కథ, సెకండ్ హాఫ్ కథ, సెకండ్ హాఫ్ మ్యూజిక్ , స్క్రీన్ ప్లే ,ఫస్ట్ హాఫ్ ఎపిసోడ్స్

లోన్ రికవెరీ ఏజెంట్ గా పనిచేస్తున్న గౌతం (సాయి రాం శంకర్) మొదటి చూపులోనే స్వేచ్చ (రేష్మి మీనన్)ను చూడటం ప్రేమించడం చేస్తాడు. తన బిహేవియర్ తో స్వేచ్చని ఇంప్రేస్ చేసి ఆమెను కూడా ప్రేమలో దించుతాడు. సాఫీగా సాగుతున్న ఇతని లైఫ్ లో అనుకోకుండా ఓ అపరిచితుడు వస్తాడు. అతను కనబడకుండా గౌతంను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. తను ప్రేమించిన స్వేచ్చను కిడ్నాప్ చేసి తనకు కావాల్సిన పనులన్ని చేయించుకుంటాడు అతను. అసలు ఆ కిడ్నాపర్ టార్గెట్ ఏంటి..? అతని నుండి స్వేచ్చని కాపాడుకున్నాడా..? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అన్నది అసలు కథ. 

స్టార్ డైరక్టర్ పూరి తమ్ముడైనా సరే సాయి రాం శంకర్ ఇప్పటికి హీరోగా నిలబెట్టే సినిమా రాలేదంటే నమ్మాలి. కథల విషయంలో మనోడు కాస్త డిఫరెంట్ గా ఆలోచించినా ఏది వర్క్ అవుట్ కావట్లేదు. కాని నేనోరకం మాత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా తీర్చిదిద్దారు. సినిమాలో సాయి రాం శంకర్ నటన ఇదవరకు కన్నా బెటర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో బాగా చేశాడు. ఇక హీరోయిన రేష్మి మీనన్ పర్వాలేదు. ముఖ్యంగా సినిమాలో విలన్ రోల్ చేసిన శరత్ కుమార్ సినిమాకు హైలెట్ గా నిలిచాడు. ఇక కమెడియన్స్ కూడా కాసేపు నవ్వించే ప్రయత్నం చేశారు.

సుదర్శన్ శైలేంద్ర తెరకెక్కించిన నేనోరకం సినిమా డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. కథ కథనాల్లో కాస్త కొత్తదనం చూపించాడు. అయితే ఇంటర్వల్, సెకండ్ హాఫ్ మీద దృష్టి పెట్టినట్టు మొదటి సగం మీద కూడా పెట్టి ఉంటే బాగుండేది. మహిత్ నారాయణ సంగీతం సోసోగానే ఉంది. కెమెరా వర్క్ ఓకే. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ కాస్త ట్రిం చేయాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. 

క్రేజీ డైరక్టర్ పూరి తమ్ముడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి రాం శంకర్ కెరియర్ లో హిట్ కోసం తపించిపోతున్నాడు. నేనోరకం సినిమా కథ కాస్త కొత్తగా ఉన్నా కథనంలో దర్శకుడి పొరపాటు వల్ల సినిమా మీద ఎఫెక్ట్ పడింది. మొదటి భాగం మొత్తం హీరోయిన్ ను ఇంప్రెస్ చేసే సన్నివేశాలనే నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు.  

అసలు ట్విస్ట్ సెకండ్ హాఫ్ లోనే మొదలవడం.. సినిమా కాన్సెప్ట్ మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉండటం వల్ల సినిమా మొదటి భాగం కాస్త బోర్ అనిపించక తప్పదు. ఇక విలనిజం కోసం శరత్ కుమార్ లాంటి సినియర్ నటుడిని వాడుకున్నారు. కాని అతని క్యారక్టరైజేషన్ కూడా అనుకున్నంత వర్క్ అవుట్ అవలేదు.
రెగ్యులర్ సినిమాలు ముఖ్యంగా సాయి రాం శంకర్ సినిమాల కన్నా కాస్త బెటర్ గానే

నేనోరకం సినిమా అనిపించినా మొదటి భాగంలోని లోపాలు కాస్త సినిమాకు మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సగటు సిని అభిమానికి ఓసారి చూసే సినిమాగా నేనోరకం ఉంటుంది. 
Sairam Shankar,Reshmi Menon,Sudharshan Salendra,Depa Shareekhanth,Mahith Narayan'నేనోరకం' అంతగా ఇంప్రెస్ చేయలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: