నాగ చైతన్య, రకుల్ నటన , మ్యూజిక్నాగ చైతన్య, రకుల్ నటన , మ్యూజిక్రొటీన్ స్టోరీ ,అక్కడక్కడ ల్యాగ్ అవడం

భ్రమరాంబ (రకుల్ ప్రీత్ సింగ్) ఓ సరదా అమ్మాయి. పల్లెటూరిలో పెరిగిన రకుల్ మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉన్నా ఇట్టే బయట పెట్టేస్తుంది. తండ్రి సంపత్ అంటే చాలా ఇష్టమున్న భ్రమరాంబ తండ్రి మాట జవ దాటదు. సిటీకి వెళ్లాల్సి వచ్చిన భ్రమరాంబకు అమ్మ ఆంక్షలు పెడుతుంది. భ్రమరాంబను చూడగానే ప్రేమలో పడతాడు శివ (నాగ చైతన్య). తనతో ప్రేమ అంటూ వెంటపడొద్దని శివను హెచ్చరిస్తుంది భ్రమరాంబ. శివ, భ్రమరాంబ ఒకరినొకరు ఇష్టపడుతున్నా తండ్రి మీద ప్రేమతో అతనికి గుడ్ బై చెప్పి వెళ్తుంది. శివ తండ్రికి భ్రమరాంబ తండ్రికి కూడా సంబంధం ఉంటుంది. ఇంతకీ శివ భ్రమరాంబ కలిశారా..? భ్రమరాంబ కోసం శివ ఏం చేశాడు అన్నది అసలు కథ.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో శివ రోల్ లో ఆకట్టుకున్నాడు నాగ చైతన్య. లవర్ బోయ్ ఇమేజ్ తో నాగ చైతన్య తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. స్క్రీన్ పై చైతు, రకుల్ ల జంట చూడముచ్చటగా ఉంటుంది. ఇక భ్రమరాంబగా రకుల్ అదరగొట్టేసింది. అల్లరి పిల్లగా రకుల్ మరోసారి తన టాలెంట్ చూపించేసింది. జగపతి బాబు తన హుందాతనంతో ఆకట్టుకోగా సంపత్ రాజు కూడా ఇచ్చిన రోల్ కు న్యాయం చేశాడు. వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించారు.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఓ రొటీన్ కథతోనే వచ్చాడు. అయితే సినిమా మొత్తం కలర్ ఫుల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కథ పాతదే అయినా కథనంలో కాస్త తన టాలెంట్ చూపించేశాడు. దేవి మ్యూజిక్ బాగుంది. సినిమాకు అదే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక కెమెరా మన్ పనితనం కూడా పర్వాలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు నుండి వచ్చిన మరో కలర్ ఫుల్ మూవీ రారండోయ్ వేడుక చూద్దాం. నాగ చైతన్య రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమా కథ పాతదే అయినా కథనంలో కాస్త కొత్తదనం చూపించాడు. సినిమా అంతా కలర్ ఫుల్ గా ఓ వేడుకలా ఉండేలా చూడటంలో జాగ్రత్త పడ్డాడు దర్శకుడు.

మొదటి పార్ట్ రకుల్ క్యారక్టరైజేషన్ మీద హీరో హీరోయిన్ కాంబినేషన్ మీద దృష్టి పెట్టిన కళ్యాణ్ కృష్ణ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి కాని సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. కథలో కొత్తదనం ఇంకా ట్విస్ట్ లు కూడా ఏం లేకపోవడం వల్ల సినిమాలో సర్ ప్రైజ్ లు ఏవి ఉండవు.

సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకుంటూ వచ్చిన నిన్నే పెళ్లాడతా లాంటి ఫీల్ తీసుకు వచ్చాడు డైరక్టర్. ముఖ్యంగా స్క్రీన్ పై చైతు, రకుల్ జంట చూడముచ్చటగా ఉంటుంది. క్లైమాక్స్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ మీద నడిపించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది.  ఫ్యామిలీ మొత్తం సరదాగా చూడటం కోసం మాత్రం ఓసారి చూసేయొచ్చు.
Naga Chaitanya,Rakul Preet Singh,Kalyan Krishna Kurasala,Nagarjuna Akkineni,Devi Sri Prasadరొటీన్ కథతోనే వేడుక చూపించారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: