Star castSuriyaAnushka ShettyHansika Motwani
ProducerS.Lakshman KumarDirectorHari.

Singam (Yamudu 2) - English Full Review


సింగం రివ్యూ: చిత్రకథ
యముడు చిత్రం ఎక్కడయితే అయిపోయిందో ఈ చిత్రం అక్కడ నుండి ప్రారంభమవుతుంది మొదటి  భాగంలో ప్రకాష్ రాజ్ ని పట్టుకున్న నరసింహం(సూర్య) ఉద్యోగానికి రాజీనామా చేసి హోం మినిస్టర్ కోరిక మేరకు అండర్ కవర్ ఆపరేషన్ లో కాకినాడలోని  ఒక స్కూల్ లో ఎన్ సి సి ఇన్ ఛార్జ్ గా పని చేస్తుంటాడు. అక్కడే కాకినాడలో భాయ్ (ముకేష్ రుషి) మరియు త్యాగరాజు (రెహమాన్) ఆయుధాల అక్రమ రావణ చేస్తున్నట్టు తెలిసుకున్న నరసింహం  డి ఎస్ పీ ఇన్ ఛార్జ్ తీసుకొని భాయ్ మరియు త్యాగరాజు అక్రమాలను మట్టుబెట్టాలని ప్రయత్నిస్తుండగా నరసింహకి భాయ్  వెపన్స్ రవాణా చెయ్యట్లేదు అని అతను మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నాడని తెలుస్తుంది అంతే కాకుండా అతని వెనకాల ఇంటర్నేషనల్ డాన్ అయిన డాని(ఆఫ్రికన్) ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇది కాకుండా నరసింహం కి మరో కీలకమయిన విషయం కూడా తెలుస్తుంది. నరసింహం కి దివ్య(హన్సిక) కి సంబంధం ఏంటి? నరిసింహం జీవితంలో కావ్య(అనుష్క) ఏమయింది? నరసింహం కి తెలిసిన ఆ నిజం ఏంటి ? ఇంటర్నేషనల్ డాన్ అయిన డాని ని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ ......

సింగం రివ్యూ: నటీనటుల ప్రతిభ
పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రానికి సింగం సూర్య అని చెప్పుకోవాలి మొత్తం చిత్రాన్ని తన భుజాల మీద వేసుకొని వన్ మాన్ ఆర్మీల కనిపించారు. తన ఎనర్జీ మరియు పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ తో తనదయిన శైలిలో సూర్య తన పాత్రకు ప్రాణం పోశారు, పోలీస్ పాత్ర అంటే ఇలా ఉండాలి అనిపించేలా అయన నటన ఉంది. అయన డైలాగ్ డెలివరీ మరియు బాడి లాంగ్వేజ్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. అనుష్క "యముడు" చిత్రంలో పాత్రనే ఇందులో కూడా కొనసాగించింది అందులో లానే ఇందులో కూడా నటించడానికి  ఏమి లేక పక్క పాత్రల నటనకి సహకరిస్తూ గడిపేసింది. హన్సిక చేసింది ముఖ్య పాత్రే అయిన తక్కువ సేపు తెర మీద కనిపించడంతో చిత్రం చివరికి వచ్చేసరికి హన్సిక పాత్ర గుర్తుండదు. ఇక తొలిసారి ఐటం సాంగ్ చేసిన అంజలి పాటకు తగ్గ న్యాయం చేసి ముందు బెంచ్ వాళ్ళకి కనువిందు  కలిగించింది.

తమిళ కామెడి తో వివేక్ మరియు సంతానం అక్కడక్కడ నవ్వించడానికి ప్రయత్నించారు కొన్ని చోట్ల కామెడీ బాగానే ఉన్నా కొన్ని చోట్ల మరీ తమిళ వాసన రావడం తెలుగు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించే విషయమే, ఇక ముఖేష్ రుషి, రెహ్మాన్ ఇతర నటీనటులు తెర మీద కనిపిస్తున్నాం కాబట్టి నటించాలి అన్నట్టు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. చిత్రంలో ముఖ్య ప్రతినాయకుడు అయిన డాని పాత్ర చిత్రానికి ముఖ్యమే అయిన చిత్రంలో ఎక్కువసేపు కనిపించడు.  

సింగం రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు
మాస్ ని అలరించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు కాని నిజానికి కథని చెప్పే విషయంలో దర్శకుడు జస్ట్ పాస్ మార్కులు సంపాదించుకున్నాడు. ఏ విషయాన్నీ అయిన తెగేదాక లాగాకూడదు అన్న విషయాన్నీ మరిచిపోయి, చిత్రంలో చాలా సన్నివేశాలను సాగదీసి ప్రేక్షకులకు విసుగు పుట్టించారు.  స్క్రీన్ ప్లే వేగంగా సాగినా కూడా సగటు ప్రేక్షకుడికి నెక్స్ట్ సీన్ ఏంటో తెలిసిపోవడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది . చిత్రంలో కథ మొత్తం మొదటి అర్ధ భాగంలోనే చెప్పేయడంతో రెండవ భాగంలో చెప్పడానికి ఏం లేకపోయినా ఏదో ఒకటి చెప్పాలన్న దర్శకుడి ప్రయత్నం ఇట్టే కనబడిపోతుంది. చివరగా క్లైమాక్స్ లో అప్పటి వరకు డాన్ క్యారెక్టర్ ని పవర్ ఫుల్ గ చూపించిన దర్శకుడు ఒక్కసారిగా సిల్లీ గా ముగించేయడం విచిత్రంగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అనుష్కనే కాకుండా చిత్రంలో పలు ప్రదేశాలను చాలా అందంగా చిత్రీకరించారు. 

దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం లో పాటలు పరవలేదనిపించగా కొన్ని సన్నివేశాలకు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దారుణంగా ఉంది, అవి సన్నివేశాలను ఎలివేట్ చెయ్యడానికి బదులుగా సీన్ లో ఉన్న ఇంటెన్సిటీ ని కిల్ చేసింది. లేని కథకు ముఖ్యమని అనుకోని వదిలేసారో లేదా దర్శకుడు కోరడం వల్లనో తెలియట్లేదు కాని చాలా సన్నివేశాలు ఎడిటింగ్ నుండి ఎస్కేప్ అయ్యి తెర మీద దర్శనం ఇచ్చాయి. చిత్రంలో సూర్య నటన తరువాత చెప్పుకోదగ్గ అంశం ఏదయినా ఉందంటే ఫైట్స్. మాస్ ని చాలా ఆకట్టుకునేలా ఫైట్స్ ని తెరకెక్కించారు.  నిర్మాతలు ఎక్కడా రాజి పడకుండా చిత్రాన్ని తెరకెక్కించారు.

సింగం రివ్యూ: హైలెట్స్
  • సూర్య అందించిన ఎనెర్జటిక్ పెర్ఫార్మన్స్
  • వేగంగా సాగే కథనం
  • యాక్షన్ ఎపిసోడ్స్
  • అనుష్క గ్లామర్
  • సినిమాటోగ్రఫీ

సింగం రివ్యూ: డ్రా బాక్స్
  • కథ బలంగా లేకపోవడం
  • క్లైమాక్స్ సిల్లీ గా ముగించేయడం
  • చిత్ర నిడివి అధికంగా ఉండటం( దాదాపుగా మూడు గంటలు)

సింగం రివ్యూ: విశ్లేషణ
సింగం(యముడు) కి కొనసాగింపు గా వచ్చిన ఈ చిత్రం సూర్య నటనకి షో రీల్ లా అనిపిస్తుంది చిత్రం అంత సూర్య చుట్టూ తిరగడం, సూర్య పాత్ర ఉన్నంత పవర్ ఫుల్ గా విలన్ పాత్ర లేకపోవడంతో "వార్ వన్ సైడ్" అయిపోయింది. సో చిత్రం మొదలయిన దగ్గరనుండి చివరి శుభం కార్డ్ వరకు సూర్య ఆధిపత్యమే కొనసాగడంతో సగటు ప్రేక్షకుడికి "కిక్" లేకుండా పోయింది. స్క్రీన్ ప్లే ఎంత వేగంగా ఉన్నా, మూడు గంటల పాటు ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం కాస్త ఇబ్బందికరమయిన విషయమే. చెప్పుకోడానికి చాలా పాత్రలు ఉన్నా, దర్శకుడి దృష్టి మొత్తం సూర్య పాత్రా మీదనే పెట్టాడు. తనదయిన శైలి లో సూర్య ఆకట్టుకోగా తనది ఇదే శైలి అని దర్శకుడు హరి మరోసారి నిరూపించారు. మాస్ చిత్రంలో కథానాయిక పాత్రలు ఇలానే ఉంటాయని అనుష్క మరియు హన్సికల పాత్రలు చూస్తే అర్ధం అయిపోతాయి. ఫ్యామిలి పాత్రలలో నటించడమే కాదు ఐటెం సాంగ్ లో డాన్స్ కూడా చెయ్యగలను అని అంజలి నిరూపించింది. మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ఫెయిల్ అయ్యారు. నిర్మాతలు ఎంత ఖర్చు పెట్టినా ఇది "అరవ" డబ్బింగ్ సినిమా అన్నవిషయాన్నీ గుర్తు రాకుండా చెయ్యలేకపోయారు. ఇంకాస్త బలమయిన ప్లాట్ మీద వర్కౌట్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. మొదటి భాగం యముడుతో పోల్చుకుంటే దాని స్థాయిలో సగమే చేరగలిగింది అని చెప్పుకొవచ్చు.

సింగం రివ్యూ: చివరగా
సింగం : యముడు -2 .. కాదు యముడు 1/2 ....  

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Singam | Singam Wallpapers | Singam Videos

మరింత సమాచారం తెలుసుకోండి: