అక్కినేని నాగార్జున నటన. మ్యూజిక్, కెమెరా వర్క్ అక్కినేని నాగార్జున నటన. మ్యూజిక్, కెమెరా వర్క్అక్కడక్కడ స్లో అవడం
చిన్ననాటి నుండి దేవుడిని చూడాలనే కోరికతో ఉన్న రామ్ (అక్కినేని నాగార్జున) పద్మానంద స్వామి (సాయి కుమార్) దగ్గర శిష్యరికం చేస్తాడు. దేవుడిని చూడాలంటే ఓకారంతో తపస్సు చేయాలనే ఆలోచనతో రామ్ ముందుకు సాగగా సాక్ష్యాత్తు ఆ దేవుడే బాలుడు రూపంలో వచ్చి రామ్ తపస్సుని భగ్నం చేస్తాడు. వచ్చింది వేంకటేశుడే అని తెలుసుకోలేని రామ్ ఆ బాలుడిని వేల్లిపోమ్మంటాడు. ఆ తర్వాత వచ్చింది ఏడుకొండల దేవుడే అని తెలుసుకుని తిరుమల చేరుకుంటాడు.  తిరుమల చేరుకున్న రామ్ ఎలా హతిరాం బావాజిగా మారాడు అన్నది ఓం నమో వెంకటేశాయ కథ. హతిరాం బాబా జీవితం ఎలా ముగిసింది అతనికి శ్రీనివాసుడు ఏయే వరాలిచ్చాడు అన్నది అసలు కథ.      



హతీరామ్ బాబాగా అక్కినేని నాగార్జున మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు. ప్రస్తుతం కాలంలో ఇలాంటి భక్తిరస చిత్రాలను తీసి మెప్పించాలంటే అది కేవలం నాగార్జున వల్లే అవుతుందని మరోసారి నిరూపించాడు. వెంకటేశ్వరుడిగా సౌరబ్ జైన్ బాగా ఆకట్టుకున్నాడు. ఇక కృష్ణమ్మగా అనుష్క మరోసారి అద్భుతమైన పాత్రలో కనిపించింది. అతిధి పాత్రల్లో జగపతి బాబు, సంపత్ అలరించారు. అధికారిగా రావు రమేష్ పర్వాలేదు. ఇక మిగతా వారంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.


ఓం నమో వెంకటేశాయ టేక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే.. ముందుగా దర్శకుడు కె రాఘవేంద్ర రావు గురించి చెప్పాలి. ఇలాంటి సినిమాలను తీయాలంటే అది కేవలం తన వల్లే సాధ్యం అన్నట్టు సినిమా అద్భుతంగా తెరకెక్కించారు దర్శకేంద్రుడు. ఎంచుకున్న కథ దాన్ని నడిపించిన విధానం అంతా బాగుంది. అయితే అక్కడక్కడ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. ఇక సినిమాలో ముఖ్య పాత్ర పోశించాయి కీరవాణి అందించిన సాంగ్స్. సందర్భానికి తగ్గట్టుగా ఇచ్చిన మ్యూజిక్ మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఎస్.గోపాల్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. సినిమాకు గ్రాఫిక్ వర్క్ కూడా చాలా నీట్ గా చేశారు. ఇక మహేష్ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టారు.


అన్నమయ్యతో మొదలైన నాగార్జున రాఘవేంద్ర రావుల భక్తిరస చిత్రాల హవా ఓం నమో వెంకటేశాయ దాకా కొనసాగుతుంది. తీసుకున్న కథను ఎలా చెబితే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో అలాంటి కథనంతో తీసి మెప్పించారు. హతిరాం బాబా చిన్న తనం నుండి అతను తిరుమల చేరి అక్కడ పనులు చక్కపెట్టడం వరకు అన్ని కుదిరాయి. 


సినిమా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండు కథ పరంగా బాగా నడిపించినా అక్కడక్క కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమాలో పాటలు మంచి మూడ్ క్రియేట్ చేశాయి. దేవుడి కన్నా భక్తుడు గొప్పవాడు అన్న సూక్తిని చాటుతూ తిరుమలేశుని చేత సజీవ దహనం చేయించబడిన హతిరాం బాబా జీవిత కథ అంతా పర్ఫెక్ట్ గా చెప్పారని చెప్పొచ్చు. 


అయితే కథలో చెప్పిన శ్రీ వెంకటేశ్వర చరితం, వరాహ దర్శనం, నిత్య కళ్యాణం లాంటి విషయాల పట్ల ఇంకాస్త పట్టు సాధించి ఉండే బాగుండేది. గ్రాఫిక్స్ పనిలో దర్శకేంద్రుడు సక్సెస్ అవుతాడు.. ఈ సినిమాలో కూడా అంతే సినిమా మొత్తం చాలా నీట్ గా ఎఫెక్ట్స్ వచ్చేలా చేశారు. సినిమా భక్తిరస చిత్రం కాబట్టి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంత ఆశించే అవకాశం ఉండదు. సినిమాలో బ్రహ్మానందం, పృధ్వి లాంటి వారిని పెట్టినా అంతగా వర్క్ అవుట్ అవలేదు. అక్కడక్కడ అన్నమయ్య సినిమా ఫ్లేవర్ టచ్ అయినట్టు కనిపిస్తుంది. 
రెగ్యులర్ సినిమాలను చూసి ఎంజాయ్ చేసే వారికి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియదు కాని ఓ గొప్ప చరిత్రని తెలుసుకోవాలని వచ్చే ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగిస్తుంది ఓం నమో వెంకటేశాయ.


Nagarjuna Akkineni,Anushka Shetty,Pragya Jaiswal,K. Raghavendra Rao,A. Mahesh Reddy,M. M. Keeravaniఓం నమో వెంకటేశాయ నాగ్ మరో మంచి ప్రయత్నం

మరింత సమాచారం తెలుసుకోండి: