందాలతో ఆకట్టుకోగా అనుష్క పాత్ర చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఓవరాల్ గా మాస్ ఆడియెన్స్ కు ఇదో మంచి విందు భోజనం లాంటి సినిమా అవుతుంది. అయితే కథ మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది.


Suriya,Anushka Shetty,Shruti Haasan,Hari,K. E. Gnanavel Raja,Dhaval Jayantilal Gada,Harris Jayarajఇది మస్తు మాస్ సింగం-3..!

మరింత సమాచారం తెలుసుకోండి: