ఇషాన్ నటన ,టేకింగ్ , సినిమాటోగ్రఫీఇషాన్ నటన ,టేకింగ్ , సినిమాటోగ్రఫీకథ, కథనం , రొటీన్ డ్రామా
పోకిరిగా తిరిగే హీరో ఇషాన్.. కమీషనర్ చెల్లిని అంజలి (ఎంజెలా)ను ప్రేమిస్తాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ సుబ్బరాజుకి ఇచ్చి చెల్లి ఎంగేజ్ మెంట్ ప్లాన్ చేస్తాడు కమీషనర్. అక్కడ హీరో వెళ్లి గొడవ చేస్తాడు. ఆ గొడవలో ఓ పోలీస్ కుటుంబం రోడ్డున పడుతుంది. ఇషాన్ ఆవేషంలో రెండు కాళ్లు విరిగేలా కొడతాడు. అందుకే ఆ కుటుంబానికి ఆసరగా నిలబడాలని అనుకుంటాడు. జైల్లో ఉన్న హీరోని చూసేందుకు వచ్చిన అంజలి తన ప్రేమ అంతా నటన అని చెబుతుంది. అప్పటి నుండి ఆడవాళ్ల మీద అసహ్యం పెంచుకుంటాడు ఇషాన్. ఇక ఆసరగా ఉన్న కానిస్టేబుల్ కు ఓ చెల్లి ఉంటుంది. ఆమె పేరు అంజలి (మన్నారా చోప్రా) ఆమెను ఓ సైకో (అనూప్ సింగ్ టాకూర్) వెంటాడుతుంటాడు. పోలీసులు ఆ సైకో కోసం వెతుకుతారు అసలు ఆ సైకోకి అంజలి సంబంధం ఏంటి..? ఎందుకు అంజలి కోసం ఆ సైకో వస్తాడు..? హీరో ఆ సైకోని ఎలా ఎదుర్కున్నాడు..? అంజలి ఇషాన్ ను ప్రేమిస్తుందా..? అన్నది అసలు కథ. 
తొలిపరిచయమే అయినా ఇషాన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఓ మాస్ హీరోకి ఉండాల్సిన లక్షణాలన్ని ఉన్నాయి. అయితే క్యారక్టరైజేషన్ విషయంలో ఇంకాస్త పరిణితితో చేయాల్సి ఉంది. మొదటి సినిమాకు ఈ మాత్రం చేశాడంటే గొప్ప విషయమే. ఇక హీరోయిన్స్ ఎంజెలా కొద్దిసేపే అయినా అలరించింది. ఇక మన్నారా చోప్రా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పూరి టేకింగ్ లో హీరోయిన్స్ డిఫరెంట్ గా కనిపిస్తారు. మన్నారా చోప్రా ఇదవరకు రెండు సినిమాలు చేసినా ఈ సినిమాలో చాలా అందంగా అనిపిస్తుంది. ఇక ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా సుబ్బరాజు ఆకట్టుకున్నాడు. సైకో పాత్రలో అనూప్ సింగ్ ఠాకూర్ ఇంప్రెస్ చేశాడు. తన పాత్రకు తాను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.   

పూరి డైరక్షన్ లో వచ్చిన ఈ రోగ్ మరోసారి తన రొటీన్ కమర్షియల్ ఫార్మెట్ లో సాగింది. కథ కథనాలేవి ఆడియెన్స్ కు ఇన్వాల్వ్ అయ్యేలా చేయవు. వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి ఈ రోగ్ తో కూడా ఆకట్టుకోలేకపోయాడు. సినిమా స్టైలిష్ గా తీయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ఇక సునీల్ కశ్యప్ సంగీతం యావరేజ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.  

పూరి మార్క్ సినిమా అంటే కచ్చితంగా కమర్షియల్ అంశాలు ఉండాల్సిందే. అదే క్రమంలో వచ్చిన రోగ్ కూడా పక్కా పూరి మార్క్ సినిమాగా ఉంటుంది. కథ కథనాల్లో మాత్రం రొటీన్ పంధానే కొనసాగించాడు పూరి. మొదటి భాగం కాస్త రేసీగా ఉన్నట్టు అనిపించినా సెకండ్ హాఫ్ బోర్ కొట్టించేశాడు.

అసలే కొత్త హీరో కాని ఆ హీరో ఇమేజ్ కు మించిన క్యారక్టరైజేషన్ అనిపిస్తుంది. పరిచయం లేని ఫేస్ కాబట్టి కాస్త ఇబ్బంది పడతారు. పాటలు, ఫైట్స్ అన్ని తన గత సినిమాల్లానే రచ్చ చేసేశాడు పూరి. కాని మరోసారి పదునైన కథ చెప్పడంలో మాత్రం విఫలమయ్యాడు. హీరో క్యారక్టరైజేషన్ బిల్డప్ షాట్స్ మీద పెట్టిన దృష్టి కథ మీద పెట్టి ఉంటే బాగుండేది. 

సిటీలో పోలీసులు అంతా ఉండగా అంజలి అన్న పేరు మీద చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాల్ల దాకా కిడ్నాప్ అవుతుంటే పోలీసులు చూస్తూ ఉండటం పెద్ద కామెడీగా ఉంటుంది. అసలు పూరి దృష్టిలో పోలీసులు మరి అంత కామెడీగా కనిపించడం ఏంటో అర్ధం కాదు. ఇక ఆలితో చేయించిన బెగ్గింగ్ కామెడీ కూడా కొత్తగా ఏమి అనిపించదు.

ఓవరాల్ గా పూరి రోగ్ మరోసారి పూరి పాత సినిమాలను చూసినట్టే ఉంటుంది. హీరో పోకిరిగా ఉండటం అది చూసి హీరోయిన్ ఇష్టపడటం ఇదంతా తన గత సినిమాల పద్ధతిలోనే చాలా చూపించాడు. పూరి డైరక్షన్ టేకింగ్ నచ్చే ప్రేక్షకులు ఓసారి చూస్తారేమో కాని సగటు ప్రేక్షకుడు పెదవి విరిచేయడం ఖాయం.
Ishaan,Mannara Chopra,Angela Krislinzki,Puri Jagannadh,C. R. Manohar,C. R. Gopi, Sunil Kashyap'రోగ్' పూరి మార్క్ రొటీన్ మూవీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: