నయనతార నటన , ఇంటర్వెల్ సీన్ , మ్యూజిక్నయనతార నటన , ఇంటర్వెల్ సీన్ , మ్యూజిక్లాజిక్ లేని సీన్స్ , కథ , కథనం
పారిజాతం (నయనతార) ట్యాక్సీ డ్రైవర్ అయిన తండ్రి వైకుంఠం (తంబి రామయ్య)తో కలిసి జీవనం సాగిస్తుంటుంది. తన అత్తకు పోటెగా కాల్ ట్యాక్సీ నడపాలని నిర్ణయించుకున్న పారిజాతం ఓ పాత కారు కొంటుంది. ఆ కార్ తీసుకున్న నాటి నుండి పారిజాతంకు వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. ఆ కారులో ఏదో ఆత్మ ఉంటుందని తెలుసుకుంటుంది పారిజాతం. దాని చివరి కోరిక తీరే దాకా ఆ కారుని విడిచి వెళ్లదు. అసలు కారులో ఉన్న ఆత్మ ఎవరిది..? అది ఎందుకు పారిజాతం వద్దకు చేరింది..? పారిజాతం ఈ ప్రాబ్లంను ఎలా సాల్వ్ చేసుకుంది అన్నది అసలు కథ.
డోర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతర మరోసారి తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తమిళంలో తనకున్న స్పెషల్ క్రేజ్ కు తగ్గ పాత్రలనే ఎంచుకుంటూ సినిమా మొత్తం తానే నడిపించే కథాంశంగా డోరలో సూపర్ యాక్టింగ్ చేసింది నయనతార. సినిమా మొత్తం తన భుజాల మీద వేసుకుని నడిపించింది నయన్. ఇక తండ్రిగా నటించిన తంబి రామయ్య కూడా బాగా చేశాడు. పోలీస్ ఆఫీసర్ గా హరీష్ ఉత్తమన్ కూడా మంచి నటనతో ఇంప్రెస్ చేశాడు. ఇక మిగతా పాత్రలన్ని తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.

సినిమా గురించి చెప్పుకునే ముఖ్యంగా దాస్ రామదాస్ కథ అంతగా ఇంప్రెసివ్ గా లేదు. డోర పేరుగల కుక్క ఆత్మ పగ పట్టడం అనేది అంత మెప్పించదగినదిగా ఉండదు. ఇక కథనంలో కూడా అంత గ్రిప్పింగ్ సాధించలేదు డైరక్టర్. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. గోపి కృష్ణ ఎడిటింగ్ ఓకే. వివేక్ శివ, సోలోమన్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత వరకు అవసరమో అంత పెట్టేశారు. 

సినిమా గురించి చెప్పుకునే ముఖ్యంగా దాస్ రామదాస్ కథ అంతగా ఇంప్రెసివ్ గా లేదు. డోర పేరుగల కుక్క ఆత్మ పగ పట్టడం అనేది అంత మెప్పించదగినదిగా ఉండదు. ఇక కథనంలో కూడా అంత గ్రిప్పింగ్ సాధించలేదు డైరక్టర్. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. గోపి కృష్ణ ఎడిటింగ్ ఓకే. వివేక్ శివ, సోలోమన్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత వరకు అవసరమో అంత పెట్టేశారు.  
డోర అంటూ ఓ కుక్క ఆత్మ కథాంశంగా వచ్చిన ఈ సినిమా మొత్తం నయనతారం తన భుజాల మీద నడిపించింది. సినిమా కథ దాస్ రామస్వామి కేవలం ఒకే ఒక సిట్టింగ్ లో నయనతారని ఒప్పించాడంటే ఆమెకు ఏవిధంగా నేరేట్ చేశాడో కాని సినిమా మాత్రం అంతగా బాగా వర్క్ అవుట్ అవ్వలేదు. 

ఇక సినిమాలో తమిళ నేటివిటీ స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి భాగం అంతా స్లోగా నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ లో కాస్త పట్టు సాధించేలా చేశాడు. ఇక మళ్లీ సెకండ్ హాఫ్ లో మళ్లీ డౌన్ అవుతూ వచ్చాడు. సినిమాకు ఎంచుకున్న సబ్జెక్ట్ ఇంకాస్త క్యూరియాసిటీతో చెప్పే ప్రయత్నం చేసే బాగుండేది.

ఇక కమర్షియల్ సినిమాలకు దూరంగా నయనతార కు ఉన్న క్రేజ్ తో ఇలాంటి స్పెషల్ మూవీస్ వస్తున్నాయి. అయితే ఇలాంటి సినిమాలకు తెలుగులో అంతగా వర్క్ అవుట్ అవ్వవు. లాస్ట్ ఇయర్ వచ్చిన మయూరి సస్పెన్స్ థ్రిల్లర్ అయితే ఆ కథ కథనాలు తెలుగు ప్రేక్షకులకు నచ్చాయి. అందుకే మయూరి ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది. 

ఇక డోర్ విషయానికొస్తే కథ కథనంలో చాలా లాజిక్ కు మిస్ అయ్యాడు దర్శకుడు. ఫైనల్ గా చెప్పలంటే నయనతార నటన ఆమె చేసే కొత్త ప్రయత్నాలు మెచ్చే వారికి సినిమా నచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ అంశాలను ఆశించి వెళ్తే సినిమా నచ్చదు.
Nayanthara,Doss Ramasamy,Hitesh Jhabak,Vivek Siva Mervin 'డోర' కేవలం నయనతార కోసమే..!

మరింత సమాచారం తెలుసుకోండి: