నిఖిల్ పర్ఫార్మెన్స్ , స్క్రీన్ ప్లే , డ్యూరేషన్నిఖిల్ పర్ఫార్మెన్స్ , స్క్రీన్ ప్లే , డ్యూరేషన్రొటీన్ రివెంజ్ స్టోరీ , సెకండ్ హాఫ్ స్లో
కాకినాడలో స్టూడెంట్ అయిన కేశవ శర్మ(నిఖిల్) వరుసగా పోలీసులను హత్య చేస్తుంటాడు. తను చేసిన హత్యలకు ఒక్క క్లూ దొరకకుండా చూస్తుంటాడు. కేశవకు కుడి పక్కన గుండె ఉంటుంది. కొద్దిపాటి టెన్షన్ పడినా గుండె ఆగిపోతుంది. ఇక కాలేజ్ లో తన చిన్న నాటి స్నేహితురాలు సత్య భామ (రీతు వర్మ) కేశవకు దగ్గరవుతుంది. వరుస హత్యలు జరుగుతుండటంతో పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఆఫీసర్ షర్మిల మిశ్రా (ఇషా కొప్పికర్)కు కేస్ అప్పగిస్తారు. ఈ హత్యలన్ని కేశవ చేస్తున్నాడని అనుమానంతో షర్మిలా కేశవని అరెస్ట్ చేస్తుంది. అసలు కేశవ పోలీసులను ఎందుకు చంపుతాడు..? అతనికి పోలీసులు చేసిన అన్యాయం ఏంటి..? స్పెషల్ ఆఫీసర్ షర్మిలా ఈ కేస్ ఎలా ముగించింది..? అన్నది అసలు కథ.     

కేశవగా నటించిన నిఖిల్ మరోసారి తనదైన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమా కోసం నిఖిల్ ఎంత కష్టపడ్డాడు అన్నది తెర మీద ప్రతి ఫ్రేంలో కనబడుతుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నిఖిల్ కేశవతో కూడా సక్సెస్ అందుకున్నట్టే. నటనతో సినిమా సినిమాకు తన విలక్షణతను చాటుకుంటున్నాడు. ఇక సత్యభామగా రీతు వర్మ కూడా బాగానే చేసింది. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ గా ఇషా చాలా రోజుల తర్వాత తెలుగులో మళ్లీ తమ మార్క్ నటనతో ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్, ప్రియదర్శి కామెడీ ఏదో పర్వాలేదు అన్నట్టు ఉంది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

స్వామిరారా తర్వాత సుధీర్ వర్మ నిఖిల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ కేశవ కోసం సుధీర్ వర్మ బాగానే కష్టపడ్డాడు. ముఖ్యంగా నిఖిల్ క్యారక్టరైజేషన్ విషయంలో కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. స్క్రీన్ ప్లే తో పాటుగా టేకింగ్ కూడా అద్భుతంగా ఉంది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ ఓకే, మ్యూజిక్ కూడా బాగానే ఉంది. అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

రొటీన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి విభిన్న కథతో సినిమాలు చేస్తున్న నిఖిల్ వరుస సక్సెస్ లతో ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇక ఈరోజు వచ్చిన కేశవ పాజిటివ్ ప్రీ రిలీజ్ టాక్ ఉంది. ఎంచుకున్న ఓ రివెంజ్ డ్రామాకు హీరో క్యారక్టరైజేషన్ కొత్తగా చెప్పాలనుకోవడం మంచి విషయమే. అయితే రివెంజ్ అన్నాక కాస్త నాటకీయత అవసరం కాబట్టి అక్కడ సినిమా కాస్త ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది.

కథకు అవసరమైన అంశాలే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డ సుధీర్ వర్మ సినిమా ఫస్ట్ హాఫ్ హత్యలతో రొటీన్ చేసినా ఎంటర్టైన్ చేశాడు కాని సెకండ్ హాఫ్ ట్విస్ట్ వీడేదాకా కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సినిమా నిడివి తక్కువే కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదు.

ఇక ప్రీ క్లైమాక్స్ తో పాటుగా క్లైమాక్స్ కూడా మళ్లీ గ్రిప్పింగ్ తో రాసుకున్నాడు సుధీర్ వర్మ. రొటీన్ సినిమాలు చూసి విసుగొచ్చిన ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. లాజిక్ లు ఆలోచించకుండా సినిమా చూస్తే ఎంటర్టైన్ అవడం ఖాయం.


Nikhil Siddharth,Ritu Varma,Isha Koppikar,Sudheer Varma,Abhishek Nama,Sunny MRనిఖిల్ 'కేశవ' మెప్పించేశాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: