మొదటి భాగం, కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ .మొదటి భాగం, కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ .స్క్రీన్ ప్లే, డైరెక్షన్, క్యారక్టరైజేషన్
ఆనంద్ (రాహుల్) వైజాగ్ లో పిజ్జా డెలివెరీ బోయ్ గా పనిచేస్తుంటాడు. తనదైన జీవనం కొనసాగిస్తున్న ఆనంద్ లైఫ్ లోకి చైత్ర (మహిమా)వస్తుంది. ఒకే అపార్ట్ మెంట్ లో ఉండటం.. ఒకానొక ఆపద సమయాల్లో ఆనంద్ చైత్రను కాపడటంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. చైత్ర కాలేజ్ లో స్నేహితులతో భీమిలి బీచ్ కు వెళ్లడం అక్కడ ముగ్గురు రౌడిలు వారి మీద ఎటాక్ చేయడం జరుగుతుంది. ఎలాగోలా చైత్ర వారిని తప్పించుకున్నా ఇద్దరు స్నేహితులు తన బ్యాగ్ వారిదగ్గరే ఉందని.. అది కావాలంటే నువ్వు కూడా వారిదగ్గరకు వెళ్లాలని విషయం పోలీసులకు చెబితే తమ వీడియోలు యూట్యూబ్ లో పెడతారని చెబుతారు. ఇక ఏం చేయాలో తెలియని చైత్ర ఆనంద్ సహాయం తీసుకుంటుంది. ఇక సడెన్ గా కథలోకి పోలీసులు ఎంటరవుతారు. భీమిలి బీచ్ లో ఓ శవం దొరుకుతుంది. అది చైత్రదేనా..? పోలీసులు ఈ విషయంలో ఎందుకు నెగ్లెక్ట్ గా ఉంటారు..? మర్డర్ కు రౌడిలకు సంబంధం ఏంటి అనేది తెర మీద చూడాలి.       



హ్యాపీ డేస్ టైసన్ గా రాహుల్ అందరికి సుపరిచితుడే. కుర్ర హీరోలంతా ప్రయోగాలతో దూసుకెళ్తుంటే వెనుకపడ్డ రాహుల్ తను కూడా ఓ మర్డర్ క్రైం సస్పెన్స్ కథతో వచ్చాడు. ఆనంద్ గా రాహుల్ ఓకే అనిపించుకున్నా ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఎక్కడ హీరోయిజం కనిపించదు. ఇక చైత్రగా మహిమా బాగానే చేసింది. ఆమె కూడా ఇంకాస్త అభినయం కనబరాల్చిన అవసరం ఉంది. ఇక కథలో మరో లీడ్ గా చేసిన అజయ్ గోష్ కూడా బాగానే చేశాడు. చివర్లో అజయ్ అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చాడు. 



దర్శకుడు వేణు మడికంటి తీసుకున్న కథ బాగానే ఉంది అయితే దాన్ని ప్రెజెంట్ చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. మొదటి భాగం లో కొన్ని సీన్స్ ఓకే అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే చాలా మైనస్. అచ్చు మ్యూజిక్ మాములుగానే ఉంది. సినిమాటోగ్రఫీ అసలు బాలేదు.. ఎడిటింగ్ కూడా సోసోగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.



టీజర్ తో సినిమా మీద అంచనాలను పెంచేలా చేసిన వెంకటాపురం.. సినిమాతో ఆ అంచనాలను అందుకోలేకపోయింది. కథ ఎంచుకున్న విధానం బాగుంది. అయితే దాన్ని సస్పెన్స్ బాటలో నడిపించడంలో తప్పటడుగులు వేశాడు. ఏమాత్రం ఆకట్టుకోలేని కథనం సాగించడంతో సినిమా మీద ఏర్పడ్డ ఇంట్రెస్ట్ పోతుంది.


మొదటి భాగం కాస్త బాగా వర్క్ అవుట్ చేసిన దర్శకుడు వేణు సెకండ్ పార్ట్ కథను ఎటెటో తీసుకెళ్తాడు. చివరగా చెప్పాలనుకున్న పాయింట్ ఇది అని సింపుల్ గా తేల్చేస్తాడు. అప్పటిదాకా ఊరించి ఊరించి చివరకు ఇదా అన్న ఆలోచన వస్తుంది. ట్రూ స్టోరీ బేస్డ్ సినిమాగా వచ్చిన వెంకటాపురం ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వస్తే కనుక అదిరిపోయి ఉండేది.


రాహుల్ నటన కూడా ఇంకాస్త మెరుగు పడాల్సిన అవసరం ఉంది. సస్పెన్స్ అయినా సరే సాగిదీస్తే ఏమాత్రం కిక్ ఉండదని అనిపిస్తుంది. హీరో క్యారక్టరైజేషన్ విషయంలో కూడా అతనికి ఓ గోల్ అంటూ ఏం లేకుండా ఏదో అలా నడిపించేస్తాడు. ఓవరాల్ గా వెంకటాపురం టీజర్ చూసి సినిమా మీద అంచనాలు పెంచుకున్న వారు నిరాశ చెందక తప్పదు. 



Rahul,Mahima Makhwana,Venu Madikanti,Good Friends,Achuఅంచనాలను అందుకోలేని 'వెంకటాపురం'.

మరింత సమాచారం తెలుసుకోండి: