కథ, అంజలి నటన, సెకండ్ హాఫ్, కథ, అంజలి నటన, సెకండ్ హాఫ్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, రొటీన్ కామెడీ
పి.హెచ్.డి పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న చిత్ర (అంజలి) లేడీస్ హాస్టల్ లో ఉంటుంది. హాస్టల్ లో ఉన్న తోటి అమ్మాయిలతో అసభ్యకరంగా ఒక రకమైన వ్యామోహంతో ప్రవర్తించి అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది చిత్ర. చిత్ర అలా ఎందుకు ప్రవర్తిస్తుందో ఎవరికి అర్ధం కాదు. ఇక చిత్ర అసలు ఇలా ఎందుకు చేస్తుందో అని కనిపెట్టే పనిలో షణ్ముఖ (జయ ప్రకాశ్) ప్రయత్నాలు చేస్తుంటాడు. చిత్ర విచిత్ర వేశాలకు షణ్ముఖ ఆశ్చర్యానికి గురవుతాడు. రోజు ఎవరో హత్య చేయబడిన కల వస్తుందని చిత్ర షణ్ముఖతో చెబుతుంది కాని ఆమె మాటలను నమ్మడు షణ్ముఖ. ఇక ట్రీట్ మెంట్ పేరు చెప్పి అమెరికా వెళ్తుంది చిత్ర. అయితే తనలో రవివర్మ (దీపక్) ఆత్మ ప్రవేశించిందని తెలుస్తుంది. అసలు రవివర్మ ఎవరు..? చిత్ర శరీరంలోకి ఎందుకు వచ్చాడు..? చిత్ర రవివర్మల మధ్య సంబంధం ఏంటి అన్నది అసలు కథ.              



చిత్రాంగదలో టైటిల్ రోల్ ప్లే చేసింది అంజలి. సినిమా మొత్తం తానే నడిపించింది.. తన నటనతో అదరగొట్టే ప్రయత్నం చేసిన అంజలి తన వరకు సక్సెస్ అయ్యింది కాని తనని ప్రతిసారి దెయ్యంగా చూపించడంలో విఫలమయ్యాడు దర్శకుడు అశోక్. ఇక కథలో షణ్ముఖ పాత్ర కూడా చాలా బాగా వచ్చింది. దీపక్ పాత్ర ఉన్నది కొద్దిసేపే అయినా బాగా చేశాడు. ఇక మిగతా పాత్రలన్ని తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. 



హర్రర్ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రాంగద పాయింట్ కాస్త కొత్తదే తీసుకున్నట్టు అనిపించినా సినిమా దర్శకుడు అశోక్ నడిపించిన తీరు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. రొటీన్ స్క్రీన్ ప్లేతోనే నడిపించేశాడు. బాలిరెడ్డి సినిమాటోగ్రఫీ అక్కడక్కడ బాగా అనిపిస్తుంది. మ్యూజిక్ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి. ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. 


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత అంజలికి తెలుగులో ఓ రేంజ్ క్రేజ్ వచ్చింది. తెలుగు అమ్మాయిగా అంజలి నటన అందరిని ఆకట్టుకుంటుంది. అయితే గీతాంజలితో హర్రర్ సినిమాలకు తను ఎంత పర్ఫెక్టో నిరూపించుకున్న అంజలి చిత్రాంగదతో వచ్చింది. అమెరికాలో హత్య చేయబడ్డ దీపక్ ఆత్మ రూపంలో చిత్ర శరీరంలో చేరతాడు. అసలు అతనెందుకు ఆమె శరీరంలో చేరాడు చేయాల్సి పనులేంటి అన్నది అసలు కథ.


కథ కొత్తగా ఉన్నా సరే కథనంలో మాత్రం రెగ్యులర్ ఫార్ములానే నడిపించి బోర్ కొట్టించాడు డైరక్టర్ అశోక్. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే సినిమా మరోలా ఉండేది.. కామెడీ.. హర్రర్.. సస్పెన్స్ ఈ మూడు అంశాలు ఉండేలా జాగ్రత్తపడ్డా సరే అవేమి సినిమాను నిలబెట్టలేకపోయాయి.  


ముఖ్యంగా అసలు కథ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది. మొదటి భాగం మొత్తం ఏదో నడిపించాలి కాబట్టి నడిపించాడనే భావన వస్తుంది. సినిమాలో అంజలి నటన బాగానే ఆకట్టుకునేలా ఉన్నా ఆమెను చూపించిన ప్రతిసారి దెయ్యంగా భయపెట్టే ప్రయత్నం మాత్రం బెడిసికొట్టింది. లాస్ట్ ఇయర్ సంచలన విజయాలను అందుకున్న హర్రర్ కామెడీ జానర్ లో ఈ ఇయర్ వచ్చిన మొదటి సినిమా ఇదే కావొచ్చు. అయితే ఆడియెన్స్ ను సీట్స్ లో కూర్చోబెట్టేంత పకడ్బందీ స్క్రీన్ ప్లే మాత్రం కుదరలేదని చెప్పాలి. 


పిల్లజమిందార్, సుకుమార్ లాంటి కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తీసిన అశోక్ చేసిన ఈ చిత్రాంగద సినిమా ప్రేక్షకులకు చేరువడంలో కాస్త వెనుకపడ్డది. అయితే సినిమా మాత్రం అంజలి నటన కోసం వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. 



Anjali,Sakshi Gulati,Ashok G,Gangapatnam Sridhar,Selvaganeshఅంజలి ఆశలను నెరవేర్చలేని 'చిత్రాంగద'..!

మరింత సమాచారం తెలుసుకోండి: