రాశి నటన , సినిమాటోగ్రఫీరాశి నటన , సినిమాటోగ్రఫీకథనం ,అక్కడక్కడ బోరింగ్ సీన్స్
మలయాళంలో స్టార్ హీరోయిన్ అయిన స్వాతి (ఐనా సాహా) ఓ వ్యాపారి వేధింపుల నుండి తప్పించుకునే క్రమంలో హైదరాబాద్ చేరుకుంటుంది. అక్కడ సాయి (సాయి రోనక్), సుదర్శన్ లు సినిమా రంగంలో రాణించాలనే తపనతో ముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని ప్లాన్ చేస్తారు. ఆ షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా స్వాతిని సెలెక్ట్ చేస్తాడు సాయి. ఓ బంగ్లా లో షూటింగ్ చేస్తారు. అక్కడకు వెళ్లిన తర్వాత స్వాతి ప్రవర్తనలో తేడా వస్తుంది. ఆ బంగ్లాలో ఉన్న రెబాకా (రాశి)తో మంచి పరిచయం ఏర్పరచుకుంటుంది స్వాతి. తీరా చూస్తే స్వాతి హత్యకు గురయ్యిందని వార్త బయటకు వస్తుంది. స్వాతి నిజంగా హత్య చేయబడిందా..? రెబికా స్వాతిలు ఎందుకు కలుసుకున్నారు..? వారిద్దరి మధ్య సంబంధం ఏంటి..? అన్నది అసలు కథ.  

అలనాటి హీరోయిన్ రాశి లీడ్ రోల్ చేసిన ఈ లంక మూవీ తన అభిమానులకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఒకప్పటి హీరోయిన్స్ అంతా అమ్మ అక్క పాత్రలను చేస్తూ వస్తుంటే తను మాత్రం కొత్త ప్రయత్నంగా లంకతో వచ్చింది. రెబికాగా మరోసారి తన నట విశ్వరూపం చూపించింది రాశి. సినిమా ప్రమోషన్స్ లో తాను ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉండిందో తన క్యారక్టరైజేషన్ చూస్తే అర్ధమవుతుంది. ఇక హీరో హీరోయిన్ సాయి రోనక్, ఐనా సాహా లు కూడా బాగానే చేశారు. ఐనా సాహా అభినయం బాగుంది. శీజు రెండు డైఫెరెంట్ పాత్రలకు పూర్తిస్థాయి న్యాయం చేశాడు. ఇక సత్యం రాజేష్, సత్య, సుప్రీత్ లు పరిధి మేరకు నటించి మెప్పించారు. 

శ్రీముని డైరెక్ట్ చేసిన ఈ సినిమా కథ బాగానే ఉన్నట్టు అనిపించినా కథనంలో అతను సరిగా డీల్ చేయలేదని చెప్పొచ్చు. కథనం ఇంకాస్త గ్రిప్పింగ్ తో రాసుకుంటే బాగుండేది. డైరక్టర్ గా కథ వరకు పర్ఫెక్ట్ గా అనుకుని తెర మీదకు తెచ్చే ప్రయత్నంలో తప్పులు చేశాడు శ్రీముని. ఇక సినిమాలో మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు అవసరం ఉన్నంత పెట్టేశారు.

చిన్న బడ్జెట్ లో ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా చేయాలంటే అది కచ్చితంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ మాత్రమే అయ్యుండాలి. ఆ ప్రయత్నంలో ఎన్నో సినిమాలు సక్సెస్ సాధించగా అదే దారిలో వచ్చింది లంక మూవీ. కథ విషయంలో కాస్త కొత్తదనం కనిపించినా కథనంలో ఏమాత్రం ఆకట్టుకోలేదు దర్శకుడు. రాశి క్యారక్టరైజేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఇక నేరేషన్ కూడా అంతా సాగదీతగా ఉంటుంది. ఇలాంటి కథలకు ఎంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే అంత బాగుంటుంది. కాని ఆ విషయంలో చాలా పొరపాట్లే కనిపిస్తాయి. సాధారణ ప్రేక్షకుడు అర్ధం కాని రీతిలో కథ కథనాలను మార్చి కన్ ఫ్యూజ్ చేసేశారు. కొన్ని ఊహాజనిత సీన్స్ ఆడియెన్స్ నమ్మే లోపే అవి అబద్ధమంటూ చెప్పేసరికి ఏది నిజం ఏది అబద్ధం అనే డైలామాలో పడతారు ఆడియెన్స్. 

చేసిన ప్రయత్నం మంచిదే అయినా కథనంలో ఇంకా క్లారిటీతో వచ్చి ఉంటే బాగుండేది. రాశి పర్ఫార్మెన్స్ ఏదో కొద్దిసేపు థ్రిల్ ఫీల్ అవుదాం.. కథ కథనాలతో సంబంధం లేదు అనుకున్న వారు సినిమా చూసే అవకాశం ఉంది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగానే ఉన్నా పర్ఫెక్షన్ లోపం వల్ల సినిమా అంతా కన్ ఫ్యూజన్ తో నింపినట్టు కనబడుతుంది. కాస్తో కూస్తో క్లైమాక్స్ లో కాస్త జస్టి ఫై చేసినట్టు అనిపిస్తుంది. 
Raasi,Sai Ronak,Ena Saha,Sri Muni,Namana Diniesh,Sricharan Pakalaసస్పెన్స్ కాదు కన్ ఫ్యూజ్ చేసే రాశి 'లంక'..!

మరింత సమాచారం తెలుసుకోండి: