సినిమాటోగ్రఫీ , ప్రోడక్షన్ వాల్యూస్సినిమాటోగ్రఫీ , ప్రోడక్షన్ వాల్యూస్కథ, కథనం , డైరక్షన్ , మ్యూజిక్

అమ్మనాన్నలతో పాటు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అక్కకి తోడుగా ఉండే కుర్రాడు శ్రీవిష్ణు. అక్కకి పెళ్లి జరుగుతుందని షాపింగ్ చేసే క్రమంలో గుడి దగ్గర ఉగ్రవాదుల బాంబ్ పేలుల్లలో కుటుంబాన్ని కోల్పోతాడు. అప్పటిదాకా అందరు ఉన్న హీరో ఆ నిమిషం అనాధ అవుతాడు. అసలు దీనికి కారణం ఎవరు అని తెలుసుకునే క్రమంలో ఆ ఉగ్రవాదులు దిగిన లాడ్జ్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ దొరికిన క్లూతో ఒక్కొక్కరిని పట్టుకుని ఫైనల్ గా వారిని మట్టుపెడతాడు. 

అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో లీడ్ రోల్ చేసిన శ్రీవిష్ణు మా అబ్బాయితో హీరోగా సోలో ఎంట్రీ ఇచ్చాడు. సినిమా మొత్తం తన మీదే నడుస్తుంది. హీరో క్యారక్టరైజేషన్ డైరక్టర్ చెప్పినట్టుగా చేశాడు. హీరోయిన్ చిత్ర శుక్ల పర్వాలేదు. నటనతో పాటు గ్లామర్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మిగతా వారంతా పాత్రల పరిధి మేరకు నటించారు.   

సినిమా దర్శకుడు కుమార్ వట్టి రొటీన్ కథతోనే వచ్చినట్టు అనిపిస్తుంది. మా అబ్బాయి అని టైటిల్ పెట్టి ఓ రివెంజ్ డ్రామా తీశాడు. అంతేకాదు ఉగ్రవాదుల నెట్వర్క్ ఓ సాధారణ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కనిపెట్టడం అనేది మంచి థాట్ అయినా దాన్ని అంతగా ప్రభావితం చేయలేకపోయాడు. థమ శ్యామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్ పై శ్రీవిష్ణు అందంగా కనిపించాడు. ఇక ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  

ఫ్యామిలీ మొత్తం ఓ బాంబ్ బ్లాస్ట్ లో కోల్పోయిన హీరో అసలు ఆ బ్లాస్ట్ ఎవరు చేశారు అన్నది కనిపెట్టి వారిని హతమార్చడమే మా అబ్బాయి సినిమా కథ. ఇలాంటి కథలు సినిమాలు సంవత్సరానికి ఎన్నో వస్తుంటాయి. కొత్తగా చెప్పిన పాయింట్ అని చెప్పలేం కాని సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ మంచి ఆలోచనా పరుడై తెలివితేటలతో విలన్లను పట్టుకోవడం కాత మెచ్చుకోదగినదే.

సినిమా ఎంటర్టైన్ చేసే విధానంలో కూడా లోటు పాట్లు ఉన్నాయి. దర్శకుడు చెప్పే కథని సాగదీసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాకు ఎడిటింగ్ ఏమాత్రం బాగాలేదు. చాలా చోట్ల కంటిన్యుటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. మొదటి పార్ట్ తో పోల్చుకుంటే సెకండ్ పార్ట్ పర్వాలేదు అనిపించినా.. అప్పటికే జరగాల్సిన నష్ట జరిగిపోయింది.

కుమార్ వట్టి ప్రొడక్షన్ వాల్యూస్ ను బాగా వాడుకున్నాడు. కెమెరా వర్క్ బాగుంది. కాని ఇన్ని ఉన్నా బలమైన కథ కథనాలు లేకపోవడంతో సినిమా నిరాశ పరచక తప్పదు. 
Sree Vishnu,Chitra Shukla,Kumar Vatti,Balaga Prakash Rao,Suresh Bobbili'మా అబ్బాయి' రొటీన్ సినిమా..!

మరింత సమాచారం తెలుసుకోండి: