రాజ్ తరుణ్ నటన , పృధ్వి కామెడీ , స్క్రీన్ ప్లే రాజ్ తరుణ్ నటన , పృధ్వి కామెడీ , స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ స్లో అవడం

కిట్టు (రాజ్ తరుణ్) ఓ గ్యారేజ్ నడుపుతుంటాడు.. మొదటి చూపులోనే జానకి (అను ఇమ్మాన్యుయెల్)ను చూసి లవ్ లో పడిన కిట్టు డబ్బు కోసం సడేన్ గా కుక్కల దొంగగా మారతాడు. ఇదే విషయం తెలుసుకున్న జానకి కిట్టుని అపార్ధం చేసుకుంటుంది. ఇంతలోనే సిటిలో ఉన్న ఓ పెద్ద రౌడి అర్బజ్ ఖాన్ జానకిని కిడ్నాప్ చేస్తాడు. జానకిని ఆ కిడ్నాపర్ దగ్గర నుండి విడిపించే ప్రయత్నంలో కిట్టు ఏం చేశాడు అన్నది అసలు కథ.  

కిట్టుగా రాజ్ తరుణ్ నటన సూపర్ అనిపించేశాడు. పాత్రకు కావాల్సిన ఫన్ క్రియేట్ చేస్తూ సినిమా నడిపించారు. ఇక హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ కూడా జానకిగా బాగా నటించింది. సినిమాలో ఇద్దరి పెయిర్ బాగుంది. ఇక విలన్ గా చేసిన అర్బజ్ ఖాన్ తనవరకు బాగానే చేశాడు. అయితే దర్శకుడు వంశీ కృష్ణ ఆ క్యారక్టర్ ముగింపు సరిగా ఇవ్వలేదు. థర్టీ ఇయర్స్ పృధ్వి సినిమా చివర్లో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వేలా చేశాడు. హీరో ఫ్రెండ్స్ గా ప్రవీణ్, సుదర్శన్ లు చేసిన కామెడీ కూడా బాగానే ఉంది. 

వంశీ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆధ్యంత కామెడీ ఎంటర్టైనర్ గా సాగించాడు. శ్రీకాంత్ విస్సా కథను దర్శకుడు తెరకెక్కించిన విధానం ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా కథనంలో దర్శకుడి ప్రతిభ కనబడింది. మొదటి భాగం కాస్త అటు ఇటుగా ఉన్నా సెకండ్ హాఫ్ సినిమాను పైకి లేపారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. అనీల్ సుంకర నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ఎంత పెట్టాలో అంత పెట్టేసి రిచ్ గా వచ్చేలా చేశారు.

కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త కుక్క్లని ఎత్తుకెళ్లే హీరో పాత్ర అంటే ముందు కాస్త డౌట్ పడేలా చేసినా సందర్భాన్ని తెరకెక్కించిన విధానం కన్విన్స్ అయ్యేలా చేసింది. ఇక కథ పాతదే అన్న భావన వచ్చినా కథనం ఆకట్టుకునేలా చేశాడు దర్శకుడు వంశీ కృష్ణ. ఫస్ట్ హాఫ్ కాస్త అటు ఇటుగా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం బాగా వచ్చింది.   

కథ నడిపిస్తూనే ఇన్నర్ లో క్లూ వదిలిన డైరక్టర్ ఇంటర్వల్.. ప్రీ క్లైమాక్స్.. క్లైమాక్స్ లో పట్టు సాధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కథలో ఇన్వాల్వ్ చేస్తూ పెట్టిన పృధ్వి కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. కచ్చితంగా పృధ్వికి ఇదో మంచి పేరు తెచ్చిపెట్టే పాత్ర అవుతుంది. ఇక హీరో రాజ్ తరుణ్ ఎనర్జీ కూడా అదే రేంజ్ లో ఉంది.

అనుకున్న కథను అనుకున్నట్టుగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన దర్శకుడు వంశీ కృష్ణను మెచ్చుకోవచ్చు. మొదటి భాగంలో కూడా స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సినిమాకు టీం ఎఫర్ట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఈడోరకం ఆడోరకం తో హిట్ అందుకున్న రాజ్ ఆ హిట్ మేనియా కంటిన్యూ చేస్తూ కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్తతో కూడా మరో హిట్ అందుకున్నట్టే. ఎంటర్టైన్ మోడ్ లో నడిచే ఈ సినిమా ఆడియెన్స్ కు నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
Raj Tarun,Anu Emmanuel,Vamsi Krishna Naidu,Ramabrahmam Sunkara,Anup Rubensఈ కిట్టు గాడు కామెడీతో గట్టేక్కేశాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: